బీష్మ. క్యూబ్ (BHISM) భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహాయోగ్ హిత మరియు మైత్రి) ఆరోగ్య మైత్రి యొక్క క్యూబ్.
******************
సిరిసిల్ల.రాజా విక్రాంత్ శర్మ ( 9963349493 / 9348422113)
*******************
నానాటికి వైద్య సదుపాయాలు ప్రజల ముంగిట్లోకి తేవడానికి వివిధ రకాల సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రాష్ట్రాలు వివిధ పద్ధతుల్లో అనుసరిస్తున్నాయి.
గ్రామీణ స్థాయిలో మొబైల్ వ్యాన్ సౌకర్యాలు, పశువుల ఆరోగ్యం కోసం కూడా మొబైల్ వాహనాలు ప్రజల ముగింటికి వచ్చి సేవలందిస్తున్నాయి.
ఇదిలా ఉండగా భారత ప్రభుత్వం ఇటీవల అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవంలో అత్యవసర సమయంలో వైద్య సేవల కోసం ప్రారంభించింది ఆరోగ్య మైత్రి ప్రాజెక్ట్.
పోర్టబుల్ ఆసుపత్రి యొక్క ప్రత్యేక ఉపయోగాలు :
భీష్మ క్యూబ్ దీని ముఖ్య ఉద్దేశం అత్యాధునిక మొబైల్ ఆసుపత్రి అనవచ్చు.
ఇది ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు, మానవ సంక్షోభాలు తలెత్తినప్పుడు, ఆసుపత్రులు సుదూర ముగా ఉండి రవాణా సౌకర్యాలు సరిగా లేనప్పుడు వేగవంతంగా వైద్య సేవలు అందించడానికి ఉద్దేశించినది
ఆరోగ్యం మైత్రి ప్రాజెక్ట్...పని చేసే విధానం :
దీని ద్వారా 200 మంది క్షతగాత్రులకు చికిత్స చేయడానికి అనువుగా ఉంటుంది. ఇది భూమిని చేరుకోగానే విప్పుకొని తన సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. దీన్ని పోర్టబుల్ ఆసుపత్రిగా భావిస్తారు. కేవలం 8 నిమిషాల్లో ఆసుపత్రిని సిద్ధం చేసి రోగులకు చికిత్స ప్రారంభించవచ్చు.
ఆరోగ్య మైత్రి ప్రాజెక్ట్ రూప కల్పన విధానం. :
దీనిలో 72 క్యూబ్ లను కలిగి ఉంటుంది. రెండు మాస్టర్ క్యూబ్ లు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యేలా రూపొందించబడ్డాయి. దీనిలో మినీ ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, విద్యుత్ జనరేటర్, రక్తపరీక్ష పరికరాలు, ఎక్స్ రే యంత్రం వంటి వైద్య పరికరాలు ఉంటాయి.
ఆరోగ్య మైత్రి ప్రాజెక్ట్ అందించే వైద్య సేవలు :
ఈ పోర్టబుల్ ఆసుపత్రి తుపాకీ కాల్పులు, కాలిన గాయాలు, తల, వెన్నుపాము, మరియు చాతి గాయాలు, చిన్నపాటి శస్త్ర చికిత్సలు, పగుళ్లు మరియు పెద్ద రక్తస్రావం వంటి వాటిని నిర్వహించగలదు. ఈ ఆసుపత్రిని విమాన మార్గంలో, భూమి ద్వారా లేదా సముద్రం ద్వారా ఎక్కడికైనా పంపవచ్చు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వాసవి మాత ఆలయంలో ఘనంగా గురువారాల ఏకాదశి ఉద్యాపన ఉత్సవము

సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం 8లక్షల ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్రీ సూర్య ధనవంతరి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, సైనికులకు మనోధైర్యం కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు

జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి. -విశ్వహిందూ పరిషత్ నాయకులు

సూర్య ధన్వంతరి సప్తమ బ్రహ్మోత్సవాలు

భారత సైన్యానికి మద్దతుగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..
