శ్రీ సరస్వతీ శిశు మందిర్ పదవ తరగతి విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకలు

On
శ్రీ సరస్వతీ శిశు మందిర్ పదవ తరగతి విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకలు

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల ఏప్రిల్ 28 ( ప్రజా మంటలు)

పదవ తరగతి పూర్తి చేసుకుని 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జగిత్యాల పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు.

ఆదివారం వశిష్ట ఇన్ హోటల్లో నిర్వహించిన ఈ వేడుకలలో 1998-99 సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను ఉపాధ్యాయులతో కలిసి పాలుపంచుకున్నారు.

అనంతరం ఉపాధ్యాయులను విద్యార్థులు శాలువాలతో సత్కరించి ఆటపాటలతో వేడుకలను నిర్వహించుకున్నారు.

Tags