ఉత్తర భారతాన పట్టు తప్పుతున్న బిజేపి చాణక్యం ? అధికారానికి దూరం అవుతామనే మోడి భయమా?

On
ఉత్తర భారతాన పట్టు తప్పుతున్న బిజేపి చాణక్యం ?  అధికారానికి దూరం అవుతామనే మోడి భయమా?

మళ్ళీ ఎందుకు ముస్లింల ప్రస్తావన ? హజ్ యాత్రికులకు ఎందుకు మరిన్ని సౌకర్యాలు ? ఎక్కువ హజ్ వీసాల కొరకు మోడి ప్రయత్నం ?  రాజస్తాన్ లో ముస్లింలపై ద్వేషం – అలీగఢ్ ముస్లింలపై ప్రేమ ?

ఉత్తర భారతాన పట్టు తప్పుతున్న బిజేపి చాణక్యం ?

అధికారానికి దూరం అవుతామనే మోడి భయమా?

మొదటి దశలో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు ఎన్నికలకు దూరంగా ఉన్నారా ?

బీహార్, ఉత్తర ప్రదేశ్ లో ఎందుకు బిజేపి నాయకులు పార్టీని విడుతున్నారు?

మళ్ళీ ఎందుకు ముస్లింల ప్రస్తావన ?

హజ్ యాత్రికులకు ఎందుకు మరిన్ని సౌకర్యాలు ?

ఎక్కువ హజ్ వీసాల కొరకు మోడి ప్రయత్నం ? 

రాజస్తాన్ లో ముస్లింలపై ద్వేషం – అలీగఢ్ ముస్లింలపై ప్రేమ ?

ప్రధాని ద్వంద నీతికి, ఆధికార దాహానికి ప్రతీకా?

బిజేపికి - ఆర్ ఎస్ ఎస్ నాయకత్వంతో దూరం పేరుగుతుందా? 

సబ్ కా సాత్ – సబ్ కా సాత్ లో ముస్లింలు లేరా?

మొదటి దశలో తగ్గిన పోలింగ్ బిజేపికి వ్యతిరేకమా?

(మోడి ప్రసంగ ప్రభావం, బిజేపి భయానికి నిదర్శనమా .. పూర్తి విశ్లేషణ )

 (సిహెచ్ వి ప్రభాకర్ రావు)

హైదరాబాద్ ఏప్రిల్ 23 :

మొదటి దశ ఎన్నికలు ముగిసిన వెంటనే బిజేపికి అందిన సమాచారంతో , బిజేపి నాయకులలో అలజడి మొదలైనట్లు హిందీ రాష్ట్రాల నుండి వస్తున్న వార్తలు చేఉతున్నాయి. అందుకే మోడి కాంగ్రెస్ ను ముస్లింలకు లబ్ది చేకూర్చే పార్టీల అభివర్ణిస్తూ, విద్వేష పూరిత ప్రసంగాలు చేస్తున్నట్లు భావిస్తున్నారు. రాజస్తాన్ సభలో మోడి చేసిన విద్వేష పోర్టియా ప్రసంగం పట్ల దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం కావడంతో, రెండు రోజులకే అలీగఢ్త్ సభలో హజ్ యాత్రికులకు లబ్ది చేకూరుస్తున్నట్లు చెప్పుకొన్నారు. రాజస్తాన్ లో చెప్పిన కాంగ్రెస్ మేనిఫెస్టో, ఉత్తర ప్రదేశ్ లో  వర్తించాడా లేక అక్కడి ప్రజలు, ఇక్కడి ప్రజలు వేరా అని చర్చించుకొంటూన్నారు.

ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు ఎన్నో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేయడం సహజం. గల్లీ లీడర్ నుండి డిల్లీ లీడర్ వరకు ఎదుటి పక్షం పై విమర్శలు చేయడం సహజం. కానీ వారి భాషలో, మాటలో కొంత తేడా ఉంటుంది. దేశ ప్రధాని స్థాయి నాయకుడు కూడా గల్లీ లీడర్ స్థాయిలో మాట్లాడితేనే దేశ ప్రజలకు అభ్యంతరం వ్యక్తం చేయని తప్పని సారి పరిస్థితి ఏర్పడుతుంది. విశ్వ గురువు స్థాయి నేత మాటలను దేశ ప్రజలే కాకుండా, విదేశ ప్రజలు, నాయకులు గమనిస్తారనే కనీస అవగాహన ఉండాలనుకోవడం అత్యాశ కాదు.

   రాజస్తాన్ లోని    బాన్స్ వాఢ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీ సభలో ఏప్రిల్ 21, ఆదివారం మాట్లాడిన మాటలు రాజకీయ, ప్రతిపక్ష నాయకులనే కాదు సాధారణ పౌరులకు కూడా ఆశ్చర్యానికి గురిచేసాయి.

కాంగ్రెస్ మంగళసూత్రాలను లాగేసుకొంటుందా?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, అందరి ఆస్తులను, చివరికి మంగళ సూత్రాలను కూడా లాక్కొని ఎక్కువ పిల్లలు ఉన్నా వారికి, రబాటుదారులకు(ముస్లింలకు) ఇస్తారని చెప్పడం, దిగజారిన రాజకీయాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  ముందు నుండి  బిజేపికి, అందులో నరేంద్ర మోడీకి ముస్లిం లు అంటే మరీ ద్వేషమని అందరికీ తెలుసు.

రాజస్తాన్ లో మొదటి దశ పోలింగ్ జరిగిన 12 లోక సభ స్థానాలలో గతంలో కంటే దాదాపు 6 శాతం ఓటింగ్ తగ్గిందని లెక్కలు చెపుతున్నాయి. ముఖ్యంగా నగర, పట్టణ ప్రాంతాలలో ప్రజలు వోటు వేయడానికి సుముఖత చూపలేదని సమాచారం. బిజేపి, ఆర్ ఎస్ ఎస్  కార్యకర్తలు పోలింగ్ రోజు నిరాసక్తతతో, నిర్లిప్తంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే మిగతా రాష్ట్రాలలో కూడా బిజేపికి అనుకున్న రీతిలో వోట్లు పడలేదని, గతంలో గెలిచిన సీట్లు కూడా గెలవలేక పోతున్నట్లు నిఘా వర్గాల సమాచారంగా తెలుస్తుంది. ముఖ్యంగా, ఆదివాసీలు, ముస్లిములు, గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు వోటు వేసినా, మద్యతరగతి ప్రజలు ఓటింగ్ పట్ల నిరాసక్తత చూపినట్లు తెలుస్తుంది.

నాగపూర్ ఆర్ ఎస్ ఎస్  కేంద్రంలో ఏం జరిగింది?

అంతకు ముందే అంటే ఏప్రిల్ 19 న నాగపూర్ లోని ఆర్ ఎస్ ఎస్ కేంద్ర కార్యాలయానికి వెళ్ళిన మోడిని, సర్ సంఘ చాలక్ మోహన్ భాగవత్ కూడా కాలవలేదనే సమాచారం. ఒక రాత్రంతా నాగపూర్ లో ఉన్నా, నితిన్ గడ్కారీ ని కూడా కలవలేదు. ఆర్ ఎస్ ఎస్ ముఖ్యలు ఎందుకు ప్రధానిని కాలవలేక పోయారు? ఆర్ ఎస్ ఎస్ తో ప్రధాని కి ఛేదిందా? ఇవన్నీ భేతాళ ప్రశ్నలే.  నాగపూర్ లో మోడి అనుకున్న రీతిలో, ఆర్ ఎస్ ఎస్ నుండి స్పందన రాలేదనే ప్రచారం జరుగుతుంది. అదే వేడిలో రాజస్తాన్ వచ్చిన మోడి, కాంగ్రెస్ పార్టీ “న్యాయ పత్ర” (మానిఫెస్టో)లో దేశ సంపాదనంతా ముస్లింలకే పంచుతారని, చివరికి మంగళ సూత్రాలను కూడా దక్కనీయరాని మాట్లాడారు.

నిజానికి “మంగళ సూత్రం: అనేది దక్షిణ భారత దేశ ప్రజల పవిత్రమైన భార్యాభర్తల బంధానికి ప్రతీక.  ఈ ఆచారం, మంగళసూత్రం కట్టడం అనేది ఉత్తర భారత దేశంలో లేనే లేదు. అక్కడ నుదుట కుంకుమ దిద్దాడమే ఆచారం. మరో రకమైన ఆచారం లో పెళ్ళిళ్ళు జరుగుతాయి. మారిన కాలంలో, సినిమా, సటివి సీరియల్ ల ప్రభావంతో ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా నగరాలలో మంగళ సూత్రం అనే దానికి కొంత ప్రాధాన్యత ఏర్పడుతుందని అనుకొంటున్నారు. లేని “మంగళ సూత్రం” ను కాంగ్రెస్ లాగేసుకొని, ముస్లిం లకు ఇస్తుందనడం, ప్రధాని లో ఏర్పడ్డ నిరాశ,నిస్పృహలకు నిదర్శనంగా చెప్పుకొంటున్నారు.

అలిగఢ్ లో ముస్లింలపై  పొంగిన ప్రేమ

రెండు రోజుల్లో ప్రధాని మాటలలో మళ్ళీ ప్రేమ పొంగిపొరలడం, ఆయా ప్రాంతాలలో తమ అవసరాలకు అనుగుణంగా ముస్లింలను వాడుకొనే ప్రయత్నం చేస్తున్నారనడానికి, ఆయనకు ఎన్నికలు, వోట్లు, అధికారం కన్నా ఏది ప్రధానం కాదని మోడి అలిగఢ్ లో చేసిన ప్రసంగమే చెపుతుంది. రాజస్తాన్ లో ముస్లిం ల వోట్ల కన్నా హిందువుల వవట్లే ఎక్కువ. కానీ అలిగఢ్  చుట్టుప్రక్కల ఉన్న నియోజకవర్గాలలో ముస్లింల వోట్లు ఎక్కువ. వారిని మచ్చిక చేసుకోవడానికే ప్రధాని మోడి “ హజ్ యాతరలో ముస్లిం మహిళలు, భారత దేశం నుండి పోయే వారికి సులువైన వీసా సౌకర్యం, ఎక్కువ కోటా” లాంటి  విషయాలలో తాను సౌదీ  దేశ అధికారుయాలతో, రాజుతో మాట్లాడి, భారతీయ ముస్లిం లకు ఎంతో మేలు చేసానని చెప్పుకొన్నారు.

వోట్ల కొరకు జాతుల మధ్య, వర్గాల మధ్య, మతాల మధ్య విద్వేషాలను పెంచడానికి ఏ మాత్రం వెనుకాడరాని ఈ రెండు చోట్ల జరిగిన సభలలో ప్రధాని మోడి చేసిన ప్రసంగాలు స్పష్టం చేస్తున్నాయి.  మాట విద్వేష పూరిత ప్రసంగాలు చేయడం ఎన్నికల నిబందనల ప్రకారం నిషేదం.  దీనిపై ఎన్నికల కమీషన్ కు వందలాది ఫిర్యాదులు అందాయి. ఎన్నికల కమీషన్ నిర్లజ్జగా, ఇలాంటి అన్నిరకాల బిజేపి ప్రచారాన్ని చూసి, చూడనట్లుగా ఉండడం ప్రజాస్వామ్యానికి చెడు అని పరిశీలకులు భావిస్తున్నారు.

 

----

 

 

 

 

Tags
Join WhatsApp

More News...

Local News 

ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వేడుకలు శ్రీ నరసింహ స్వామి జయంతి ప్రత్యేక వేడుకలు

ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వేడుకలు  శ్రీ నరసింహ స్వామి జయంతి ప్రత్యేక వేడుకలు    జగిత్యాల ఏప్రిల్ 30 (ప్రజా మంటలు)  పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో గురువారం ఉదయం 11 గంటలకు బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా   నవగ్రహ పూజా  అలాగే సంతాన గోపాల హోమ పూజా కార్యక్రమంలో...
Read More...
Local News 

కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ కు ప్రతిష్టాత్మక దళిత రత్న పురస్కారం 

కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ కు ప్రతిష్టాత్మక దళిత రత్న పురస్కారం     కోరుట్ల, ఏప్రిల్ 30(ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది  బైరి విజయ్ కుమార్ దళిత రత్న పురస్కారం అందించారు. గురువారం  హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో డా. బాబు జగ్జీవన్ రామ్, డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్...
Read More...
Local News 

సినీ దర్శకుడు బండి రఘురాం కన్నుమూత

సినీ దర్శకుడు బండి రఘురాం కన్నుమూత హైదరాబాద్, ఏప్రిల్ 30 (ప్రజా మంటలు): జగిత్యాలకు చెందిన సినీ దర్శకుడు బండి రఘురాం ఏప్రిల్ 28న కన్నుమూశారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో నివాసముంటున్న ఆయన సాయంత్రం పార్క్‌లో నడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి సినీ, జర్నలిజం వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.రఘురాం జగిత్యాలకు చెందిన బండి...
Read More...
Local News 

ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ ఎస్ ఎస్ సి ర్యాంకర్లకు అభినందనలు

ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ ఎస్ ఎస్ సి ర్యాంకర్లకు అభినందనలు జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రానికి చెందిన ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ కు చెందిన సింగిడి చక్రిత 561/600, ఎంబారి చరణ్ 547/600 బుధవారం విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించినారు. 500 పైబడి 45 శాతం విద్యార్థులు ఫలితాలు సాధించారు. 100% విద్యార్థులు ఉత్తీర్ణత...
Read More...
Local News 

ఎస్ఎస్ఎస్సి లో578/600 మార్కులు సాధించిన పాలెపు హాసిని శర్మను అభినందించిన పాఠశాల యాజమాన్యం

ఎస్ఎస్ఎస్సి లో578/600 మార్కులు సాధించిన పాలెపు హాసిని శర్మను అభినందించిన పాఠశాల యాజమాన్యం జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు)  పొలాస గ్రామానికి చెందిన పాలెపు రాజు కూతురు పాలెపు హాసిని శర్మ జిల్లా కేంద్రంలోని శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాలలో చదువుచున్నది. బుధవారం విడుదలైన ఎస్ఎస్ఎస్సి ఫలితాలలో 578/600 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాల కరస్పాండెంట్ ఎం రాజేందర్ ప్రిన్సిపల్ మేఘమాల డైరెక్టర్
Read More...
Local News 

SSC ఫలితాలలో  రాష్ట్ర స్థాయిలో సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

SSC ఫలితాలలో  రాష్ట్ర స్థాయిలో సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం    జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు) పట్టణంలోని సిద్ధార్థ విద్యా సంస్థలు  మరోసారి తమ ప్రతిభను చాటుకుంటూ SSC ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో అద్భుత విజయాన్ని సాధించాయి.  ఈరోజు విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్ర స్థాయి లో 591, 590  మార్కులతో  జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. అదే విధంగా...
Read More...
Local News 

పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయాలి-రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయాలి-రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి ఏప్రిల్ 28 (ప్రజా మంటలు) రానున్న 2027  గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై  సమీక్షపుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.2027లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల నేపథ్యంలో చేపట్టాల్సిన భూసేకరణ (ల్యాండ్ అక్విజిషన్) మరియు దేవాలయ అభివృద్ధి పనులపై  టెంపుల్ మాస్టర్...
Read More...
Local News 

రాష్ట్ర ప్రభుత్వం వాసవి మాత జయంతి ప్రభుత్వ పరంగా నిర్వహించడం హర్షణీయం... - ఎమ్మెల్యే సంజయ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం వాసవి మాత జయంతి ప్రభుత్వ పరంగా నిర్వహించడం హర్షణీయం...  - ఎమ్మెల్యే సంజయ్ కుమార్    జగిత్యాల ఏప్రిల్ 26 (ప్రజా మంటలు) శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణం లో ఆర్య వైశ్య సంఘం ఆద్వర్యం లో జయంతి వేడుకల్లో పాల్గొని పోచమ్మ ఆలయం నుండి వాసవి మాత ఆలయానికి వాసవి కన్యకా పరమేశ్వరి మాతని పల్లకిలో తీసుకొచ్చే కార్యక్రమంలో పాల్గొని పల్లకి మోసి ప్రత్యేక...
Read More...
Local News 

ఘనంగా వాసవీ మాత జయంతి వేడుకలు

ఘనంగా వాసవీ మాత జయంతి వేడుకలు జగిత్యాల ఏప్రిల్ 26 ( ప్రజా మంటలు)  జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో  వాసవీ మాత జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి. ఎస్.లత పాల్గొన్నారు.*ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్.లత మాట్లాడుతూ*  వాసవీ మాత        
Read More...
Local News 

ఈత సరదాకు వెళ్ళి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు

ఈత సరదాకు వెళ్ళి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు    బుగ్గారం ఏప్రిల్ 26 ( ప్రజా మంటలు)  సర్పంచ్ లు గ్రామాలలో టామ్ - టామ్ చేయించాలి బుగ్గారం ఎస్సై జి.సతీష్  వేసవి కాలం కదా అని ఈత సరదాతో బావుల్లోకి, చెరువుళ్ళోకి  వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని జగిత్యాల జిల్లా బుగ్గారం ఎస్సై జి.సతీష్ అన్నారు. ఆదివారం ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక...
Read More...
Local News  Crime 

పెళ్లి వేడుకలో విషాదం – సరదా ఈత ప్రాణం తీసింది… 13 ఏళ్ల బాలుడు మృతి

పెళ్లి వేడుకలో విషాదం – సరదా ఈత ప్రాణం తీసింది… 13 ఏళ్ల బాలుడు మృతి గొల్లపల్లి, ఏప్రిల్ 26 (ప్రజా మంటలు): పెళ్లి వేడుకలో పాల్గొన్న అనంతరం సరదాగా ఈతకు వెళ్లిన బాలుడు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఘటన జగిత్యాల జిల్లాలో విషాదాన్ని నింపింది.బుగ్గారం మండలం బీర్సాని గ్రామానికి చెందిన కాంపెళ్లి రితేష్ (13) గొల్లపల్లి మండలం లోతునూరు గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యాడు. మధ్యాహ్న సమయంలో స్నేహితులతో...
Read More...
Local News 

ఘనంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు

ఘనంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు . జగిత్యాల ఏప్రిల్ 26( ప్రజా మంటలు)వాల్మీకి ఆవాసం సేవాభారతి అధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆదివారం ఉదయం 11 గంటలకు ఘనంగా నిర్వహించారు. జగిత్యాల పట్టణం ధరూర్ క్యాంపులో గ్రామీణ నిరుపేద విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న  వాల్మీకి ఆవాసంలో ప్రతి సంవత్సరం వేసవి సెలవుల అనంతరం సామూహిక సత్యనారాయణ స్వామి...
Read More...