పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయాలి-రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

On


ధర్మపురి ఏప్రిల్ 28 (ప్రజా మంటలు)

రానున్న 2027  గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై  సమీక్ష
పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
2027లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల నేపథ్యంలో చేపట్టాల్సిన భూసేకరణ (ల్యాండ్ అక్విజిషన్) మరియు దేవాలయ అభివృద్ధి పనులపై  టెంపుల్ మాస్టర్ ప్లాన్, గోదావరి నది తీరం వెంట పుష్కర ఘాట్లు పై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ ఎం.హనుమంతరావు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్  తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

 రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ

IMG-20260428-WA0164(1)

రానున్న గోదావరి పుష్కరాలు 2027 రాష్ట్రానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆధ్యాత్మిక కార్యక్రమమని తెలిపారు. పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని పేర్కొన్నారు. అందువల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా సమగ్ర ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పుష్కరాలకు అవసరమైన భూముల సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి అభివృద్ధి పనులను ఏర్పాట్లను త్వరితగతిన ప్రారంభించాలని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ 

 

2027 గోదావరి పుష్కరాల సందర్భంగా ధర్మపురి క్షేత్రానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. ఘాట్లు, రహదారులు, పార్కింగ్ స్థలాలు, తాగునీరు, పారిశుధ్యం, భద్రత వంటి మౌలిక సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పుష్కరాల ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్  (స్థానిక సంస్థల) బి రాజ గౌడ్ , జగిత్యాల  ఆర్డీవో మధుసూదన్, ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఈవో శ్రీనివాస్,మున్సిపల్  కమిషనర్, శ్రీనివాస్, ఆర్ అండ్ బి ఈ ఈ శ్రీనివాస్, పంచాయితీ ఈ ఈ పి ఆర్, ధర్మపురి తహసీల్దార్ శ్రీనివాస్,మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్న దేవదాయ కమిషనర్ ఎం హనుమంతరావు 

IMG-20260428-WA0120

మంగళవారం పవిత్ర పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దేవదాయ శాఖ కమిషనర్ ఎం హనుమంతరావు బుధవారం సందర్శించారు .ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం మంగళ   వాద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ ఈవో స్వామివారి శేష వస్త్రంతో ప్రసాదం అందజేశారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. 

Tags
Join WhatsApp

More News...

Local News 

ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వేడుకలు శ్రీ నరసింహ స్వామి జయంతి ప్రత్యేక వేడుకలు

ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వేడుకలు  శ్రీ నరసింహ స్వామి జయంతి ప్రత్యేక వేడుకలు    జగిత్యాల ఏప్రిల్ 30 (ప్రజా మంటలు)  పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో గురువారం ఉదయం 11 గంటలకు బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా   నవగ్రహ పూజా  అలాగే సంతాన గోపాల హోమ పూజా కార్యక్రమంలో...
Read More...
Local News 

కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ కు ప్రతిష్టాత్మక దళిత రత్న పురస్కారం 

కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ కు ప్రతిష్టాత్మక దళిత రత్న పురస్కారం     కోరుట్ల, ఏప్రిల్ 30(ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది  బైరి విజయ్ కుమార్ దళిత రత్న పురస్కారం అందించారు. గురువారం  హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో డా. బాబు జగ్జీవన్ రామ్, డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్...
Read More...
Local News 

సినీ దర్శకుడు బండి రఘురాం కన్నుమూత

సినీ దర్శకుడు బండి రఘురాం కన్నుమూత హైదరాబాద్, ఏప్రిల్ 30 (ప్రజా మంటలు): జగిత్యాలకు చెందిన సినీ దర్శకుడు బండి రఘురాం ఏప్రిల్ 28న కన్నుమూశారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో నివాసముంటున్న ఆయన సాయంత్రం పార్క్‌లో నడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి సినీ, జర్నలిజం వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.రఘురాం జగిత్యాలకు చెందిన బండి...
Read More...
Local News 

ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ ఎస్ ఎస్ సి ర్యాంకర్లకు అభినందనలు

ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ ఎస్ ఎస్ సి ర్యాంకర్లకు అభినందనలు జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రానికి చెందిన ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ కు చెందిన సింగిడి చక్రిత 561/600, ఎంబారి చరణ్ 547/600 బుధవారం విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించినారు. 500 పైబడి 45 శాతం విద్యార్థులు ఫలితాలు సాధించారు. 100% విద్యార్థులు ఉత్తీర్ణత...
Read More...
Local News 

ఎస్ఎస్ఎస్సి లో578/600 మార్కులు సాధించిన పాలెపు హాసిని శర్మను అభినందించిన పాఠశాల యాజమాన్యం

ఎస్ఎస్ఎస్సి లో578/600 మార్కులు సాధించిన పాలెపు హాసిని శర్మను అభినందించిన పాఠశాల యాజమాన్యం జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు)  పొలాస గ్రామానికి చెందిన పాలెపు రాజు కూతురు పాలెపు హాసిని శర్మ జిల్లా కేంద్రంలోని శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాలలో చదువుచున్నది. బుధవారం విడుదలైన ఎస్ఎస్ఎస్సి ఫలితాలలో 578/600 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాల కరస్పాండెంట్ ఎం రాజేందర్ ప్రిన్సిపల్ మేఘమాల డైరెక్టర్
Read More...
Local News 

SSC ఫలితాలలో  రాష్ట్ర స్థాయిలో సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

SSC ఫలితాలలో  రాష్ట్ర స్థాయిలో సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం    జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు) పట్టణంలోని సిద్ధార్థ విద్యా సంస్థలు  మరోసారి తమ ప్రతిభను చాటుకుంటూ SSC ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో అద్భుత విజయాన్ని సాధించాయి.  ఈరోజు విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్ర స్థాయి లో 591, 590  మార్కులతో  జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. అదే విధంగా...
Read More...
Local News 

పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయాలి-రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయాలి-రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి ఏప్రిల్ 28 (ప్రజా మంటలు) రానున్న 2027  గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై  సమీక్షపుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.2027లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల నేపథ్యంలో చేపట్టాల్సిన భూసేకరణ (ల్యాండ్ అక్విజిషన్) మరియు దేవాలయ అభివృద్ధి పనులపై  టెంపుల్ మాస్టర్...
Read More...
Local News 

రాష్ట్ర ప్రభుత్వం వాసవి మాత జయంతి ప్రభుత్వ పరంగా నిర్వహించడం హర్షణీయం... - ఎమ్మెల్యే సంజయ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం వాసవి మాత జయంతి ప్రభుత్వ పరంగా నిర్వహించడం హర్షణీయం...  - ఎమ్మెల్యే సంజయ్ కుమార్    జగిత్యాల ఏప్రిల్ 26 (ప్రజా మంటలు) శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణం లో ఆర్య వైశ్య సంఘం ఆద్వర్యం లో జయంతి వేడుకల్లో పాల్గొని పోచమ్మ ఆలయం నుండి వాసవి మాత ఆలయానికి వాసవి కన్యకా పరమేశ్వరి మాతని పల్లకిలో తీసుకొచ్చే కార్యక్రమంలో పాల్గొని పల్లకి మోసి ప్రత్యేక...
Read More...
Local News 

ఘనంగా వాసవీ మాత జయంతి వేడుకలు

ఘనంగా వాసవీ మాత జయంతి వేడుకలు జగిత్యాల ఏప్రిల్ 26 ( ప్రజా మంటలు)  జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో  వాసవీ మాత జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి. ఎస్.లత పాల్గొన్నారు.*ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్.లత మాట్లాడుతూ*  వాసవీ మాత        
Read More...
Local News 

ఈత సరదాకు వెళ్ళి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు

ఈత సరదాకు వెళ్ళి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు    బుగ్గారం ఏప్రిల్ 26 ( ప్రజా మంటలు)  సర్పంచ్ లు గ్రామాలలో టామ్ - టామ్ చేయించాలి బుగ్గారం ఎస్సై జి.సతీష్  వేసవి కాలం కదా అని ఈత సరదాతో బావుల్లోకి, చెరువుళ్ళోకి  వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని జగిత్యాల జిల్లా బుగ్గారం ఎస్సై జి.సతీష్ అన్నారు. ఆదివారం ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక...
Read More...
Local News  Crime 

పెళ్లి వేడుకలో విషాదం – సరదా ఈత ప్రాణం తీసింది… 13 ఏళ్ల బాలుడు మృతి

పెళ్లి వేడుకలో విషాదం – సరదా ఈత ప్రాణం తీసింది… 13 ఏళ్ల బాలుడు మృతి గొల్లపల్లి, ఏప్రిల్ 26 (ప్రజా మంటలు): పెళ్లి వేడుకలో పాల్గొన్న అనంతరం సరదాగా ఈతకు వెళ్లిన బాలుడు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఘటన జగిత్యాల జిల్లాలో విషాదాన్ని నింపింది.బుగ్గారం మండలం బీర్సాని గ్రామానికి చెందిన కాంపెళ్లి రితేష్ (13) గొల్లపల్లి మండలం లోతునూరు గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యాడు. మధ్యాహ్న సమయంలో స్నేహితులతో...
Read More...
Local News 

ఘనంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు

ఘనంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు . జగిత్యాల ఏప్రిల్ 26( ప్రజా మంటలు)వాల్మీకి ఆవాసం సేవాభారతి అధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆదివారం ఉదయం 11 గంటలకు ఘనంగా నిర్వహించారు. జగిత్యాల పట్టణం ధరూర్ క్యాంపులో గ్రామీణ నిరుపేద విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న  వాల్మీకి ఆవాసంలో ప్రతి సంవత్సరం వేసవి సెలవుల అనంతరం సామూహిక సత్యనారాయణ స్వామి...
Read More...