‘పరమపద సోపానం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా… ఏప్రిల్ 24న గ్రాండ్ రిలీజ్
హైదరాబాద్, ఏప్రిల్ 22 (ప్రజా మంటలు):
‘పరమపద సోపానం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అర్జున్ అంబటి హీరోగా, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని గణపర్తి నారాయణరావు నిర్మించగా, నాగ శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, సముద్ర, వీర శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. కొత్తవారికి మంచి అవకాశం కలిగే సినిమా అవుతుందని పేర్కొన్నారు.

సముద్ర మాట్లాడుతూ అచ్చ తెలుగు టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.
వీర శంకర్ మాట్లాడుతూ దర్శకుడు నాగ శివ కష్టపడి సినిమాను ఈ స్థాయికి తీసుకువచ్చారని, ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.
హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ ప్రముఖ దర్శకులు తన సినిమాకు రావడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ చిత్రం థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు.
హీరోయిన్ జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ తన పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని, ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
దర్శకుడు నాగ శివ మాట్లాడుతూ ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ సినిమాను పూర్తి చేశామని, అందరి సహకారం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ప్రేక్షకులు తప్పకుండా సపోర్ట్ చేయాలని కోరారు.
సంగీత దర్శకుడు దేవ్ జాండ్, డీఓపీ ఈశ్వర్, రచయిత రాంబాబు గోసాల తదితరులు కూడా సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.
చిత్ర విశేషాలు:
* హీరో: అర్జున్ అంబటి
* హీరోయిన్: జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్
* దర్శకుడు: నాగ శివ
* నిర్మాత: గణపర్తి నారాయణరావు
* సంగీతం: దేవ్ జాండ్
* సినిమాటోగ్రఫీ: ఈశ్వర్
* నిర్మాణ సంస్థ: స్వయంభూ క్రియేషన్స్
విడుదల తేదీ: ఏప్రిల్ 24, 2026
థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ‘పరమపద సోపానం’పై చిత్రబృందం భారీ అంచనాలు పెట్టుకుంది. ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా "రుద్రాంగి ఈశాన్వి" గోపిక వేషధారణ
జగిత్యాల సెప్టెంబర్ 4 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని విద్యాసంస్థల్లో పాఠశాల చిన్నారులచే కృష్ణాష్టమి జన్మ వేడుకల్లో భాగంగా ఉట్టికొట్టే కార్యక్రమం తో పాటు శ్రీకృష్ణుని గోపిక వేషధారణలు అలరించాయి.
ఇదిలా ఉండగా రుద్రాంగి రాఘవేంద్ర శ్రీవిద్య కూతురు రుద్రంగి ఈశాన్వి గౌతమ్ మోడల్ స్కూల్ లో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో... రైతు రాజ్యం రావాలంటే కేసీఆర్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలి
రాయికల్, సెప్టెంబర్ 4 (ప్రజా మంటలు):
రాష్ట్ర ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపిస్తూ, రైతు సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని ఉధృతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాయికల్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు.... సీఎం రేవంత్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా - విజయలక్ష్మి
హైదరాబాద్ సెప్టెంబర్ 03 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్ చైర్‌పర్సన్‌గా, క్యాబినెట్ మంత్రి హోదాతో తనకు కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి, రాష్ట్ర నాయకత్వానికి రుణపడి ఉంటానని గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆమె పేర్కొన్నారు.
తనకు ఈ బాధ్యతలు... త్రాగునీటి సమస్య పై ఆర్డీవోకు వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు
గుంతకల్ సెప్టెంబర్ 3 (ప్రజా మంటలు)ప్రజా సమస్యల పైన స్థానిక గుంతకల్ ఆర్డీవో కి వినతి పత్రం అందించిన బిజెపి నాయకులు ఈ సంవత్సరం తక్కువ వర్షం నమోదు కావడం వలన పట్టణంలో దాదాపుగా వారానికి ఒకసారి నీళ్లు వదలడం జరుగుతుంది. అందువలన పట్టణ ప్రజలు తాగడానికి మరియు వాడుకోవడానికి నీళ్ల కోసం చాలా... జగిత్యాల మున్సిపాలిటీ ఎజెండాపై మాజీ కౌన్సిలర్ జయశ్రీ ఫిర్యాదు
జగిత్యాల, సెప్టెంబర్ 3 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపాలిటీలో డీజిల్, వాహనాల రిపేర్లు, పండుగల ఏర్పాట్లు, వాహనాల కొనుగోళ్లు, పాత బిల్లుల చెల్లింపులు తదితర అంశాల్లో ప్రజాధనం దుర్వినియోగం జరుగుతోందని ఆరోపిస్తూ మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీ ఎజెండాలో పొందుపరిచిన... జగిత్యాల బీజేపీలో ముదిరిన అంతర్గత విభేదాలు
జగిత్యాల, సెప్టెంబర్ 2 (ప్రజామంటలు):
జగిత్యాల జిల్లా బీజేపీలో చాలాకాలంగా అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలు ఇప్పుడు బహిరంగ రాజకీయ పోరుగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యవహారశైలిపై కొందరు సీనియర్ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల రహస్య సమావేశం నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలకు చెందిన... బ్రాహ్మణ సంక్షేమానికి ప్రభుత్వం పూర్తి సహకారం - ఆర్థిక మంత్రి భట్టి
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (ప్రజా మంటలు):
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ కోరారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి ఆయన ఈ మేరకు... ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఎమ్మెల్యేకు వినతి
జగిత్యాల, సెప్టెంబర్ 2 (ప్రజామంటలు):
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర డిగ్రీ, పీజీ కళాశాలల అసోసియేషన్ ప్రతినిధులు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్, రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి యాద రామకృష్ణ, నలంద డిగ్రీ... కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బీఆర్ఎస్ వ్యక్తిగత విమర్శలా?
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (ప్రజామంటలు):
అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్‌ను ప్రశ్నిస్తూ ప్రజల కోసం పోరాడుతున్నది తెలంగాణ రక్షణ సేన మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు నవీన్ ఆచారి అన్నారు. బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రను సక్రమంగా నిర్వహించడం లేదంటూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన విమర్శలకు సమాధానం చెప్పకుండా,... గురుకుల హాస్టళ్లలో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించాలి : THRC
హైదరాబాద్, ఆగస్టు 31 (ప్రజా మంటలు):
గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్‌ఆర్‌సీ) సూచించింది.
బెల్లంపల్లి బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై కమిషన్ హెచ్‌ఆర్‌సీ నంబర్ 3034/2026 కింద సుమోటో కేసు నమోదు చేసింది. 2026... బంగారు తెలంగాణ కాదు.. బహుజన తెలంగాణ కావాలి - కవిత
కాంగ్రెస్‌పై పోరాటం.. టీఆర్ఎస్ నిర్మాణం | ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ
నిజామాబాద్, ఆగస్టు 31 (ప్రజా మంటలు):తెలంగాణకు ఇప్పుడు కావాల్సింది బంగారు తెలంగాణ కాదని, బహుజన తెలంగాణ అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల జీవితాల్లో ఆశించిన స్థాయిలో... ఉద్యోగుల ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలి సెప్టెంబర్ 10న ఛలో హైదరాబాద్ టీజీజెఏసి రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్
జగిత్యాల ఆగస్టు 31 (ప్రజా మంటలు) టీజీజెఏసి జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, జిల్లా చైర్మన్ మిర్యాల నాగేందర్ రెడ్డి మరియు కందుకూరి రవిబాబు ఆధ్వర్యంలో, టీఎన్జీవో జిల్లా కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశం లో రాష్ట్ర టి జి ఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ ముఖ్య అతిధిగా పాల్గొని... 