పల్నాడు వాటర్‌గ్రిడ్ పనుల వద్ద తెలంగాణ రక్షణ సేన ఆందోళన

కార్యకర్తల అరెస్ట్: మహిళా నాయకులపై దాడి.. ఘటనను ఖండించిన కల్వకుంట్ల కవిత

On
పల్నాడు వాటర్‌గ్రిడ్ పనుల వద్ద తెలంగాణ రక్షణ సేన ఆందోళన

 నాగార్జునసాగర్ నవంబర్‌ 29 (ప్రజా మంటలు)::

చంద్రబాబుకు గురుదక్షిణగా కృష్ణా జలాలు కట్టబెడుతున్న రేవంత్ రెడ్డి: టీఆర్ఎస్ నేతలు పోలీసుల సమక్షంలోనే మహిళా నాయకులపై దాడి.. ఘటనను ఖండించిన కల్వకుంట్ల కవిత

 కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ రక్షణ సేన నాయకులు ఆదివారం నాగార్జునసాగర్, ఏపీలోని పల్నాడు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు వద్ద ఆందోళన చేపట్టారు. చంద్రబాబుకు గురుదక్షిణగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. పల్నాడు ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న నాయకులపై ప్రైవేటు వ్యక్తులు కర్రలతో దాడి చేశారని, మహిళా నాయకులపైనా దాడికి పాల్పడ్డారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరగడం దుర్మార్గమని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖండించారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అంతకుముందు నాగార్జునసాగర్ కుడి కాలువ వద్ద కూడా ఏపీ నీటి తరలింపును నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడలేని సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. అవసరమైతే తెలంగాణ ఉద్యమం తరహాలో మరో పోరాటం చేపడతామని హెచ్చరించారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.

ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, కంచర్ల శివారెడ్డి, విక్రాంత్ రెడ్డి, బొడ్డుపల్లి లింగం మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడటంలో విఫలమయ్యాయని విమర్శించారు. కృష్ణా జలాల తరలింపుపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని, రాష్ట్ర హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎక్కడికైనా వెళ్లి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

Tags
Join WhatsApp

More News...

National  State News 

పల్నాడు వాటర్‌గ్రిడ్ పనుల వద్ద తెలంగాణ రక్షణ సేన ఆందోళన

పల్నాడు వాటర్‌గ్రిడ్ పనుల వద్ద తెలంగాణ రక్షణ సేన ఆందోళన   నాగార్జునసాగర్ నవంబర్‌ 29 (ప్రజా మంటలు):: చంద్రబాబుకు గురుదక్షిణగా కృష్ణా జలాలు కట్టబెడుతున్న రేవంత్ రెడ్డి: టీఆర్ఎస్ నేతలు పోలీసుల సమక్షంలోనే మహిళా నాయకులపై దాడి.. ఘటనను ఖండించిన కల్వకుంట్ల కవిత   కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ రక్షణ సేన నాయకులు ఆదివారం నాగార్జునసాగర్, ఏపీలోని పల్నాడు అంతకుముందు...
Read More...
Local News 

డబ్బా పంచాయతీ కార్యదర్శి కి షోకాజ్ నోటీస్ 

డబ్బా పంచాయతీ కార్యదర్శి కి షోకాజ్ నోటీస్    ఇబ్రహీంపట్నం  నవంబర్ 29 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ) విదినిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో పాటు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను పాటించలేదన్న కారణంతో ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామ పంచాయతీ కార్యదర్శి  రవళికి జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి  శనివారం షోకాజ్ నోటీసు జారీ చేశారు.డబ్బా గ్రామ పరిధిలో రోడ్ల ఆక్రమణలపై రాపెల్లి గోపీనాథ్,...
Read More...
Local News 

సత్యం శివం సుందరం గోనివాస్‌లో ఘనంగా 26వ వార్షికోత్సవ వేడుకలు

సత్యం శివం సుందరం గోనివాస్‌లో ఘనంగా 26వ వార్షికోత్సవ వేడుకలు సికింద్రబాద్ , నవంబర్ 29 (ప్రజా మంటలు):  హైదరాబాద్‌ నగరంలోని గగన్‌పహాడ్‌లో ఉన్న దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గోశాల 'సత్యం శివం సుందరం గోనివాస్' 26వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరిగాయి. రోజంతా సాగిన ఈ ఆధ్యాత్మిక వేడుకలకు సుమారు 15 వేల మందికి పైగా భక్తులు, జంతు ప్రేమికులు, సందర్శకులు...
Read More...
National  Local News  State News  Crime  Social 

ఆస్తి అనాథ పిల్లలకు చెందాలంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని చివరి లేఖ

ఆస్తి అనాథ పిల్లలకు చెందాలంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని చివరి లేఖ జగిత్యాల: నవంబర్ 29 (ప్రజా మంటలు) జగిత్యాల పట్టణంలోని గోవిందుపల్లికి చెందిన బక్కశెట్టి సింధూజ అలియాస్ తుషారిక (36) హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఆత్మహత్య చేసుకుంది. హైటెక్ సిటీలోని నెక్స్ట్‌టర్న్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఆమె ప్రజయ్ మెగాపోలిస్ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివాసముంటోంది. 2015లో వివాహమైన సింధూజ ఏడాదిన్నర తర్వాత భర్త నుంచి విడాకులు తీసుకుని...
Read More...
Local News 

60 ఏళ్ల తర్వాత కొండగట్టులో చందనోత్సవం.. అంజన్న నిజరూప దర్శనం చేసుకున్న స్పీకర్, మంత్రి

60 ఏళ్ల తర్వాత కొండగట్టులో చందనోత్సవం.. అంజన్న నిజరూప దర్శనం చేసుకున్న స్పీకర్, మంత్రి కొండగట్టు, నవంబర్ 20 (ప్రజామంటలు): జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో 60 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న అరుదైన చందనోత్సవంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ...
Read More...
Local News 

విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడంలో గ్రంథాలయాలు కీలకం – మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్

విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడంలో గ్రంథాలయాలు కీలకం – మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్    జగిత్యాల: నవంబర్ 20 (ప్రజా మంటలు)జిల్లా గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకల్లో జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనబట్ల దినేష్, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన, పాటలు తదితర పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా...
Read More...
Local News 

ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల నవంబర్ 18 (ప్రజా మంటలు)ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు.    జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జగిత్యాల పట్టణంలోని పొన్నాల గార్డెన్స్‌లో విద్యార్థుల వ్యక్తిత్వ...
Read More...
Local News 

మెట్‌పల్లి ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించిన భారతీయ హిందూ పరిషద్ జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు సంబారి కళావతి

మెట్‌పల్లి ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించిన భారతీయ హిందూ పరిషద్ జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు సంబారి కళావతి    జగిత్యాల  నవంబర్ 15 (ప్రజా మంటలు)మెట్‌పల్లిలోని ఇస్కాన్ ఆలయాన్ని భారతీయ హిందూ పరిషద్ జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు సంబారి కళావతి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో స్వామీజీలను, ఆలయ కమిటీ సభ్యులను కలిసి భగవద్గీత పుస్తకాన్ని అందుకున్నారు. ఆలయంలో జరుగుతున్న ఆధ్యాత్మిక, ధార్మిక, సేవా...
Read More...
Local News 

నశా ముక్త్ తెలంగాణలో రెడ్‌క్రాస్ క్రియాశీలక పాత్ర పోషించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

నశా ముక్త్ తెలంగాణలో రెడ్‌క్రాస్ క్రియాశీలక పాత్ర పోషించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా    హైదరాబాద్ (లోక్ భవన్ నవంబర్- వికసిత్ భారత్ - 2047లో యువత భాగస్వామ్యం కీలకం- 68 వేల మంది కొత్త సభ్యుల చేరికపై అభినందన.. మూడు కీలక కార్యక్రమాలకు గవర్నర్ పిలుపు మాదకద్రవ్య రహిత తెలంగాణ నిర్మాణంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ క్రియాశీలక పాత్ర పోషించాలని గవర్నర్ , ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ...
Read More...
Local News 

నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకున్న వాహనాలపై జగిత్యాల ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు

నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకున్న వాహనాలపై జగిత్యాల ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు జగిత్యాల నవంబర్ 14 (ప్రజా మంటలు)జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,  ఆదేశాల మేరకు, జగిత్యాల డీఎస్పీ  పురుషోత్తం రెడ్డి  సూచనల ప్రకారం, జగిత్యాల పట్టణ సీఐ  పి. కరుణాకర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్    మరియు సిబ్బందితో కలిసి జగిత్యాల పట్టణంలో ప్రత్యేక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు.    ఈ తనిఖీల్లో భాగంగా నంబర్ ప్లేట్లు...
Read More...
Local News 

పద్మశాలి సంఘం స్వర్ణోత్సవాలకు ఎమ్మెల్సీ ఎల్.రమణకు ఆహ్వానం

పద్మశాలి సంఘం స్వర్ణోత్సవాలకు ఎమ్మెల్సీ ఎల్.రమణకు ఆహ్వానం సికింద్రాబాద్, నవంబర్ 12 (ప్రజా మంటలు):   గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించనున్న స్వర్ణోత్సవ వేడుకలకు కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలగందుల రమణను సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కత్తుల సుదర్శన్ రావు,...
Read More...
Local News 

రాష్ట్రస్థాయి అండర్ 17 బాస్కెట్‌బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హై స్కూల్ విద్యార్థిని ఎంపిక

రాష్ట్రస్థాయి అండర్ 17 బాస్కెట్‌బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హై స్కూల్ విద్యార్థిని ఎంపిక జగిత్యాల నవంబర్ 12 (ప్రజా మంటలు)ఈనెల 13 నుండి 15 వరకు కరీంనగర్ లో జరగనున్న రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హైస్కూల్ విద్యార్థిని జి.శివాణి ఎంపిక అయింది అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిస్టర్ జ్యోతిస్మరియ తెలిపారు     ఈ సందర్భంగా విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిస్టర్ జ్యోతిస్మరియ సిస్టర్స్ రేజిణ,లిల్లి,క్రిస్టిన,రాణి, వ్యాయామ ఉపాధ్యాయులు...
Read More...