కరీంనగర్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. 30న నూతన కలెక్టరేట్ ప్రారంభం

నూతన కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి ఘన ఏర్పాట్లు

On
కరీంనగర్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. 30న నూతన కలెక్టరేట్ ప్రారంభం

28న ఓటు హక్కు పరిరక్షణపై కలెక్టరేట్‌ వద్ద ధర్నా

కరీంనగర్, సెప్టెంబర్ 25 (ప్రజా మంటలు):

ఈ నెల 30న కరీంనగర్‌లో నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఇప్పటికే కలెక్టరేట్‌ ప్రాంగణాన్ని పరిశీలించి భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణ, స్వాగత తోరణాలు తదితర ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు.

ఈ నేపథ్యంలో కరీంనగర్‌ డీసీసీ కార్యాలయంలో కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. సమావేశంలో సీఎం పర్యటన, SIR ప్రక్రియ, ఓటు హక్కు పరిరక్షణ అంశాలపై మూడు తీర్మానాలు చేశారు.

సీఎంకు ఘన స్వాగతం:
కరీంనగర్‌ నూతన కలెక్టరేట్‌ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని ప్రధాన కూడళ్లను, కలెక్టరేట్‌ మార్గాన్ని ఫ్లెక్సీలు, కటౌట్లు, తోరణాలతో అలంకరించాలని నిర్ణయించారు. 66 డివిజన్లలో కాంగ్రెస్‌ జెండాలు, బంటింగ్స్‌, బెలూన్లతో అలంకరణ చేపట్టాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై హోర్డింగులు ఏర్పాటు చేయాలని నాయకులు నిర్ణయించారు. పార్టీ కార్యకర్తలకు సీఎంతో కొద్దిసేపు భేటీకి అవకాశం కల్పించాలని మంత్రులను కోరాలని తీర్మానించారు.

SIR గడువు డిసెంబర్‌ వరకు పొడిగించాలి:
SIR ప్రక్రియలో సాంకేతిక సమస్యలు, పేర్ల స్పెల్లింగ్‌లో తప్పులు, నోటీసులు అందకపోవడం వంటి ఇబ్బందులు ఉన్నాయని సమావేశంలో నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ సానుభూతిపరులు, మైనారిటీల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. SIR ప్రక్రియను డిసెంబర్‌ వరకు పొడిగించాలని డిమాండ్‌ చేశారు.

అయితే, రాష్ట్రంలో SIRపై ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్‌ను సవరించింది. ప్రస్తుతం క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలుకు అక్టోబర్‌ 7 వరకు, నోటీసులు–పరిష్కార ప్రక్రియకు నవంబర్‌ 5 వరకు గడువు ఉండగా, తుది ఓటరు జాబితా నవంబర్‌ 9న ప్రచురించనుంది.

28న కలెక్టరేట్‌ వద్ద ధర్నా:
ఓటు హక్కు పరిరక్షణ కోసం AICC పిలుపు మేరకు ఈ నెల 28న కరీంనగర్‌ కలెక్టరేట్‌ వద్ద నిర్వహించే ధర్నాలో కాంగ్రెస్‌ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సమావేశం పిలుపునిచ్చింది. ఎన్నికల ప్రక్రియపై తమ అభ్యంతరాలను ప్రజాస్వామ్య పద్ధతిలో తెలియజేయాలని నాయకులు కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్‌ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీలో వర్గ విభేదాలకు తావివ్వకుండా కాంగ్రెస్‌ పార్టీకి కట్టుబడి పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. “పార్టీకి కట్టుబడి ఉండాలి.. వ్యక్తులకు కాదు” అని అన్నారు.

కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ మాట్లాడుతూ సీఎం పర్యటనను విజయవంతం చేసి కరీంనగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ బలాన్ని చాటాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో బొమ్మ శ్రీరామ్‌ చక్రవర్తి, సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, పురుమల్ల శ్రీనివాస్‌, కర్ర రాజశేఖర్‌, ఆకారపు భాస్కర్‌రెడ్డి, మడుపు మోహన్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు, డివిజన్‌ అధ్యక్షులు, మహిళా నాయకులు, కాంగ్రెస్‌ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

జగిత్యాలలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు

జగిత్యాలలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు జగిత్యాల, సెప్టెంబర్ 25 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. పట్టణ మార్కెట్ వెనుక పద్మశాలి గణేష్ భక్త భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 75వ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన...
Read More...
Local News 

కరీంనగర్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. 30న నూతన కలెక్టరేట్ ప్రారంభం

కరీంనగర్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. 30న నూతన కలెక్టరేట్ ప్రారంభం 28న ఓటు హక్కు పరిరక్షణపై కలెక్టరేట్‌ వద్ద ధర్నా కరీంనగర్, సెప్టెంబర్ 25 (ప్రజా మంటలు): ఈ నెల 30న కరీంనగర్‌లో నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఇప్పటికే కలెక్టరేట్‌ ప్రాంగణాన్ని...
Read More...
State News 

మన ఊరు–మన బడి పాఠశాలలకు పెయింట్స్ వేయాలి

మన ఊరు–మన బడి పాఠశాలలకు పెయింట్స్ వేయాలి జగిత్యాల సెప్టెంబర్‌ 25 (ప్రజా మంటలు): మన ఊరు–మన బడి పథకం కింద మంజూరైన జగిత్యాల పట్టణం, బుగ్గారం మండలంలోని జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలకు రంగులు వేయాలని PRTU–TS జగిత్యాల జిల్లా శాఖ కోరింది. ఈ మేరకు సంఘం జిల్లా అధ్యక్షుడు యాల్ల అమర్నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోయినిపల్లి ఆనంద్‌రావు ఇరిగేషన్...
Read More...
Crime  State News 

కొత్తగూడెం పోలీస్ స్టేషన్‌లో ఇరువర్గాల ఘర్షణ

కొత్తగూడెం పోలీస్ స్టేషన్‌లో ఇరువర్గాల ఘర్షణ కొత్తగూడెం సెప్టెంబర్25: వివాహేతర సంబంధం వ్యవహారంలో తలెత్తిన వివాదం పోలీస్ స్టేషన్‌లోనే ఇరువర్గాల పరస్పర దాడులకు దారితీసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదట మాటల యుద్ధంగా ప్రారంభమైన వివాదం క్రమంగా ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఇరువర్గాలు పోలీస్ స్టేషన్‌లోకి చేరడంతో అక్కడ...
Read More...
Local News 

త్రో బాల్ జాతీయ స్థాయి పోటీలకు తాటిపల్లి విద్యార్ధిని ఎంపిక 

త్రో బాల్ జాతీయ స్థాయి పోటీలకు తాటిపల్లి విద్యార్ధిని ఎంపిక  జగిత్యాల సెప్టెంబర్ 25 ( ప్రజా మంటలు)  మహారాష్ట్ర నాసిక్ లో ఈ నెల 27 నుండి 30వ తేదీ వరకు జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు పదవ తరగతి కి చదువుతున్న పూదరి అనుశ్రీ ఎంపిక అయినట్టు  పి ఈ టి సతీష్ తెలిపారు. వీరిని  జగిత్యాల గ్రామీణ మండల ఎం ఈ ఓ&...
Read More...
Local News 

సంకటాల్లో చిక్కుకున్న దశముఖ వినాయకుడు 

సంకటాల్లో చిక్కుకున్న దశముఖ వినాయకుడు  జగిత్యాల సెప్టెంబర్ 25 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం భారీ దశముఖ వినాయకుడు సంకటాల్లో చిక్కుకున్నాడు. పట్టణంలోని తీన్ ఖని చౌరస్తా సమీపంలో" చే గువేరా యూత్"  ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది.    శుక్రవారం నిమజ్జనోత్సవానికి తరలించే నేపథ్యంలో మండపము నుండి బయటకు తీసుకు వస్తున్న...
Read More...
Local News 

రెండో రోజు గణనాథులకు వీడ్కోలు పలికిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి లక్ష్మణ్

రెండో రోజు గణనాథులకు వీడ్కోలు పలికిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి లక్ష్మణ్ జగిత్యాల, సెప్టెంబర్ 24 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలో రెండో రోజు గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణనాథులకు పూజలు నిర్వహించి, భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె వెంట కౌన్సిలర్ కోరె జయ గంగమల్లు, బొలుసాని శ్రీనివాస్, నిమ్మల నాగరాజుతో పాటు ముఖ్య నాయకులు...
Read More...
State News 

ట్రాఫిక్‌ నియంత్రణకు తెలంగాణలో కొత్త వ్యవస్థ : ముఖ్యమంత్రి ప్రకటన

ట్రాఫిక్‌ నియంత్రణకు తెలంగాణలో కొత్త వ్యవస్థ : ముఖ్యమంత్రి ప్రకటన హైదరాబాద్‌ సెప్టెంబర్ 24 (ప్రజా మంటలు) :తెలంగాణలో పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యలు, రోడ్డు ప్రమాదాలకు సమగ్ర పరిష్కారం చూపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. **‘తెలంగాణ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌, రోడ్‌ అండ్‌ రైల్‌ సేఫ్టీ బ్యూరో’ (TG-TMARS)**ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో 135 జారీ చేసింది. ట్రాఫిక్‌ నిర్వహణను...
Read More...
Local News 

చింతకుంట చెరువులో వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశిలించిన ఎమ్నెల్యె సంజయ్

చింతకుంట చెరువులో వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశిలించిన ఎమ్నెల్యె సంజయ్ జగిత్యాల, సెప్టెంబర్ 24 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువు వద్ద కొనసాగుతున్న వినాయక నిమజ్జన ఏర్పాట్లను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. మున్సిపల్ అధికారులు, సిబ్బందితో కలిసి నిమజ్జన ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించారు....
Read More...
State News 

ఓయూకు హామీ ఇచ్చిన రూ.1,000 కోట్లు ఏమయ్యాయి?: ప్రశ్నించిన కవిత

ఓయూకు హామీ ఇచ్చిన రూ.1,000 కోట్లు ఏమయ్యాయి?: ప్రశ్నించిన  కవిత హైదరాబాద్, సెప్టెంబర్ 24 (ప్రజా మంటలు): ఉస్మానియా యూనివర్సిటీకి ప్రభుత్వం ప్రకటించిన రూ.1,000 కోట్ల నిధులు ఏమయ్యాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఓయూ లా కాలేజ్ విద్యార్థులు కనీస సౌకర్యాల కోసం నెలల తరబడి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఓయూ లా కాలేజీలో జరిగిన వినాయక...
Read More...
Crime  State News 

ప్రణయ్ హత్య కేసు దోషి అబ్దుల్ బారీ మృతి.. 

ప్రణయ్ హత్య కేసు దోషి అబ్దుల్ బారీ మృతి..  సికింద్రాబాద్,సెప్టెంబర్ 24 ( ప్రజామంటలు):   రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ అమృత-ప్రణయ్ పరువు హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఏ-4 నిందితుడు అబ్దుల్ బారీ (52) కన్నుమూశాడు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉన్న అతనికి గురువారం తెల్లవారు జామున తీవ్రమైన గుండెనొప్పితో అస్వస్థతకు గురికావడంతో జైలు సిబ్బంది వెంటనే ప్రస్తుతం...
Read More...
Local News  Social  State News 

అధునాతన వైద్య సౌకర్యాలతో గచ్చిబౌలిలో బట్టర్ ఫ్లై హాస్పిటల్స్ ప్రారంభం.. 

అధునాతన వైద్య సౌకర్యాలతో గచ్చిబౌలిలో బట్టర్ ఫ్లై హాస్పిటల్స్ ప్రారంభం..  సికింద్రాబాద్, సెప్టెంబర్ 24 (ప్రజా మంటలు):  మహిళలు, చిన్నారులకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు గచ్చిబౌలిలో నూతనంగా ఏర్పాటు చేసిన 'బటర్‌ఫ్లై హాస్పిటల్స్' శాఖను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హర్కారా వేణుగోపాల్ రావు, సినీనటి మంజుల ఘట్టమనేని, ఎమ్మెల్యే ఆరెకపూడి...
Read More...