తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యాలు - 23.05.2026

On
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యాలు - 23.05.2026

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

హైదరాబాద్ 23 మే (ప్రజా మంటలు) : 

తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యాలు మరియు హైలైట్స్. 

1. రాష్ట్రంలో రెండో విడ‌త ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

  • మొత్తం 2 ల‌క్ష‌ల 50 వేల మంది పేద కుటుంబాల ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి 2 వేల చొప్పున ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది.
  • ఉమ్మ‌డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించి గోడ‌లు, శ్లాబు ద‌శ‌లో నిలిచిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
  • పునాదులు పూర్త‌యి గోడ‌లు, శ్లాబు ప‌డ‌ని ఇళ్ల‌కు రూ.3 ల‌క్ష‌లు, గోడ‌లు పూర్త‌యి శ్లాబు నిలిచిపోయిన ఇళ్ల‌కు రూ.2 ల‌క్ష‌లు చొప్పున అందిస్తాం.
  • అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసేందుకు నియోజ‌క‌వ‌ర్గానికి 500 ఇళ్ల‌కు చొప్పున నిధులు కేటాయిస్తూ క్యాబినెట్ తీర్మానించింది.
  • తొలి విడ‌త‌లో నిర్మాణం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల‌లో జూన్ రెండు నాటికి దాదాపు ల‌క్ష ఇళ్ల గృహ ప్రవేశాలు జరుగుతాయి.
  • కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెర‌మెరి మండ‌లం కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీల‌కు ప్రభుత్వం కట్టించిన 28 ఇందిర‌మ్మ ఇళ్లను జూన్ 1వ తేదీన ప్రారంభించాలని నిర్ణయించాం.
  • జూన్ 1వ తేదీన గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, గౌర‌వ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క, రాష్ట్ర మంత్రులందరం అక్కడికి వెళ్లి ఈ కార్యక్రమంలో పాల్గొంటాం.
  • హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం క్యూర్ ప‌రిధిలోని 24 నియోజ‌క‌వ‌ర్గాల్లో అల్పాదాయ వ‌ర్గాల వారి కోసం (LIG) ల‌క్ష ఇళ్లు నిర్మించి ఇవ్వాల‌ని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యించింది.
  • తెలంగాణ రాష్ట్రంలో వివిధ ద‌ఫాలుగా చేసిన స‌ర్వేల ప్ర‌కారం 15 వేల కుటుంబాలు గుడిసెల్లో నివాసం ఉంటున్న‌ట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం గుర్తించింది.
  • వెంట‌నే ఆ కుటుంబాల‌న్నింటికి ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరు ప‌త్రాలు అందించాల‌ని రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించింది. గుడిసెలు లేని ఆద‌ర్శ రాష్ట్రంగా తెలంగాణ‌ను నిల‌పాల‌ని క్యాబినెట్ నిర్ణ‌యించింది.  

2. వ‌చ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7వ తేదీ వరకు జ‌ర‌గ‌నున్న గోదావ‌రి పుష్క‌రాల‌కు సంబంధించి వివిధ పనులు చేప‌ట్టేందుకు రూ.1000 కోట్ల నిధులకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో తొలి విడ‌త‌గా రూ.300 కోట్లు మంజూరుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 

3. విద్యుత్ పంపిణీ, మౌలిక స‌దుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న‌ RDSSలో చేరేందుకు తెలంగాణ డిస్కంలు తయారు చేసిన ప్ర‌తిపాద‌న‌ల‌కు రాష్ట్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. 

4. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేందుకు రాష్ట్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. 

5. ప్రభుత్వం పాఠశాలలతో పాటు అన్ని జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకూ ఉదయం అల్పాహారంతో పాటు పాలు అందించాల‌ని నిర్ణ‌యించింది. 

6. రాష్ట్రంలోని DCMSల‌ను మార్క్ ఫెడ్లో విలీనం చేయాల‌ని రాష్ట్ర మంత్రివ‌ర్గం నిర్ణ‌యించింది. TGRICని (తెలంగాణ రూర‌ల్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ కార్పొరేష‌న్‌) హాకాలో విలినం చేయాల‌ని క్యాబినెట్ నిర్ణ‌యించింది. 

7. పాల‌మూరు-రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం భూ సేక‌ర‌ణ‌, పున‌రావాసం, మౌలిక వ‌స‌తుల స‌దుపాయాల క‌ల్ప‌న‌కు రూ.587 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.

8. తెలంగాణను 2030 నాటికి ప్రపంచంలోని టాప్‌ 5 లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌లలో ఒకటిగా నిలబెట్టాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. అందుకే నెక్స్ట్‌ జనరేషన్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీ 2026–30ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. దావోస్లో ఈ పాలసీని లాంఛనంగా ఆవిష్కరించాం. ఈ పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలతో పాటు 25 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. 

9. లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా, బయోటెక్‌, మెడికల్‌ ఇన్నోవేషన్‌ రంగాల్లో భారీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తాం. యువతకు పరిశోధన, తయారీ, డిజిటల్‌ హెల్త్‌, గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ రంగాల్లో మంచి అవకాశాలు కల్పిస్తాం. ఇప్పటివరకు ఎక్కువగా తయారీ మీద దృష్టి ఉంటే, ఇక నుంచి విలువైన ఇన్నోవేషన్‌ మీద ఎక్కువ ఫోకస్‌ పెడతాం. రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ (R&D) యూనిట్లను కూడా పరిశ్రమలుగా గుర్తించే విధంగా ఈ పాలసీలో మార్పు తీసుకొస్తున్నాం. గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్లు, గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్లు తెలంగాణకు రావడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుంది.

Tags
Join WhatsApp

More News...

Local News 

జగిత్యాల ఎమ్మెల్యే వైఖరి విడ్డూరంగా ఉంది - మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి 

జగిత్యాల ఎమ్మెల్యే వైఖరి విడ్డూరంగా ఉంది  - మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి  జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)యావర్ రోడ్డు పై అక్రమ నిర్మాణాలు తొలగించండి జిల్లా కలెక్టర్ ప్రజా వాణిలో జీవన్ రెడ్డి పిర్యాదు    జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అవలంబిస్తున్న వైఖరి చాలా విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన జగిత్యాల జిల్లా  బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో...
Read More...
Local News 

బదిలీ పై వెళుతున్న సహాయ సంచాలకులు డా.బి.నరేష్ ను సన్మానించిన టిఎన్జీఓ లు

బదిలీ పై వెళుతున్న సహాయ సంచాలకులు డా.బి.నరేష్ ను సన్మానించిన టిఎన్జీఓ లు   జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)జిల్లా పశు సంవర్థక శాఖ లో సహాయ సంచాలకులు గా పని చేసిన డా.బోనగిరి నరేష్  ఇటీవలే బదిలీ పై కరీంనగర్ వెళ్లిన సందర్బంగా జిల్లా పశు వైద్యాధికారి డా.బి.ప్రకాశ్  అధ్యక్షతన నిర్వహించిన వీడ్కోలు సన్మాన కార్యక్రమం లో టిఎన్జీఓ జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టిఎన్జీఓ...
Read More...
Local News 

జగిత్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

జగిత్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్    జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)జిల్లాను వైద్య ఆరోగ్య రంగాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడానికి, పేద వర్గాల వారికి ఆధునిక వైద్య సౌకర్యాలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్అన్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్లోని మినీ సమావేశం మందిరంలో మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో...
Read More...
Local News 

సింగరేణి నుంచి ఆదివాసీ హక్కుల వరకు: ఉత్తర తెలంగాణలో తెలంగాణ రక్షణ సేన విస్తరణ యాత్రలో కవిత

సింగరేణి నుంచి ఆదివాసీ హక్కుల వరకు: ఉత్తర తెలంగాణలో తెలంగాణ రక్షణ సేన విస్తరణ యాత్రలో కవిత మంచిర్యాల/బెల్లంపల్లి/ఆసిఫాబాద్, జూన్ 15 (ప్రజా మంటలు): తెలంగాణ రక్షణ సేన ఉత్తర తెలంగాణ పర్యటనలో భాగంగా మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఇంద్రవెల్లి, కేస్లాపూర్ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికుల సమస్యలు, ఆదివాసీ హక్కులు, యువత ఉపాధి, విద్యా-వైద్య రంగాలపై పార్టీ వైఖరిని వెల్లడించారు. మంచిర్యాలలో...
Read More...
Crime  State News 

తహసీల్దార్ సంతకం ఫోర్జరీ  ::నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్:: నలుగురు నిందితుల అరెస్ట్

తహసీల్దార్ సంతకం ఫోర్జరీ  ::నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్:: నలుగురు నిందితుల అరెస్ట్ జగిత్యాల జూన్ 14 (ప్రజా మంటలు): (చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్)  జగిత్యాల జిల్లా మెట్‌పల్లి తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ ముద్రలతో తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో రాజుల దేవి నర్సయ్య, కలికోట వేణు, లోలపు గణేష్, పాకాల రాకేష్‌లను మెట్‌పల్లి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి...
Read More...
State News 

ఖమ్మం బాధితురాలికి న్యాయం చేయాలి: కల్వకుంట్ల కవిత

ఖమ్మం బాధితురాలికి న్యాయం చేయాలి: కల్వకుంట్ల కవిత హైదరాబాద్, జూన్ 13 (ప్రజా మంటలు): నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం అత్యాచారయత్నం బాధిత బాలికను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని త్వరితగతిన శిక్ష పడేలా...
Read More...
State News 

ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రక్షణ సేన హెచ్చరిక

ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రక్షణ సేన హెచ్చరిక హైదరాబాద్, జూన్ 13 (ప్రజా మంటలు): తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రతి గింజతో సహా ప్రభుత్వం కొనుగోలు చేయాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు రూప్ సింగ్ డిమాండ్ చేశారు. కేంద్రం 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతుండగా, రాష్ట్రంలో 70 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉత్పత్తి...
Read More...
Local News 

సాహితీవేత్త ,విద్యావేత్త ఎమ్ వి నరసింహారెడ్డి భౌతిక కాయానికి అంతిమ నివాళులు 

సాహితీవేత్త ,విద్యావేత్త ఎమ్ వి నరసింహారెడ్డి భౌతిక కాయానికి అంతిమ నివాళులు  జగిత్యాల జూన్ 10 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం కు చెందిన ప్రముఖ సాహితీవేత్త విద్యావేత్త ఎంవీ నరసింహారెడ్డి సోమవారం సాయంత్రం మృతి చెందగా బుధవారం ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నరసింహారెడ్డి కుమారులు శ్రీనివాస్ రెడ్డి శ్రీధర్ రెడ్డిలు చితికి నిప్పు అంటించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతిమయాత్రలో బంధువులు అభిమానులు శిష్యులు కళాశాల...
Read More...
Local News 

రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కంటిదానం ,నేత్రదాన ప్రతిజ్ఞ అవగాహన

రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కంటిదానం ,నేత్రదాన ప్రతిజ్ఞ అవగాహన    జగిత్యాల : జూన్ 10(ప్రజా మంటలు) ప్రపంచ నేత్రదాన దినోత్సవం జూన్ 10, సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ - రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ, హైదరాబాద్ వారి సహకారంతో బుధవారం పెన్షనర్స్ భవన్ (కోర్ట్ ప్రక్కన) “కంటి దానం – నేత్రదాన ప్రతిజ్ఞ, అవగాహన కార్యక్రమం”...
Read More...
Local News 

స్వర్గీయ మంచాల రామేశం నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులు

స్వర్గీయ మంచాల రామేశం నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులు జగిత్యాల జూన్ 10(ప్రజా మంటలు)స్వర్గీయ మంచాల రామేశం నేత్రాలను సేకరించిన ఎల్ వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ టెక్నీషియన్ కు జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.సునీల్ కుమార్, ఎం సి హెచ్ సూపరింటెండెంట్ డా. కృష్ణమూర్తి, రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ సిరిసిల్లశ్రీనివాస్, రోటరీసభ్యులు టీవి సూర్యం ద్వారా అందజేస్తున్న రామేశం కుమారుడు మంచాల...
Read More...
Local News 

దేశంలో అత్యంత దీర్ఘకాలం ప్రధాని అవుతానని ఎప్పుడూ ఊహించలేదు: ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ

దేశంలో అత్యంత దీర్ఘకాలం ప్రధాని అవుతానని ఎప్పుడూ ఊహించలేదు: ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ, జూన్ 10 (ప్రజా మంటలు): దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఢిల్లీలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) నాయకుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలో అత్యంత కాలం ప్రధాని పదవిలో కొనసాగుతానని తాను ఎప్పుడూ ఊహించలేదని వ్యాఖ్యానించారు....
Read More...
State News 

నెహ్రూ 17 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించారు – చరిత్రను వక్రీకరించొద్దు: డాక్టర్. చిన్నారెడ్డి

నెహ్రూ 17 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించారు – చరిత్రను వక్రీకరించొద్దు: డాక్టర్. చిన్నారెడ్డి హైదరాబాద్, జూన్ 10 (ప్రజా మంటలు): జవహర్‌లాల్ నెహ్రూ కంటే ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కువ కాలం దేశాన్ని పాలించారని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం చారిత్రక వాస్తవాలకు విరుద్ధమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి విమర్శించారు. చరిత్రను వక్రీకరించడం దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆయన పేర్కొన్నారు. ఒక...
Read More...