బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పథకాలను బ్రాహ్మణులు సద్వినియోగపరచుకోవాలి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

On


బండ్లగూడ, నాగోల్ మే 14(ప్రజా మంటలు)
తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పథకాలను బ్రాహ్మణ సద్వినియోగపరచుకోవాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.

IMG-20260514-WA0100(1)

తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవి బాధ్యతల స్వీకరణ ఉత్సవం గురువారం బండ్లగూడ, నాగోల్ వసంత విహార్ ఫంక్షన్ హాల్ లో  ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ము ఖ్య అతిథులుగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయ కమిషనర్ హనుమంతరావు ,మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాల్ చారి ,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు, తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు  జగన్ మోహన్ శర్మ , జగిత్యాల జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సంఘన భట్ల దినేష్ తదితరులు పాల్గొని నూతనంగా పదవి బాధ్యతల స్వీకరణ మహోత్సవంలో పాల్గొని బ్రాహ్మణ పరిషత్తుకు నూతనంగా నియామకమైన తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షులు బసవరాజు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్ తదితరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

IMG-20260514-WA0182 (1)

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి బ్రాహ్మణ సంఘాల బాధ్యులు, సభ్యులు విచ్చేసి సంక్షేమ పరిషత్ అధ్యక్ష కార్యదర్శులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

IMG-20260514-WA0138

లోక సమస్త సుఖినోభవంతు అంటూ బ్రాహ్మణులు సమాజానికి ఆశీస్సులు అందజేయాలి

కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ బ్రాహ్మణులు తమ వృత్తి ధర్మాన్ని సక్రమంగా పాటించినట్లయితే సమాజం వారిని గౌరవప్రదంగా చూస్తుందని పేర్కొన్నారు. లోక సమస్త సుఖినోభవంతు అంటూ బ్రాహ్మణులు సమాజానికి ఆశీస్సులు అందజేయాలని అన్ని వర్గాల సహకారంతో బ్రాహ్మణ వర్గాలు అభివృద్ధి చెందాలని అన్నారు. ఐక్యతతో ఉండి పరిషత్తు ద్వారా అందజేసే పథకాలను సద్వినియోగ పరుచుకోవాలని అన్నారు .శాఖ బేధం లేకుండా అందరికీ సంక్షేమ పరిషత్తులో డైరెక్టర్లుగా అవకాశం కల్పించడానికి కృషి జరుగుతుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలు, యువజన సంఘాలు తమ తమ పరిధిలో సేవలు అందిస్తున్నాయని సమాజంలో సేవలతోనే గుర్తింపు వస్తుందని అన్నారు .

IMG-20260514-WA0120

దేవాదాయ శాఖ  తనకు ఎంతగానో సంతృప్తినిస్తుంది

దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ తమ శాఖలో ఉన్నత పదవుల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారే ఉండడం వల్ల సహృదయంతో, ఉదారత భావంతో సమాజంలోని అన్ని వర్గాలకు సేవలు అందుతున్నాయని అన్నారు
 దేవదాయ శాఖలో మంత్రిగా పనిచేయడం తనకు ఎంతగానో సంతృప్తినిస్తున్నదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెంపుల్ టూరిజం పేరిట బాసర ,భద్రాచలం వేములవాడ  తదితర ఆలయాల నుండి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు.

IMG-20260515-WA0082

పరిషత్ అధ్యక్ష ఉపాధ్యక్షులు మాట్లాడుతూ తమపై విశ్వాసం ఉంచి పరిషత్ బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహకరించిన మంత్రి శ్రీధర్ బాబుకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.

 

పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ తనమీద అభిమానంతో దూరప్రాంతాల నుంచి విచ్చేసిన బ్రాహ్మణ బంధువులకు తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు తమకే పరిషత్తు చైర్మన్ పదవి తమకి వచ్చింది అన్నట్లుగా భావించి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం మన ముందున్న పెద్ద సమస్య ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడం అని పెండింగ్లో ఉన్న నిధులను సైతం వచ్చేటట్లు చేసి పరిషత్తుకు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా తన వంతు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Tags
Join WhatsApp

More News...

Local News 

జగిత్యాల ఎమ్మెల్యే వైఖరి విడ్డూరంగా ఉంది - మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి 

జగిత్యాల ఎమ్మెల్యే వైఖరి విడ్డూరంగా ఉంది  - మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి  జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)యావర్ రోడ్డు పై అక్రమ నిర్మాణాలు తొలగించండి జిల్లా కలెక్టర్ ప్రజా వాణిలో జీవన్ రెడ్డి పిర్యాదు    జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అవలంబిస్తున్న వైఖరి చాలా విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన జగిత్యాల జిల్లా  బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో...
Read More...
Local News 

బదిలీ పై వెళుతున్న సహాయ సంచాలకులు డా.బి.నరేష్ ను సన్మానించిన టిఎన్జీఓ లు

బదిలీ పై వెళుతున్న సహాయ సంచాలకులు డా.బి.నరేష్ ను సన్మానించిన టిఎన్జీఓ లు   జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)జిల్లా పశు సంవర్థక శాఖ లో సహాయ సంచాలకులు గా పని చేసిన డా.బోనగిరి నరేష్  ఇటీవలే బదిలీ పై కరీంనగర్ వెళ్లిన సందర్బంగా జిల్లా పశు వైద్యాధికారి డా.బి.ప్రకాశ్  అధ్యక్షతన నిర్వహించిన వీడ్కోలు సన్మాన కార్యక్రమం లో టిఎన్జీఓ జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టిఎన్జీఓ...
Read More...
Local News 

జగిత్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

జగిత్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్    జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)జిల్లాను వైద్య ఆరోగ్య రంగాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడానికి, పేద వర్గాల వారికి ఆధునిక వైద్య సౌకర్యాలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్అన్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్లోని మినీ సమావేశం మందిరంలో మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో...
Read More...
Local News 

సింగరేణి నుంచి ఆదివాసీ హక్కుల వరకు: ఉత్తర తెలంగాణలో తెలంగాణ రక్షణ సేన విస్తరణ యాత్రలో కవిత

సింగరేణి నుంచి ఆదివాసీ హక్కుల వరకు: ఉత్తర తెలంగాణలో తెలంగాణ రక్షణ సేన విస్తరణ యాత్రలో కవిత మంచిర్యాల/బెల్లంపల్లి/ఆసిఫాబాద్, జూన్ 15 (ప్రజా మంటలు): తెలంగాణ రక్షణ సేన ఉత్తర తెలంగాణ పర్యటనలో భాగంగా మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఇంద్రవెల్లి, కేస్లాపూర్ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికుల సమస్యలు, ఆదివాసీ హక్కులు, యువత ఉపాధి, విద్యా-వైద్య రంగాలపై పార్టీ వైఖరిని వెల్లడించారు. మంచిర్యాలలో...
Read More...
Crime  State News 

తహసీల్దార్ సంతకం ఫోర్జరీ  ::నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్:: నలుగురు నిందితుల అరెస్ట్

తహసీల్దార్ సంతకం ఫోర్జరీ  ::నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్:: నలుగురు నిందితుల అరెస్ట్ జగిత్యాల జూన్ 14 (ప్రజా మంటలు): (చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్)  జగిత్యాల జిల్లా మెట్‌పల్లి తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ ముద్రలతో తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో రాజుల దేవి నర్సయ్య, కలికోట వేణు, లోలపు గణేష్, పాకాల రాకేష్‌లను మెట్‌పల్లి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి...
Read More...
State News 

ఖమ్మం బాధితురాలికి న్యాయం చేయాలి: కల్వకుంట్ల కవిత

ఖమ్మం బాధితురాలికి న్యాయం చేయాలి: కల్వకుంట్ల కవిత హైదరాబాద్, జూన్ 13 (ప్రజా మంటలు): నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం అత్యాచారయత్నం బాధిత బాలికను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని త్వరితగతిన శిక్ష పడేలా...
Read More...
State News 

ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రక్షణ సేన హెచ్చరిక

ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రక్షణ సేన హెచ్చరిక హైదరాబాద్, జూన్ 13 (ప్రజా మంటలు): తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రతి గింజతో సహా ప్రభుత్వం కొనుగోలు చేయాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు రూప్ సింగ్ డిమాండ్ చేశారు. కేంద్రం 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతుండగా, రాష్ట్రంలో 70 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉత్పత్తి...
Read More...
Local News 

సాహితీవేత్త ,విద్యావేత్త ఎమ్ వి నరసింహారెడ్డి భౌతిక కాయానికి అంతిమ నివాళులు 

సాహితీవేత్త ,విద్యావేత్త ఎమ్ వి నరసింహారెడ్డి భౌతిక కాయానికి అంతిమ నివాళులు  జగిత్యాల జూన్ 10 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం కు చెందిన ప్రముఖ సాహితీవేత్త విద్యావేత్త ఎంవీ నరసింహారెడ్డి సోమవారం సాయంత్రం మృతి చెందగా బుధవారం ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నరసింహారెడ్డి కుమారులు శ్రీనివాస్ రెడ్డి శ్రీధర్ రెడ్డిలు చితికి నిప్పు అంటించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతిమయాత్రలో బంధువులు అభిమానులు శిష్యులు కళాశాల...
Read More...
Local News 

రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కంటిదానం ,నేత్రదాన ప్రతిజ్ఞ అవగాహన

రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కంటిదానం ,నేత్రదాన ప్రతిజ్ఞ అవగాహన    జగిత్యాల : జూన్ 10(ప్రజా మంటలు) ప్రపంచ నేత్రదాన దినోత్సవం జూన్ 10, సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ - రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ, హైదరాబాద్ వారి సహకారంతో బుధవారం పెన్షనర్స్ భవన్ (కోర్ట్ ప్రక్కన) “కంటి దానం – నేత్రదాన ప్రతిజ్ఞ, అవగాహన కార్యక్రమం”...
Read More...
Local News 

స్వర్గీయ మంచాల రామేశం నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులు

స్వర్గీయ మంచాల రామేశం నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులు జగిత్యాల జూన్ 10(ప్రజా మంటలు)స్వర్గీయ మంచాల రామేశం నేత్రాలను సేకరించిన ఎల్ వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ టెక్నీషియన్ కు జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.సునీల్ కుమార్, ఎం సి హెచ్ సూపరింటెండెంట్ డా. కృష్ణమూర్తి, రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ సిరిసిల్లశ్రీనివాస్, రోటరీసభ్యులు టీవి సూర్యం ద్వారా అందజేస్తున్న రామేశం కుమారుడు మంచాల...
Read More...
Local News 

దేశంలో అత్యంత దీర్ఘకాలం ప్రధాని అవుతానని ఎప్పుడూ ఊహించలేదు: ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ

దేశంలో అత్యంత దీర్ఘకాలం ప్రధాని అవుతానని ఎప్పుడూ ఊహించలేదు: ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ, జూన్ 10 (ప్రజా మంటలు): దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఢిల్లీలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) నాయకుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలో అత్యంత కాలం ప్రధాని పదవిలో కొనసాగుతానని తాను ఎప్పుడూ ఊహించలేదని వ్యాఖ్యానించారు....
Read More...
State News 

నెహ్రూ 17 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించారు – చరిత్రను వక్రీకరించొద్దు: డాక్టర్. చిన్నారెడ్డి

నెహ్రూ 17 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించారు – చరిత్రను వక్రీకరించొద్దు: డాక్టర్. చిన్నారెడ్డి హైదరాబాద్, జూన్ 10 (ప్రజా మంటలు): జవహర్‌లాల్ నెహ్రూ కంటే ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కువ కాలం దేశాన్ని పాలించారని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం చారిత్రక వాస్తవాలకు విరుద్ధమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి విమర్శించారు. చరిత్రను వక్రీకరించడం దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆయన పేర్కొన్నారు. ఒక...
Read More...