రైస్ మిల్లర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం.

On
రైస్ మిల్లర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల మార్చి 27 (ప్రజా మంటలు) : 

తేది: 27.03.2024 రోజున జిల్లా కలెక్టర్, జగిత్యాల జిల్లా సమీకృత కార్యాలయము నందు వానాకాలము 2023-24 కి సంబందించిన సిఎంఆర్ చెల్లింపుల పై రా మరియు బాయిల్డ్ రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశము నిర్వహించినారు.

జిల్లా కలెక్టర్ సమావేశములో మాట్లాడుతూ వానాకాలము 2023-24 సి ఎం ఆర్ చెల్లింపుల పురోగతి చాల తక్కువగా ఉన్నదని ప్రతి ఒక్క రైస్ మిల్లర్ వారి యొక్క రైస్ మిల్ సామర్ధ్యానికి అనుగుణంగా త్వరితగతిన సి ఎం ఆర్ చెల్లించాలని, ఇంకను సి ఎం ఆర్ చెల్లింపులు ప్రారంభించని రైస్ మిల్లర్లు త్వరతగతిన సి ఎం ఆర్ చెల్లింపులు ప్రారంభించాలని లేనియెడల తగు చర్యలు గైకోనబడునని అదేశించినారు.

తదుపరి దీనికి సంబంధించి పౌరసరఫరాల క్షేత్రస్థాయి సిబ్బందికి రోజువారీ లక్ష్యం ప్రకారము వారి పరిధిలోని మిల్లుల నుండి సి ఎం ఆర్ డెలివరీలు చేయించాలని, ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని అలానే ఎఫ్ సిఐ అధికారులు. సి ఎంఆర్ గోడౌన్ లలో అవసరమైన స్థలాన్ని ఏర్పాటు చెయ్యాలని మరియు ఎస్ డబ్ల్యూసి వారు గోడౌన్ నకు వచ్చు స్టాక్స్ దిగుమతి చేసుకొనుటకు సరిపడు హమలిలను సమకూర్చుకోవాలని అదేశించినారు.

ఇట్టి సమావేశములో అదనపు కలెక్టర్, జగిత్యాల , జిల్లా పౌరసరఫరా అధికారి, వెంకడ్చక్ జగిత్యాల , జిల్లా మేనేజర్ పౌరసరఫరాల సంస్థ, జగి జగిత్యాల , పౌరసరఫరా క్షేత్రస్థాయి సిబ్బంది మరియు రా మరియు బాయిల్డ్ రైస్ మిల్ ప్రెసిడెంట్స్ మరియు ఇతర రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.

 

Tags