హనుమాన్ విగ్రహ చర ప్రతిష్ట.

On
హనుమాన్ విగ్రహ చర ప్రతిష్ట.

(సిరిసిల్ల రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల మార్చి 26 ( ప్రజా మంటలు)

పట్టణంలోని హరిహరాలయం హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృందం ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయ ఆవరణలోని గుండు(స్వయంభూ ) హనుమాన్ ఆలయంలో హనుమాన్ విగ్రహానికి మన్యూ సూక్తంతో పలారసాలు, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.

హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృందం చే నూతనంగా ఏర్పాటు చేసుకున్న హనుమాన్ విగ్రహానికి ధర్మపురి శ్రీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో చర ప్రతిష్ట, వైదిక క్రతువులు నిర్వహించారు.

అట్టి విగ్రహానికి మంగళవారం మున్యుసూక్త అభిషేకం, హనుమాన్ చాలీసా పారాయణం,భజనలు మంగళహారతి, మంత్రపుష్పంతో పాటు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

హనుమాన్ చాలీసా పారాయణ భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

వైదిక క్రతువులు సంగనభట్ల. నరేందర్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు సిరిసిల్ల పార్థసారధి శర్మ లు నిర్వహించారు.

Tags