కులగణనలో బీసీలకు కేంద్రం ద్రోహం : కల్వకుంట్ల కవిత

జాతీయ జనగణన–కులగణనపై రౌండ్ టేబుల్ సమావేశంలో కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు

On
కులగణనలో బీసీలకు కేంద్రం ద్రోహం : కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, జనవరి 29  (ప్రజా మంటలు):

దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణన–కులగణన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాతీయ జనగణనలో కులగణనపై సమగ్ర చర్చ కోసం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ప్రసంగించారు.

బిసి కాలం తొలగించడం అన్యాయం

పదేళ్లకు ఒకసారి జరగాల్సిన జనగణన 2021లో కోవిడ్ కారణంగా జరగలేదని గుర్తు చేశారు. అన్ని రాష్ట్రాల నుంచి కులగణనపై డిమాండ్ రావడంతో కేంద్రం అంగీకరించిందని, దీంతో తాము సంతోషించామని అన్నారు. అయితే తాజాగా విడుదల చేసిన డాక్యుమెంట్‌లో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కాలమ్స్ ఇచ్చి, ఓబీసీలకు మాత్రం లేకుండా కేవలం “కులం/అదర్స్” అని మాత్రమే ఉంచడం ద్వారా బీజేపీ అసలు ఉద్దేశం బయటపడిందని విమర్శించారు.

వివిధ రాష్ట్రాల్లో ఒకే కులంలో తేడాలున్నాయి

ఒకే కులాన్ని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా గుర్తిస్తారని తెలిపారు. ఉదాహరణగా వెలమ కులం తెలంగాణలో ఓసీగా, మహారాష్ట్రలో ఎస్సీగా, ఆంధ్రప్రదేశ్‌లో బీసీగా గుర్తింపుపొందుతోందని చెప్పారు. చిన్న సంఖ్యలో ఉన్న కులాలకే ఇంత గందరగోళం ఉంటే, దేశంలో సుమారు 56 శాతం ఉన్న బీసీల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

కులగణన జరిగితేనే ఏ వర్గం ఎంత ఉందో, వారికి బడ్జెట్ కేటాయింపులు, ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలో స్పష్టత వస్తుందని కవిత అన్నారు. గతంలో అగ్రకులాల్లో పేదలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు కూడా వారు ఏ కేటగిరీలోకి వస్తారో చెప్పలేదని గుర్తు చేశారు.

ఉప కులాలున్నాయి

కులగణన అంటే కేవలం కులం మాత్రమే కాకుండా ఉపకులాల గుర్తింపూ ఉండాలని ఆమె స్పష్టం చేశారు. “ఫస్ట్ రికగ్నిషన్, నెక్స్ట్ రిజర్వేషన్” అనే విధానమే సరైనదని తెలిపారు. బీసీలు, ఓబీసీలు, ఎంబీసీలు, డీఎన్టీలు గుర్తింపు లేకుండా పోతే భవిష్యత్తులో సర్టిఫికెట్లు కూడా రాని ప్రమాదం ఉందని హెచ్చరించారు.

దేశంలో సుమారు 4 వేల కులాలు ఉన్నాయని, అన్నింటినీ “అదర్స్” కింద పెట్టితే గణనకు అర్థం ఏముంటుందని ప్రశ్నించారు. 2011లో కాంగ్రెస్ చేసిన తప్పే ఇప్పుడు బీజేపీ కూడా చేస్తోందని, రూ. 11 వేల కోట్లతో చేపట్టే జనగణనలో బీసీలను మోసం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

అన్ని పార్టీలు స్పష్టమైన వైఖరి ప్రకటించాలి

ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు తమ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని కవిత డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ విషయంపై ఎందుకు మౌనం పాటిస్తున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. ఇది ఒక్క వర్గంపై కాదు, అన్ని వర్గాలపై జరుగుతున్న అన్యాయమని పేర్కొన్నారు.

తెలంగాణలోని అన్ని కులాలు, ఉపకులాలపై సమగ్ర నివేదికను తెలంగాణ జాగృతి సిద్ధం చేసి కేంద్రానికి పంపిస్తామని తెలిపారు. “తెలంగాణ థింక్స్ – ఇండియా ఫాలోస్ నెక్స్ట్” అన్న విధంగా కులగణన విషయంలోనూ ముందడుగు వేస్తామని చెప్పారు. ఈ అంశాన్ని మున్సిపల్, జడ్పీటీసీ ఎన్నికల్లో రాజకీయ అజెండాగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

జనాభా గణన ద్వారా ప్రతి వర్గానికి వారి జనాభా మేరకు హక్కులు, అవకాశాలు రావాల్సిందేనని కవిత స్పష్టం చేశారు. కులగణనలో జరుగుతున్న కుట్రను గమనించి సమాజం అప్రమత్తం కావాలని కోరారు. రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేసిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

More News...

Crime  State News 

ఫోన్ ట్యాపింగ్ కేసు: మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసు: మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు హైదరాబాద్, జనవరి 29 – ప్రజా మంటలు. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సిట్ అధికారులు నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. నోటీసుల్లో భాగంగా,...
Read More...
Local News  State News 

జాతీయ జనగణనలో బీసీలను పక్కన పెట్టే కుట్ర – రౌండ్ టేబుల్ సమావేశంలో తీవ్ర విమర్శలు

జాతీయ జనగణనలో బీసీలను పక్కన పెట్టే కుట్ర – రౌండ్ టేబుల్ సమావేశంలో తీవ్ర విమర్శలు కేంద్ర ప్రభుత్వ డాక్యుమెంట్ ప్రమాదకరం : కల్వకుంట్ల కవిత
Read More...
Local News  State News 

కులగణనలో బీసీలకు కేంద్రం ద్రోహం : కల్వకుంట్ల కవిత

కులగణనలో బీసీలకు కేంద్రం ద్రోహం : కల్వకుంట్ల కవిత హైదరాబాద్, జనవరి 29  (ప్రజా మంటలు): దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణన–కులగణన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాతీయ జనగణనలో కులగణనపై సమగ్ర చర్చ కోసం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ప్రసంగించారు. బిసి కాలం తొలగించడం అన్యాయం పదేళ్లకు ఒకసారి జరగాల్సిన...
Read More...

ఎమ్మెల్యే సంజయ్ అవినీతితో జగిత్యాల మున్సిపాలిటీ బ్రష్టు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ఎమ్మెల్యే సంజయ్ అవినీతితో జగిత్యాల మున్సిపాలిటీ బ్రష్టు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల, జనవరి 28 (ప్రజా మంటలు): జగిత్యాల మున్సిపాలిటీని ఎమ్మెల్యే సంజయ్ అవినీతి, అక్రమాలతో బ్రష్టు పట్టించారని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. ఇందిరా భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లలో 16 మంది కమిషనర్లు మారటం, 8 మంది ఉద్యోగులు జైలు పాలవడం, ఏసీబీ–విజిలెన్స్ దాడులే ఎమ్మెల్యే...
Read More...
State News 

మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి అభ్యర్థుల పోటీ

మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి అభ్యర్థుల పోటీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌తో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయం హైదరాబాద్, జనవరి 28 (ప్రజా మంటలు): రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ‘సింహం’ గుర్తుపై తెలంగాణ జాగృతి ఔత్సాహిక అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆల్ ఇండియా...
Read More...
Today's Cartoon 

Today's Cartoon

Today's Cartoon Today's Cartoon
Read More...

ఎన్నికల నియమవళి పక్కాగా అమలు చేయాలి నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఎన్నికల నియమవళి పక్కాగా అమలు చేయాలి  నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మెట్పల్లి/కోరుట్ల జనవరి 28 (ప్రజా మంటలు)మెట్ పెల్లి మరియు కోరుట్ల మున్సిపాలిటీల్లో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరుగుతోందా లేదా అనే విషయాన్ని స్వయంగా పరిశీలించారు.నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా...
Read More...

గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి దేవదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్

గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి  దేవదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్ జగిత్యాల జనవరి 28 ( ప్రజా మంటలు)2027 లో  గోదావరి పుష్కరాలు జరుగనున్న నేపథ్యంలో పుష్కరాలను పకడ్బందీగా నిర్వహించే క్రమంలో బుధవారం జిల్లా కలెక్టర్ లు మరియు సంబందిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగిత్యాల జిల్లా నుండి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు.  ఈ సందర్బంగా దేవదాయ శాఖ ప్రధాన కార్యదర్శి...
Read More...

శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ధర్మపురి సిఐ కి అందజేత

శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ధర్మపురి సిఐ కి అందజేత వెల్గటూరు జనవరి 28 (ప్రజా మంటలు) జక్కాపురం నారాయణస్వామి వెలగటూరుధర్మపురి సిఐ ఏ. నరసింహ రెడ్డి నీ మర్యాద పూర్వకం గా కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకీ ఆహ్వానం అందించిన ఆలయ చైర్మన్ చింతల రాజయ్య,సర్పంచ్ భూపల్లి రాజయ్య,ఉపసర్పంచ్ యాగండ్ల గంగయ్య, ప్రధాన అర్చకులు పవన్ కుమార్ ,హరి ప్రశాంత్,   ఈ కార్యక్రమం...
Read More...

ఈనెల 30న వెలగటూర్ మండల స్థాయి ( సీఎం కప్) సెకండ్ ఎడిషన్ సెలక్షన్స్

ఈనెల 30న వెలగటూర్ మండల స్థాయి ( సీఎం కప్) సెకండ్ ఎడిషన్ సెలక్షన్స్    వెల్గటూర్ జనవరి 28 ( ప్రజా మంటలు) జక్కాపురం నారాయణస్వామి వెల్గటూర్మండల స్థాయి సీఎం కప్ (సెకండ్ ఎడిషన్)  సెలక్షన్స్ తేదీ 30 జనవరి 2026 శుక్రవారం రోజున జడ్.పి.హెచ్.ఎస్ వెల్గటూర్ లో నిర్వహించబడతాయని ఎంఈఓ బోనగిరి ప్రభాకర్  తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల క్రీడాకారిని మరియు క్రీడాకారులు తమ వెంట రిజిస్ట్రేషన్ చేసుకున్న...
Read More...
Crime  State News 

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్‌పై మహిళ ఆరోపణలు

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్‌పై మహిళ ఆరోపణలు అమరావతి / రైల్వే కోడూరు, జనవరి 28 (ప్రజా మంటలు): రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్‌పై ఓ మహిళ చేసిన తీవ్రమైన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. తనతో 2024 నుంచి 2026 జనవరి 7 వరకు సన్నిహిత సంబంధాలు కొనసాగించిన ఎమ్మెల్యే, పెళ్లి చేస్తానని నమ్మించి మోసం చేశారని,...
Read More...

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరు సహకరించాలి మున్సిపల్ ఎన్నికల కోడ్‌ నియమావళిని పాటించాలి_ జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరు సహకరించాలి  మున్సిపల్ ఎన్నికల కోడ్‌ నియమావళిని పాటించాలి_ జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ జగిత్యాల జనవరి 28 ( ప్రజా మంటలు) ఎన్నికల కోడ్‌ నియమావళిని అందరు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు.  బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో మిని సమావేశ హాల్ లో ఏర్పాటు చేసిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్‌ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా అడిషనల్...
Read More...