జీవన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ బిజెపి కార్యకర్తలపై లేదా..? ఎంపీ అరవింద్ ఒంటెద్దు పోకడలు మానుకోవాలి.

ఎంపీపై జగిత్యాల బిజెపి సీనియర్ నేతల ధ్వజం.

On
జీవన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ బిజెపి కార్యకర్తలపై లేదా..?  ఎంపీ అరవింద్ ఒంటెద్దు పోకడలు మానుకోవాలి.

జగిత్యాల, జనవరి 24 (ప్రజా మంటలు)

40 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో పని చేసిన జీవన్ రెడ్డిని కాంగ్రెస్ నాయకత్వం ఇబ్బంది పెట్టడం తనకు బాధ కలిగిస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించడాన్ని జగిత్యాల బిజెపి సీనియర్ నేతలు తీవ్రంగా ఖండించారు.

శనివారం బిజెపి సీనియర్ నేతలు సీపెళ్లి రవీందర్, అంకార్ సుధాకర్, బాసెట్టి ప్రభాకర్, వెంకట్రాజం, రత్నాకర్ రెడ్డి, ఎర్ర శ్రీనివాస్,నవ్వోతు  సురేష్, మహేందర్ తదితరులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా పోటీచేసిన ధర్మపురి అరవింద్ గెలుపు కోసం ప్రాణాలకు తెగించి పనిచేసిన బిజెపి సీనియర్ కార్యకర్తలను పట్టించుకోకుండా ఇబ్బందులు పెడుతూన్నారని విమర్శించారు.

పరాయి పార్టీ నాయకుల పై ఎంపీ సానుభూతి ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందిన ధర్మపురి అరవింద్ నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని జగిత్యాల జిల్లాలో పార్టీని ఎంతవరకు బలోపేతం చేశాడో చెప్పాలని నిలదీశారు.

గత 40 సంవత్సరాలుగా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుని  జగిత్యాలలో ప్రాణాలకు తెగించి పనిచేసిన అనేకమంది సీనియర్ నాయకులను, కార్యకర్తలను పార్టీకి దూరం చేసి ఎలాంటి ప్రజాదరణ లేని నాయకులను వెంటేసుకొని అడపాదడపా  జగిత్యాలలో ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళడమే తప్పా పార్టీ బలోపేతం కోసం అరవింద్ చేసిందేమీ లేదన్నారు. ఎంపిగా ఉన్న ధర్మపురి అరవింద్ గత మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం ఒక్కసారి కూడా జగిత్యాలలో అడుగుపెట్టలేదని, కార్యకర్తలమంతా కృషిచేసి పట్టణంలో  13వేల పై చిలుకు ఓట్లను సాధించామని తెలిపారు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసిన భోగ శ్రావణి కోసం ఎంపీ తో పాటు రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం ప్రచారం నిర్వహించినప్పటికీ జగిత్యాల పట్టణంలో కేవలం 15 వేల ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్టీ కార్యకర్తలను పట్టించుకోకుండా బిజెపి ఇన్చార్జి భోగ శ్రావణి హైదరాబాదు కే పరిమితం కావడం, ఎంపీ అరవింద్ జగిత్యాలముఖం కూడా చూడకపోవడంతో కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కనీసం కార్యకర్తలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న సీనియర్ పార్టీ కార్యకర్తలను కాదని ప్రజాదరణ లేని తమ అనుయాయులకు బీ ఫాం లు కట్టపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగిత్యాల మున్సిపాలిటీలో అన్ని క్షేత్రాలను సమన్వయపరిచి, గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్లు ఇచ్చి నాయకులంతా కష్టపడితే కనీసం 15 కౌన్సిలర్ సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికైనా ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ జిల్లా  అధ్యక్షుడు మోర పెళ్లి సత్యనారాయణ రావు, భోగ శ్రావణి లు తమ ఒంటెద్దు పోకడలను మానుకోవాలని, లేనట్లయితే రాబోయే రోజుల్లో బిజెపి పార్టీ తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం జగిత్యాలపై ప్రత్యేక శ్రద్ధ చూపి పార్టీని ప్రక్షాళన చేయాలని కోరారు.

Join WhatsApp

More News...

State News 

ఘనంగా కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు - గోధుమలతో భారీ చిత్రం, డాక్యుమెంటరీ విడుదల

ఘనంగా కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు - గోధుమలతో భారీ చిత్రం, డాక్యుమెంటరీ విడుదల హైదరాబాద్ మార్చి 13 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత   జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. అర్ధరాత్రి తర్వాత తెలంగాణ జాగృతి నాయకులు కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం వేద పండితులు ఆశీర్వాదాలు అందించగా, బంజారా పూజారులు సంప్రదాయ విధానంలో దీవించారు. జాగృతి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు...
Read More...
Local News 

క్రీడలు మానసిక ఉల్లాసం శారీరక దారుఢ్యం పెంపొందిస్తాయి- ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

క్రీడలు మానసిక ఉల్లాసం శారీరక దారుఢ్యం పెంపొందిస్తాయి- ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల మార్చి 12(ప్రజా మంటలు)క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు.పట్టణ వివేకానంద మినీ స్టేడియంలో తెలంగాణ యూత్ స్పోర్ట్స్ అథారిటీ వారి ఆద్వర్యం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అస్మిత ఖేలో ఇండియా కార్యక్రమం లో భాగంగా జిల్లా స్తాయి అస్మిత లీగ్...
Read More...
Local News 

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన వీరశైవ సమాజం నూతన కార్యవర్గం

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన వీరశైవ సమాజం నూతన కార్యవర్గం    జగిత్యాల మార్చి 12 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని కలిసిన జగిత్యాల పట్టణ వీర శైవ సమాజం నూతన కార్యవర్గ సభ్యులు.జగిత్యాల పట్టణ వీరశైవసమాజం నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ప్రమాణస్వీకారానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని  కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
Read More...
Local News 

అసంబద్ధమైన తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులను విరమించుకోవాలి  తపస్ జిల్లా అధ్యక్షులు ప్రసాదరావు

అసంబద్ధమైన తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులను విరమించుకోవాలి   తపస్ జిల్లా అధ్యక్షులు ప్రసాదరావు   జగిత్యాల, మార్చి 12:అసంబధ్ధమైన, ఆశాస్త్రియమైన తెలంగాణ విద్యా కమిషన్ సిపారసులను విరామించుకోవాలని జగిత్యాల జిల్లా తపస్ అధ్యక్షులు బోయినపల్లి ప్రసాద్ రావు కోరారు.    తపస్ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులపై గీత గ్రంధాలయం కేంద్రంగా గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రసాద్ రావు మాట్లాడుతూ తెలంగాణ...
Read More...
State News 

వెలుగుమట్ల బాధితులకు ఇళ్లు ప్రకటించడంతో కవిత దీక్ష విరమణ – భూదాన్ భూములపై శ్వేతపత్రం డిమాండ్

వెలుగుమట్ల బాధితులకు ఇళ్లు ప్రకటించడంతో కవిత దీక్ష విరమణ – భూదాన్ భూములపై శ్వేతపత్రం డిమాండ్ హైదరాబాద్, మార్చ్ 11 (ప్రజా మంటలు): ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలకు గురైన బాధితులకు ప్రభుత్వం ఇళ్లు, ఇండ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో కొనసాగుతున్న నిరాహార దీక్షను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరియు ధర్మసమాజ్ పార్టీ నాయకుడు విశారదన్ మహారాజ్ విరమించారు.జస్టిస్ ఈశ్వరయ్య నిమ్మరసం ఇచ్చి...
Read More...
Local News 

స్మశాన వాటికలో చెట్లు నాటిన ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్

స్మశాన వాటికలో చెట్లు నాటిన ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్    జగిత్యాల మార్చి 11 (ప్రజా మంటలు)పట్టణ గొల్లపల్లి రోడ్ లో గల సత్య హరిచంద్ర స్మశాన వాటిక లో రోటరీ ఆపి రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఏర్పాటుచేసిన మొక్కలు నాటే కార్యక్రమం,పలు అభివ్రుద్ది కార్యక్రమాల్లో పాల్గొని మొక్కలు నాటిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల...
Read More...
Local News 

ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణ సిబ్బందికి అవగాహన

ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణ సిబ్బందికి అవగాహన జగిత్యాల మార్చి 11 (ప్రజా మంటలు)ఈనెల 14 నుండి ప్రారంభం కాబోయే ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణకు కేటాయింపబడిన సిబ్బందికి అవగాహన కార్యక్రమం బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.   జిల్లా  వ్యాప్తంగా ఈనెల 14 నుండి ప్రారంభం కాబోయే ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణకు కేటాయింపబడిన చీఫ్ సూపర్డెంట్ లకు మరియు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు నియమ ఈ...
Read More...
Local News 

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి జగిత్యాల మార్చి 11 ( ప్రజా మంటలు)పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని జగిత్యాల పట్టణం లో జగిత్యాల జిల్లా ఎంఐఎం పార్టీ అధ్యక్షులు లియాకత్ అలీ మోసిన్  స్వగృహం లో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని  శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి .ఈ...
Read More...
Local News 

సామాజిక మార్పుతోనే మహిళా సాధికారత సాధ్యం: సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు

సామాజిక మార్పుతోనే మహిళా సాధికారత సాధ్యం: సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు మెట్‌పల్లి, మార్చ్ 10 (ప్రజా మంటలు): సమాజంలో సానుకూల మార్పులు వచ్చినప్పుడే మహిళలకు నిజమైన సాధికారత సాధ్యమవుతుందని మెట్‌పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మండల న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన...
Read More...
State News 

కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచిస్తా – మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచిస్తా – మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు జగిత్యాల రూరల్,  మార్చ్ 10 (ప్రజా మంటలు): కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేదా అన్న విషయంపై తాను ఆలోచిస్తున్నానని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల రోజే...
Read More...
State News 

కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం

 కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం హైదరాబాద్, మార్చ్ 10 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్రానికి కొత్త రాష్ట్రపతి ప్రతినిధిగా, గవర్నర్ gaa నియమితులైన శివ ప్రతాప్ శుక్లా రాష్ట్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.ఈ స్వాగత కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,...
Read More...
Local News 

వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతపై కవిత నిరవధిక నిరాహార దీక్ష కొనసాగింపు

వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతపై కవిత నిరవధిక నిరాహార దీక్ష కొనసాగింపు ఖమ్మం/హైదరాబాద్, మార్చ్ 10 (ప్రజా మంటలు): ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత ఘటనకు నిరసనగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతోంది. సోమవారం రాత్రి ఖమ్మంలో దీక్ష ప్రారంభించిన కవితను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. ఖమ్మం సీపీ ఆధ్వర్యంలో సుమారు 600...
Read More...