ఆంజనేయుని దయతోనే నాకు పునర్జన్మ – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

On
ఆంజనేయుని దయతోనే నాకు పునర్జన్మ – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

కొండగట్టు, జనవరి 3 (ప్రజా మంటలు):

ఆంజనేయ స్వామి దయతోనే తనకు పునర్జన్మ లభించిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆయన దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా కొండగట్టులో టిటిడి సహకారంతో నిర్మించనున్న వాయుపుత్ర సదన్ ధర్మశాల, దీక్ష విరమణ మండపం మరియు 96 గదుల వసతి సముదాయం నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు రూ. 35.19 కోట్లను టిటిడి నిధుల నుంచి వెచ్చించనున్నారు. 

పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ద్వారా జేఎన్టీయూ హెలిప్యాడ్‌కు చేరుకోగా, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధులు, వికలాంగులు, ట్రాన్స్‌జెండర్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తదితరులు 26374f51-1d8b-42bb-a754-5da784450970ఘన స్వాగతం పలికారు.

అనంతరం స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,

“ఆంజనేయ స్వామి మా ఇంటి ఇలవేల్పు. ఆయన కృప వల్లే నాకు పునర్జన్మ లభించింది. ఆలయ అధికారులు అభివృద్ధి అవసరాలను తెలియజేసిన వెంటనే సహకారం అందిస్తానని మాట ఇచ్చాను. నేడు అది కార్యరూపం దాల్చింది” అని పేర్కొన్నారు.

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కొండగట్టు ఆలయ మాస్టర్ ప్లాన్ అమలుకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. గిరి ప్రదక్షిణ మార్గం సుగమం చేయడానికి అవసరమైతే తానే కరసేవకుడిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.

కొండగట్టు ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టిటిడి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఘన స్వాగతం పలికిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వ్యాఖ్యలు

ఉత్తర తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి రావడం, టిటిడి ద్వారా రూ.35.19 కోట్ల నిధులు సమకూర్చడం చారిత్రాత్మకమని అన్నారు. భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం కూడా నిధులు కేటాయించి కొండగట్టు ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం స్థాయిలో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

ఏపీ డిప్యూటీ సీఎం సహకారంతో టిటిడి నిధులు అందడం వల్ల కొండగట్టు ఆలయ అభివృద్ధికి నూతన ఊపొస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఏపీ శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్, టిటిడి బోర్డు సభ్యులు బి. ఆనందసాయి, బి. మహేందర్ రెడ్డి, టిటిడి ఎల్‌ఏసీ చైర్మన్ ఎన్. శంకర్ గౌడ్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజా గౌడ్, ఆలయ ఈవో, జిల్లా అధికారులు, ఆలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

More News...

State News 

వెలుగుమట్ల బాధితులకు ఇళ్లు ప్రకటించడంతో కవిత దీక్ష విరమణ – భూదాన్ భూములపై శ్వేతపత్రం డిమాండ్

వెలుగుమట్ల బాధితులకు ఇళ్లు ప్రకటించడంతో కవిత దీక్ష విరమణ – భూదాన్ భూములపై శ్వేతపత్రం డిమాండ్ హైదరాబాద్, మార్చ్ 11 (ప్రజా మంటలు): ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలకు గురైన బాధితులకు ప్రభుత్వం ఇళ్లు, ఇండ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో కొనసాగుతున్న నిరాహార దీక్షను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరియు ధర్మసమాజ్ పార్టీ నాయకుడు విశారదన్ మహారాజ్ విరమించారు.జస్టిస్ ఈశ్వరయ్య నిమ్మరసం ఇచ్చి...
Read More...
Local News 

స్మశాన వాటికలో చెట్లు నాటిన ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్

స్మశాన వాటికలో చెట్లు నాటిన ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్    జగిత్యాల మార్చి 11 (ప్రజా మంటలు)పట్టణ గొల్లపల్లి రోడ్ లో గల సత్య హరిచంద్ర స్మశాన వాటిక లో రోటరీ ఆపి రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఏర్పాటుచేసిన మొక్కలు నాటే కార్యక్రమం,పలు అభివ్రుద్ది కార్యక్రమాల్లో పాల్గొని మొక్కలు నాటిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల...
Read More...
Local News 

ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణ సిబ్బందికి అవగాహన

ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణ సిబ్బందికి అవగాహన జగిత్యాల మార్చి 11 (ప్రజా మంటలు)ఈనెల 14 నుండి ప్రారంభం కాబోయే ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణకు కేటాయింపబడిన సిబ్బందికి అవగాహన కార్యక్రమం బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.   జిల్లా  వ్యాప్తంగా ఈనెల 14 నుండి ప్రారంభం కాబోయే ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణకు కేటాయింపబడిన చీఫ్ సూపర్డెంట్ లకు మరియు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు నియమ ఈ...
Read More...
Local News 

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి జగిత్యాల మార్చి 11 ( ప్రజా మంటలు)పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని జగిత్యాల పట్టణం లో జగిత్యాల జిల్లా ఎంఐఎం పార్టీ అధ్యక్షులు లియాకత్ అలీ మోసిన్  స్వగృహం లో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని  శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి .ఈ...
Read More...
Local News 

సామాజిక మార్పుతోనే మహిళా సాధికారత సాధ్యం: సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు

సామాజిక మార్పుతోనే మహిళా సాధికారత సాధ్యం: సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు మెట్‌పల్లి, మార్చ్ 10 (ప్రజా మంటలు): సమాజంలో సానుకూల మార్పులు వచ్చినప్పుడే మహిళలకు నిజమైన సాధికారత సాధ్యమవుతుందని మెట్‌పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మండల న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన...
Read More...
State News 

కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచిస్తా – మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచిస్తా – మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు జగిత్యాల రూరల్,  మార్చ్ 10 (ప్రజా మంటలు): కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేదా అన్న విషయంపై తాను ఆలోచిస్తున్నానని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల రోజే...
Read More...
State News 

కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం

 కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం హైదరాబాద్, మార్చ్ 10 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్రానికి కొత్త రాష్ట్రపతి ప్రతినిధిగా, గవర్నర్ gaa నియమితులైన శివ ప్రతాప్ శుక్లా రాష్ట్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.ఈ స్వాగత కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,...
Read More...
Local News 

వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతపై కవిత నిరవధిక నిరాహార దీక్ష కొనసాగింపు

వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతపై కవిత నిరవధిక నిరాహార దీక్ష కొనసాగింపు ఖమ్మం/హైదరాబాద్, మార్చ్ 10 (ప్రజా మంటలు): ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత ఘటనకు నిరసనగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతోంది. సోమవారం రాత్రి ఖమ్మంలో దీక్ష ప్రారంభించిన కవితను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. ఖమ్మం సీపీ ఆధ్వర్యంలో సుమారు 600...
Read More...
State News 

వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా కల్వకుంట్ల కవిత నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభం

వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా కల్వకుంట్ల కవిత నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభం ఖమ్మం, మార్చ్ 9 (ప్రజా మంటలు): ఖమ్మం పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అంబేద్కర్ భవన్‌లో వెలుగుమట్ల బాధితులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు.ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద మాట్లాడిన ఆమె, తెలంగాణ జాగృతి, ఎస్సీ–ఎస్టీ–బీసీ జేఏసీ, ధర్మసమాజ్ పార్టీ...
Read More...
Local News 

ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిశీలించాలి

ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిశీలించాలి జగిత్యాల మార్చ్ 9(ప్రజా మంటలు)ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా అదనపు  కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్ లత  అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు.   అదనపు కలెక్టర్ (రెవెన్యూ)  బిఎస్ లత  మాట్లాడుతూ...
Read More...
National  International  

ఇరాన్ సుప్రీం లీడర్‌గా మోజ్తభా ఖమెనీ నియామకం –

ఇరాన్ సుప్రీం లీడర్‌గా మోజ్తభా ఖమెనీ నియామకం – ఇరాన్ సుప్రీం లీడర్‌గా మోజ్తభా కామెనీ నియామకం మధ్యప్రాచ్య దేశమైన ఇరాన్లో అత్యున్నత మత-రాజకీయ అధికారం అయిన సుప్రీం లీడర్ పదవికి మోజ్తభా కామెనీను ఎంపిక చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, దౌత్య వర్గాల్లో చర్చకు దారితీసింది.మోజ్తభా కామెనీ, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయిన అయాతొల్లా...
Read More...
Local News 

ఖమ్మంలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ – మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే అరెస్టుపై వివాదం

ఖమ్మంలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ – మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే అరెస్టుపై వివాదం ఖమ్మం, మార్చి 09 (ప్రజా మంటలు): వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా ఖమ్మం జెడ్పీ సెంటర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్, వెలుగుమట్ల బాధితులు మరియు జాగృతి నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కవితతో...
Read More...