జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సమర్థ పనితీరు – నేరాలు 5.05 శాతం తగ్గింపు* జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

On
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సమర్థ పనితీరు – నేరాలు 5.05 శాతం తగ్గింపు* జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

*
జగిత్యాల డిసెంబర్ 23 (ప్రజా మంటలు)
పండుగలు, ఎన్నికలు, జాతరలు ప్రశాంతంగా – అవాంఛనీయ  సంఘటన లేకుండా ముగిసిన ఏడాది*

*మహిళలు, చిన్నారుల భద్రతే ప్రథమ లక్ష్యం,–  డ్రగ్స్‌ పై జీరో టాలరెన్స్ విధానం అమలు*

*‘సురక్షిత ప్రయాణం’తో రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు చర్యలు

జిల్లాలో గత సంవత్సర కాలంలో జిల్లా పోలీస్ శాఖ నిర్వహించిన శాంతి భద్రతలు, నేర నియంత్రణ, ప్రజా భద్రత చర్యలు మరియు సాధించిన ప్రగతిని  జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  వార్షిక ప్రెస్‌మీట్‌ ద్వారా వివరాలను వెల్లడించారు.   


గత సంవత్సరం జిల్లాలో శాంతి భద్రతలను కట్టుదిట్టంగా నిర్వహిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహించారు. పండుగలు, ఎన్నికలు, జాతరలు, భారీ సమావేశాల సమయంలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడం జరిగింది. జిల్లాలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ముఖ్యంగా హత్యలు, దోపిడీలు, చైన్ స్నాచింగ్, ఆన్‌లైన్ మోసాలు వంటి కేసుల్లో నేరస్తులను త్వరితగతిన గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది.అదే విదంగా పెండింగ్ కేసుల పరిష్కారంలో కూడా గణనీయమైన పురోగతి సాధించాం.మహిళలు, బాలల రక్షణకు జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది,ఇందుకోసం షీ టీమ్స్ , ఏ హెచ్ టి యు, భరోసా సెంటర్  ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. మహిళలపై జరిగే  నేరాల విషయంలో జీరో టాలరెన్స్ విధానం అమలు చేయడం జరిగింది. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, హెల్మెట్ అవగాహన కార్యక్రమాలు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాం.అదే విదంగా జిల్లా పోలీస్ శాఖ  ద్వారా సురక్షిత ప్రయాణం, పోలీస్ పాఠశాల వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా  రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడంలో విజయం సాధించాం.టెక్నాలజీని వినియోగిస్తూ స్మార్ట్ పోలీసింగ్ దిశగా అడుగులు వేయడం జరిగిందని , సి సి టి వి  నెట్‌వర్క్, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువయ్యేలా చర్యలు తీసుకున్నాం అన్నారు. జిల్లాలో శాంతిభద్రతలను అదుపులో ఉంచడం మరియు ప్రజలకు మెరుగైన భద్రత సేవలు అందించడంలో  జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది అహర్నిశలు కష్టపడి చేసిన సేవలు ఉన్నాయి అని  వారి నిబద్ధతకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.అదే విదంగా జిల్లా ప్రజలు పోలీసులకు అందిస్తున్న సహకారం అభినందనీయం అని భవిష్యత్తులో కూడా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని అన్నారు. 

 

*నమోదైన నేరాలు:* 2025లో జిల్లాలో 5,620 నేరాలు నమోదు కాగా, 2024లో నమోదైన 5,919 కేసులతో పోలిస్తే 229 కేసులు తగ్గాయని తెలిపారు. 2024తో పోలిస్తే 2025లో నమోదైన కేసులు 5.05 శాతం తగ్గాయి.అత్యధిక నేరాలు: *జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ – 770 కేసులు. అత్యల్ప నేరాలు: *బుగ్గారం పోలీస్ స్టేషన్ – 135 కేసులు నమోదు కావడం జరిగింది.హత్యలు, అత్యాచారాలు, అపహరణలు వంటి తీవ్ర నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి, నిందితులను త్వరితగతిన అరెస్ట్ చేయడం జరిగింది. 2025లో మొత్తం 29 హత్య కేసులు నమోదయ్యాయి. కుటుంబ కలహాలు , ఆస్తి వివాదాలు, కట్న హత్యలు, చిన్నచిన్న గొడవలు ప్రధాన కారణాలుగా ఉన్నాయని తెలిపారు. 


*ప్రాపర్టీ కేసులు(దొంగతనాలు):* 2025లో 381  ప్రాపర్టీ కేసులు నమోదు కాగా, వాటిలో 187 కేసులు చేధించి రూ. ₹2,92,37,439/ విలువైన ఆస్తి రికవరీ చేయడం జరిగింది. రికవరీ శాతం(69.85%).  

 ఎస్సీ/ ఎస్టి కేసులు:మొత్తం 104 కేసులు నమోదు కాగా, గత ఏడాదితో పోలిస్తే 5 కేసులు తగ్గాయి.

పీడీఎస్ రైస్ కేసులు:19 కేసులు నమోదు చేసి, 1,135.69 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఇసుక అక్రమ రవాణా:234 కేసులు, 410 నిందితులు, 260 వాహనాలు స్వాధీనం.

గేమింగ్ యాక్ట్:167 కేసులు నమోదు చేసి, ₹30,62,036/- నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

డ్రంక్ అండ్ డ్రైవ్: మొత్తం 9,290 కేసులు నమోదు చేయగా, 14 మందికి జైలు శిక్షలు విధించబడ్డాయి.

*రోడ్డు ప్రమాదాలు:* 2024తో పోలిస్తే 2025లో ప్రమాదాల సంఖ్య పెరిగినప్పటికీ, మృతుల సంఖ్య తగ్గిందని తెలిపారు. ప్రమాదాలు నివారించేందుకు స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్‌, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అధిక శబ్దం చేసే 130 మోడిఫైడ్ సైలెన్సర్లు తొలగించారు.

*మాదక ద్రవ్యాల నియంత్రణ:* 2025లో ఇప్పటివరకు 24.220 కిలోల గంజాయి స్వాధీనం చేసి, 86 కేసులు, 203 నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు.మాదకద్రవ్యాల నివారణే లక్ష్యంగా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో 189 యాంటీ డ్రగ్ క్లబ్స్ ఏర్పాటు చేసి మాదకద్రవ్యాల వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడం జరిగింది. వీటితో పాటు పెయింటింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు  ప్రధానం చేయడం జరిగింది. 

*రౌడీ షీట్స్:* ప్రస్తుత సంవత్సరంలో తరచుగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై మొత్తం 76 హిస్టరీ షీట్లు ఓపెన్ చేయగా, అందులో హత్య కేసుల్లో పాల్గొన్న నేరస్తులపై 33 రౌడీ షీట్లు ఉన్నాయి అన్నారు.

*డయల్-100:* డయల్-100 కాల్ ద్వారా జిల్లాలో ఏ ప్రాంతంనుండైనా నేర సమాచారం అందుకున్న 4  నిమిషాల వ్యవధిలో బ్లూ కోల్ట్, పెట్రో కార్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది.మొత్తం 30,954 డయల్–100 కాల్స్ అందగా, వాటిలో 130 కేసులు  ఎఫ్ ఐ ఆర్ లు.నమోదు చేశారు

*గల్ఫ్ ఛీటింగ్ కేసులు:* గల్ఫ్ కు పంపిస్తానని మోసం చేసిన 44  కేసులు నమోదు చేసి 54 మందిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.

*ఆపరేషన్ స్మైల్ & ముస్కాన్–XI:* 2025 సంవత్సరంలో జనవరి, జూలై నెలల్లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖతో కలిసి ఆపరేషన్ స్మైల్& ముస్కాన్–XI కార్యక్రమాలు నిర్వహించి, 76 మంది పిల్లలను రక్షించి, వారి కుటుంబాలకు అవగాహన కల్పించడం జరిగింది. 

*385 గ్రామ పంచాయతీలకు 2వ సాధారణ ఎన్నికలు–2025:*  ఎన్నికల ప్రవర్తనా నియమావళి  అమలులో భాగంగా 21 కేసులు నమోదు చేసి 21 మంది నిందితుల నుంచి ₹2,07,643.50 విలువైన 318.76 లీటర్ల  ఐ ఎం ఎఫ్ ఎల్ మద్యం స్వాధీనం చేసుకోవడం జరిగింది.అదేవిధంగా 34 కేసులు నమోదు చేసి 34 మంది నిందితుల నుంచి ₹80,800/- విలువైన 199.5 లీటర్ల  ఐ డి మద్యం (గుడుంబా)ను స్వాధీనం చేసుకోవడం జరిగింది.

*సంచలనాత్మక కేసులు:*  కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిదిలో  5 సంవత్సరాల బాలిక హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేయడం ప్రజల ప్రశంసలు అందుకున్నట్లు తెలిపారు.ఆదేవిదంగా 25 చోరీ కేసుల్లో నిందితుడిని పట్టుకుని ₹25 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మరియు జగిత్యాల పట్టణంలో జరిగిన డకాయితీ కేసును ఛేదించి 8 మందిని అరెస్ట్, నిందితుడిపై పిడి ఆక్ట్  నమోదు చేశామని తెలిపారు.

*సైబర్ నేరాలు:* 2025లో 1,351 సైబర్ ఫిర్యాదులు వచ్చాయని, వాటిలో ₹1.72 కోట్ల నగదు బాధితులకు తిరిగి అందించామని తెలిపారు. మొత్తం 1,079 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు.

* సి ఈ ఐ ఆర్ ద్వారా మొబైల్ ఫోన్ల రికవరీ: 1,551 పోయిన మొబైల్ ఫోన్లు గుర్తించి, ₹3.10 కోట్ల విలువైన ఫోన్లు బాదితులకు  అందించామని తెలిపారు.

*లోక్ అదాలత్ & కోర్ట్ వెర్టికల్:* 100  కేసులలో  నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఐదు విడతల లోక్ అదాలత్‌ల ద్వారా 9,595 కేసులు పరిష్కరించామని తెలిపారు. 

*బందోబస్తు*:  అన్ని పండుగలు, జాతరల బందోబస్తు కార్యక్రమాలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించబడ్డాయి.గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా జగిత్యాల జిల్లాలో 11 మంది ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ నిర్వహణ విధుల్లో జిల్లా పోలీసుల పర్యవేక్షణలో చురుకుగా భాగస్వాముల్ని చేశారు. హైదరాబాద్ తరువాత ట్రాన్స్‌జెండర్లను భాగస్వాముల్ని చేసిన రెండవ జిల్లాగా జగిత్యాల నిలిచింది.

*సీపీఆర్ శిక్షణ – ఫస్ట్ రెస్పాండర్స్ & పోలీస్ సిబ్బందికి*: రోడ్ సేఫ్టీ లో భాగంగా, అత్యవసర పరిస్థితుల్లో బాధితులను వెంటనే రక్షించేందుకు జిల్లా పోలీసులు రోడ్డు పక్కన ఉన్న దుకాణదారులు, హోటల్ కార్మికులు, పంక్చర్ షాప్ కార్మికులు, పెట్రోల్ బంక్ సిబ్బంది వంటి ఫస్ట్ రెస్పాండర్స్‌తో పాటు పోలీస్ సిబ్బందికి సీపీఆర్, ప్రథమ చికిత్స శిక్షణ అందించి, ఫస్ట్ ఎయిడ్ కిట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు .

*సిసి కెమారాలు:* 2025 సంవత్సరంలో జిల్లా కమాండ్ & కంట్రోల్ సెంటర్‌కు ట్రాఫిక్ పోలీస్.,lప్రజల సహకారంతో ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 672 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి జియో–ట్యాగింగ్ చేశారు.కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా కోరుట్ల పట్టణంలో 123, మెట్పల్లి పట్టణంలో 76 కొత్త సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

*గ్రీవెన్స్ డే :* ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడానికి గ్రీవెన్స్ డే,శ్రీకారం చుట్టి ప్రజల వద్ద నుండి 720 ఫిర్యాదులు స్వీకరించి చట్ట ప్రకారం న్యాయం చేయడం జరిగింది.

*కమ్యూనిటీ పోలీసింగ్:*  పోలీస్ కళ బృందo  ద్వారా 28,500 మందికి అవగాహన కల్పించడం జరిగింది. 

*“మై ఆటో ఇస్ సేఫ్”:* పగలు, రాత్రి ప్రయాణాలు మరింత సురక్షితంగా ఉండేలా, ముఖ్యంగా మహిళలు, పిల్లలకు భద్రత కల్పించే లక్ష్యంతో జిల్లా పోలీసులు కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లోని 2,093 ఆటోల వివరాలు నమోదు చేసి ప్రతి ఆటోకు యూనిక్ నంబర్‌తో కూడిన క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు.

*యాంటీ–ర్యాగింగ్  కార్యక్రమం:* విద్యాసంస్థల్లో సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కళాశాలల విద్యార్థులకు యాంటీ– ర్యాగింగ్ చట్టాలు, విధానాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ర్యాగింగ్ నివారణపై విద్యార్థులను చైతన్యపరచడం జరిగింది. 
జిల్లా పోలీస్ శాఖ ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 600  మంది పోలీసులు, యువకులు పాల్గొని రక్తదానం చేశారు.

2026 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి కలగాలని ఆశిస్తూ, స్నేహపూర్వక పోలీసు విధానాన్ని అవలంబిస్తూ, జిల్లా పోలీస్ శాఖ బాధ్యతాయుతంగా, జవాబుదారితనంతో, పారదర్శకంగా సేవలందిస్తూ ప్రజల రక్షణ కోసం అనుక్షణం పనిచేస్తామని తెలుపుతూ జిల్లా  ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మీడియా సమావేశంలో  అదనపు  ఎస్పి శ్రీ  శేషాద్రిని రెడ్డి , డిఎస్పి లు వెంకటరమణ, వెంకటరమణ,  రఘు చందర్, రాములు ఇన్స్పెక్టర్ లు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సమర్థ పనితీరు – నేరాలు 5.05 శాతం తగ్గింపు* జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సమర్థ పనితీరు – నేరాలు 5.05 శాతం తగ్గింపు* జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ *జగిత్యాల డిసెంబర్ 23 (ప్రజా మంటలు)పండుగలు, ఎన్నికలు, జాతరలు ప్రశాంతంగా – అవాంఛనీయ  సంఘటన లేకుండా ముగిసిన ఏడాది* *మహిళలు, చిన్నారుల భద్రతే ప్రథమ లక్ష్యం,–  డ్రగ్స్‌ పై జీరో టాలరెన్స్ విధానం అమలు* *‘సురక్షిత ప్రయాణం’తో రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు చర్యలు జిల్లాలో గత సంవత్సర కాలంలో జిల్లా పోలీస్ శాఖ...
Read More...
Local News  State News 

యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి ఎమ్మెల్యేనే కారణం కాదా..? – మాజీ మంత్రి జీవన్ రెడ్డి సూటి ప్రశ్న

యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి ఎమ్మెల్యేనే కారణం కాదా..? – మాజీ మంత్రి  జీవన్ రెడ్డి సూటి ప్రశ్న జగిత్యాల, డిసెంబర్ 23 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని యావర్ రోడ్డు 100 ఫీట్ల విస్తరణ జాప్యానికి స్థానిక ఎమ్మెల్యేనే ప్రధాన కారణమని మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాల ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మున్సిపల్ తీర్మానాన్ని తుంగలో...
Read More...

పోలీస్ విధులు సమర్థంగా నిర్వహించాలంటే శారీరకృఢత్వం మానసిక ఆరోగ్య ము అత్యంత అవసరం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పోలీస్ విధులు సమర్థంగా నిర్వహించాలంటే శారీరకృఢత్వం మానసిక ఆరోగ్య ము అత్యంత అవసరం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్    జగిత్యాల డిసెంబర్ 23 (ప్రజా మంటలు) పోలీస్ విధులు సమర్థంగా నిర్వహించాలంటే శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం అత్యంత అవసరమని జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   అన్నారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆధునిక వ్యాయామశాల (జిమ్)ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ….  పోలీస్ సిబ్బంది రోజువారీ...
Read More...
Local News 

పుష్కర ఘాట్లను పర్యవేక్షించిన దేవాదాయ శాఖ

పుష్కర ఘాట్లను పర్యవేక్షించిన దేవాదాయ శాఖ ఇబ్రహీంపట్నం డిసెంబర్ 23( ప్రజా మంటలు దగ్గుల అశోక్) ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని పుష్కర ఘాట్ల అభివృద్ధి కొరకు కావలసిన పనులను పర్యవేక్షించిన  గౌరవ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, జగిత్యాల మరియు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ హైదరాబాద్ వారి కార్యాలయ అధికారులు  మరియు ఇబ్రహీంపట్నం తాసిల్దార్, ఎంపీడీవో  ఇతర మండల అధికారులు....
Read More...

మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్‌పై ACB సోదాలు

మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్‌పై ACB సోదాలు మహబూబ్‌నగర్, డిసెంబర్ 23 (ప్రజా మంటలు): మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (Dy Commissioner) రవాణా శాఖాధికారి కిషన్ నాయక్ పై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీ ఎత్తున సోదాలు నిర్వహించారు. అధికార ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసి ఈ దాడులు చేపట్టినట్లు...
Read More...
Local News  State News 

కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టేవరకు స్వామి మాల విరమణ చేయను : డా. సాయికుమార్

కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టేవరకు స్వామి మాల విరమణ చేయను : డా. సాయికుమార్ కోరుట్ల, డిసెంబర్ 23 (ప్రజా మంటలు): కోరుట్ల నియోజకవర్గ రాజకీయాల్లో డాక్టర్ సాయికుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ సాయికుమార్ నేడు కొత్తపేట శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో జువ్వాడి నర్సింగరావు గారు “డాక్టర్ సాయికుమార్...
Read More...
National  Crime  State News 

ఏపీలో పలు జిల్లాల్లో ఏసీబీ మెరుపు సోదాలు – సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు

ఏపీలో పలు జిల్లాల్లో ఏసీబీ మెరుపు సోదాలు – సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు అమరావతి డిసెంబర్ 23(ప్రజా మంటలు): ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్‌, సత్యసాయి జిల్లాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టి పలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను, ఉద్యోగుల నివాసాలను తనిఖీ చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం సబ్‌రిజిస్ట్రార్ రామకృష్ణతో పాటు ఆయన సహ ఉద్యోగులు, మరో ప్రైవేట్...
Read More...
National  State News 

కోచిలో రోడ్డుపై ప్రాణాలు నిలిపిన డాక్టర్‌ ధైర్యం – సినిమా సన్నివేశాన్ని తలపించిన నిజజీవిత రక్షణ

కోచిలో రోడ్డుపై ప్రాణాలు నిలిపిన డాక్టర్‌ ధైర్యం – సినిమా సన్నివేశాన్ని తలపించిన నిజజీవిత రక్షణ కోచి, కేరళ డిసెంబర్ 23 (ప్రత్యేక కథనం): కోచిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం అనంతరం ప్రాణాపాయ స్థితిలో రోడ్డుపై పడి ఉన్న వ్యక్తికి ఓ డాక్టర్ చేసిన అత్యవసర చికిత్స అక్షరాలా ప్రాణాలను నిలిపింది. శ్వాస తీసుకోలేక తంటాలు పడుతూ, మరణం అంచున ఉన్న ఆ వ్యక్తికి డాక్టర్ రోడ్డుపైనే తక్షణ శస్త్రచికిత్స చేసి...
Read More...

న్యూ ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ ముందు ఉద్రిక్తత – భారీగా మోహరించిన భద్రతా బలగాలు

న్యూ ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ ముందు ఉద్రిక్తత – భారీగా మోహరించిన భద్రతా బలగాలు న్యూ ఢిల్లీ డిసెంబర్ 24 (ప్రజా మంటలు): దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం ముందు మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, మానవ హక్కుల అంశాలపై నిరసన వ్యక్తం చేస్తూ పలు సంఘాలు హైకమిషన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగాయి. నిరసనకారులు పెద్ద ఎత్తున...
Read More...

జాగృతి జనంబాట పర్యటనలో మానవత్వం చాటిన కవిత

జాగృతి జనంబాట పర్యటనలో మానవత్వం చాటిన కవిత హైదరాబాద్ డిసెంబర్ 23 (ప్రజా మంటలు): యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా జాగృతి జనంబాట కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో, నారపల్లి వద్ద కవిత గారికి అభివాదం చేసేందుకు ప్రయత్నించిన తండ్రీకుమార్తె బైక్ అదుపుతప్పి కింద పడిపోయారు. ఈ ఘటనను గమనించిన కవిత గారు వెంటనే తన వాహనాన్ని ఆపి, వారిని తన కాన్వాయ్‌లోని వాహనంలో...
Read More...
Today's Cartoon 

Today's cartoon

Today's cartoon
Read More...

బీర్పూర్ మండలం తుంగూరు గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం

బీర్పూర్ మండలం తుంగూరు గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం బీర్పూర్ డిసెంబర్ 22 (ప్రజా మంటలు)ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో  గెలుపొందిన నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండలం తుంగూరు గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరిగింది. సోమవారం  విజయం సాధించిన గ్రామపంచాయతీ సర్పంచ్లు ఉప సర్పంచ్ లు...
Read More...