గద్వాల జిల్లా ప్రజల సమస్యలపై కవిత ఘాటు ప్రశ్నలు
జాగృతి జనం బాట
జోగులాంబ గద్వాల జిల్లా డిసెంబర్ 21(ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు గద్వాల జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. బీచుపల్లి బ్రిడ్జి వద్ద జాగృతి నాయకులు, నడిగడ్డ హక్కుల పోరాట సమితి నేతలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అలంపూర్‌లోని వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన కవిత గారు, అక్కడి మౌలిక వసతుల లేమిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రి నాసిరకంగా నిర్మించబడటంతో మూడేళ్లపాటు ఉపయోగంలోకి రాలేదని, ఇప్పటికీ సిబ్బంది, పరికరాలు, పరీక్షా సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. చిన్న పరీక్షలకే గద్వాల్‌కు పంపాల్సిన పరిస్థితి ఉందని, ఆలంపూర్‌లోనే అన్ని పరీక్షలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌ను పరిశీలించిన ఆమె, ఆర్డీఎస్కు కేటాయించిన నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్న పరిస్థితిని ప్రశ్నించారు. మూడు మోటార్లు ఉండగా ఒక్కటే నడుస్తోందని, కాల్వల విస్తరణ, భూసేకరణ సమస్యల వల్ల చివరి ఆయకట్టు వరకు నీళ్లు చేరడం లేదని తెలిపారు. ఈ సమస్యలపై ప్రభుత్వం ఆరు నెలల్లో పరిష్కారం చూపకపోతే పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు.
పెద్ద ధన్వాడ వద్ద ప్రతిపాదిత ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో సమావేశమై, వారి పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పచ్చని పంట పొలాలు, ఆర్డీఎస్ కాల్వల సమీపంలో ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వడం ప్రమాదకరమని, ఈ ప్రాజెక్ట్ పూర్తిగా రద్దయ్యే వరకు రైతులతో కలిసి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
గద్వాల పట్టణంలో స్థానికులతో మమేకమై పట్టణ సమస్యలు తెలుసుకున్న కవిత గారు, గద్వాల జిల్లాలో అక్షరాస్యత, వైద్య, విద్య రంగాలు వెనుకబడి ఉండటం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. కర్నూల్ వెళ్లాల్సిన వైద్య పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
అయిజలోని సీడ్ కాటన్ జిన్నింగ్ మిల్లును పరిశీలించిన ఆమె, విత్తన పత్తి రైతుల దోపిడీపై తీవ్ర విమర్శలు చేశారు. కంపెనీలు రైతులతో నేరుగా ఒప్పందాలు చేయకుండా తక్కువ ధరలు చెల్లిస్తున్నాయని, రైతులకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. విత్తన కంపెనీలతో రైతులకు తప్పనిసరిగా ఒప్పందం ఉండేలా ప్రభుత్వ పాలసీ తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని పరిష్కారం కోసం పోరాటమే జాగృతి లక్ష్యమని, ఎన్నికల సమయంలోనే కాదు ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే రాజకీయాలను నమ్ముతానని కవిత గారు స్పష్టం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కల్వకుంట్ల కవిత అరెస్ట్ : నర్సింగిలో అక్రమ కట్టడాలకు వ్యతిరేక ఆందోళన
హైదరాబాద్ మార్చ్ 03 (ప్రజా మంటలు):నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ధర్నాకు దిగారు.
హైడ్రా బుల్డోజర్లు అక్కడికి వచ్చే వరకు ఆందోళన విరమించబోమని కవిత బైఠాయించారు.... నర్సింగిలో మూసీ ఆక్రమణపై కవిత ఆందోళన – అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై చర్యలు డిమాండ్
హైదరాబాద్, మార్చ్ 03 (ప్రజా మంటలు):
హైదరాబాద్ పరిధిలోని నర్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఆమె ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో పేదల... ధరూర్ క్యాంపు వాకర్స్ అసోసియేషన్ హోలీ సంబరాల్లో పాల్గొన్న తొలి జెడ్పి చైర్ పర్సన్ వసంత
జగిత్యాల మార్చి 3(ప్రజా మంటలు) పట్టణ ధరూర్ క్యాంప్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐల్నేని వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ సంబరాల కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ .
శాంతికి, సౌభ్రాతృత్వానికి ప్రతీక హోలీ అని,అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసే వేడుక,ఈ రంగుల పండుగ... జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు
జగిత్యాల మార్చి 3 (ప్రజా మంటలు)జిల్లా ప్రజలకు ,పోలీసు అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జిల్లా పోలీస్ కార్యాలయంలో హోళీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తో ఉత్సహంగా, సంతోషంగా హోళీ వేడుకలు నిర్వహించడం జరిగింది.
హోళీ సందర్భంగా... దుబాయ్ నుంచి తొలి ప్రత్యేక విమానం – 149 మంది ఢిల్లీకి చేరిక
న్యూ ఢిల్లీ మార్చి 03 (ప్రజా మంటలు):
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో Air India దుబాయ్ నుంచి ఢిల్లీకి తొలి ప్రత్యేక విమానాన్ని నడిపింది. ఇందులో షేటిల్ బాడ్మెంటను క్రీడాకారిణి పీవీ సింధు తో పాటు ప్రముఖులు ఉన్నారు.
AI916D ఫ్లైట్ ద్వారా 149 మంది భారతీయులు సురక్షితంగా ఢిల్లీ Indira Gandhi International... జగిత్యాలలో యువతి ఆత్మహత్య
జగిత్యాల, మార్చ్ 03 (ప్రజా మంటలు):
స్థానిక పోచమ్మవాడకు చెందిన ములస్థం ప్రణవి (25) ఆత్మహత్యకు పాల్పడింది. ప్రణవి బీటెక్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటూ, విదేశాలకు వెళ్లాలని ఆసక్తి వ్యక్తం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఇటీవల పెళ్లి సంబంధాలు వస్తున్న నేపథ్యంలో తండ్రి పెళ్లి గురించి మాట్లాడినట్లు సమాచారం. పెళ్లి... డీడీఎన్ జగిత్యాల జిల్లా సమావేశం పాల్గొన్న రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉపేందర్ శర్మ
జగిత్యాల మార్చి 2 (ప్రజా మంటలు)దూప, దీప నైవేద్య జగిత్యాల జిల్లా సర్వ సభ్య సమావేశం స్థానిక ఎస్ వి ఎల్ ఆర్ గార్డెన్ లో జరిగింది. ఈ సమావేశం లో పాల్గొన్న డీడీఎన్ గౌరవ అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ మాట్లాడుతూ డీడిఎన్ అర్చకుల సమస్యలు పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తానని... ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ కు మెడి విజన్ ఐ కేర్ సెంటర్ హైదరాబాద్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం
జగిత్యాల మార్చి 2 (ప్రజా మంటలు)ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ భవనంలో సోమవారం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ,జగిత్యాల అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో మెడి విజన్ ఐ కేర్ సెంటర్ హైదరాబాద్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. దాదాపు 15 మందికి... దుద్దిళ్ల శ్రీపాద రావు 89వ జయంతి: స్పీకర్ వ్యవస్థకు వన్నె తెచ్చిన విలువల శిఖరం – యూటీ ఖాదర్ ఫరీద్
హైదరాబాద్, మార్చ్ 03 (ప్రజా మంటలు):
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి సందర్భంగా హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పాకళా వేదికలో ఘన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ U. T. ఖాదర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ... ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి. జగిత్యాల ఆర్డీవో మధుసూదన్
జగిత్యాల, మార్చి 2(. ప్రజా మంటలు)
వాల్మీకి ఆవాసం సేవా భారతి ద్వారా అందిస్తున్న ఉచిత శిక్షణ ను ఉపయోగించుకుని ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకోవాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ గౌడ్ అన్నారు. వాల్మీకి ఆవాసం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం, కంప్యూటర్ శిక్షణ కేంద్రం లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి... పోలీస్ ప్రధాన కార్యాలయంలో స్వర్గీయ శ్రీపాదరావు జయంతి వేడుకలు
జగిత్యాల మార్చి 2 ( ప్రజా మంటలు)ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీ దుద్దిల్ల శ్రీపాద రావు జయంతిని జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాద రావు చిత్రపటానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మరియు పోలీస్ అదికారులు పూలమాలవేసి నివాళులర్పించారు.
నైతిక విలువలు, ప్రజల పట్ల... పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణగా రిజర్చావేషన్లు :అసెంబ్లీలో తీర్మానం చేయాలి: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ మార్చ్ 02 (ప్రజా మంటలు):
హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీల జనాభా 15 శాతం నుంచి 18 శాతానికి పెరిగినట్టు గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల గణనలో వెల్లడైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు.
సోమవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి... 