ధర్మపురి సార్థక నామం_ ధర్మము తెలియడం కాదు ఆచరించడమే ధర్మము ప్రవచనకారుడు చాగంటి
ధర్మపురి అక్టోబర్ 11(ప్రజా మంటలు):
ధర్మము అంటే తెలియడం కాదు మనము ఆచారించాల్సింది ఆచరించడమే ధర్మము అని ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు అన్నారు . ధర్మపురి శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి మహా స్వామి శ్రీ మఠం వారి స్థలం బ్రాహ్మణ సంఘం ప్రక్కన రెండు రోజుల పాటు ఆధ్యాత్మిక ప్రవచనం శనివారం తొలి రోజు ప్రారంభం కాగా, ఆలయ అర్చకులు వేద మంత్రాలతో పూర్ణ కుంభముతో స్వాగతం పలికారు.
ధర్మం అంటే తెలియడం కాదు తెలిసిన దానిని ఆచరించడమే ధర్మము అంటామన్నారు. 84లక్షల జీవరాశులలో మానవుడు ఆచరించాల్సింది ధర్మమన్నారు. గోదావరి నది యొక్క విశిష్టత ,క్షేత్ర మహిమ చాలా గొప్పదని అన్నారు. క్షేత్రము పేరే ధర్మపురి. ధర్మము పట్టు కన్నవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. ఈ సందర్భంగా మహా భారతంలోని ధర్మ విషయాలు ఉటంకించారు.
భగవంతుడు మనకు ఇచ్చిన వాక్కును సమాజంనకు ఉపయోగ పడేలా ఆచరించాలి తప్ప అహంకారంతో వ్యవహరించకుండా ఉండాలన్నారు. నరసింహ శతక కర్త భగవంతుని గూర్చి మాత్రమే రాశాడని తన వ్యక్తిగత నేపద్యం గూర్చి రాసుకోలేదని అన్నారు. శేషప్ప గొప్పతనం వర్ణించారు. నరసింహ శతకంలోని పద్యాలు చదివి అలరించారు. నరసింహ అవతారం గూర్చి వివరిస్తూ విష్ణు సహస్ర నామాలలోని అర్ధంను ఉటంకించారు.
ప్రహ్లాధుని హిరణ్యకశిపుడి సంవాదము గూర్చి కళ్ళకు కట్టినట్లు ప్రవచనము కొనసాగింది. ప్రదోష సమయములో కూడా నరసింహ క్షేత్రం దర్శించుకునే అవకాశం ఉందన్నారు. నరసింహ నామ స్మరణ తోనే మన కష్టాలు తొలుగుతాయన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వేద పరిరక్షణలో ప్రభుత్వ సహకారం ఉంటుంది – మంత్రి శ్రీధర్ బాబు

అమెరికాలోని హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) వివాదం — పాలక మండలి, ప్రభుత్వ అనుబంధాలపై ప్రశ్నలు
1.jpeg)
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి - జి. చిన్నారెడ్డి

ధర్మపురి సార్థక నామం_ ధర్మము తెలియడం కాదు ఆచరించడమే ధర్మము ప్రవచనకారుడు చాగంటి

టీ-స్క్వేర్ నగరంలోనే ఒక ఐకానిక్ భవనం- సీఎం రేవంత్ రెడ్డి లా ఉండాలని

వృద్దుల్లో మనోనిబ్బరం నింపేందుకు అవగాహన సదస్సు

బన్సీలాల్‌పేట కురుమ స్మశాన వాటిక పరిరక్షణకు లీగల్ గా పోరాటం

సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం... బీద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భరోసా సీఎం సహాయ నిధి....ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

ఉమ్మడి జిల్లా వాలీబాల్ పోటీల జట్టుకు ఎంపికైన చలిగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి గమ్య

డిజిటల్ యుగంలో బాలికలపై శోషణ పెరిగింది - సీజేఐ బి ఆర్ గవాయి

సేంద్రీయ ఎరువులకు కూడా సబ్సిడీ ఇవ్వాలి - మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ఆఫ్ఘన్ మంత్రి పాత్రికేయుల సమావేశంతో మాకు సంబంధంలేదు - భారత విదేశాంగ శాఖ
