కాసేపు హాయిగా నవ్వుకోండి..చాలా సీరియస్ అంశం?
నేటి సామాజిక ఆలోచనలపై వ్యంగ్య రచన
(జర్నలిస్ట్ నాగ్ రాజ్ FB నుండి)
ఇందాక ఆకలేసి,
దారిలో పంచెకట్టు దోశ సెంటర్ కనిపిస్తే వెళ్లా.
మెనూ చెక్ చేసి,"ఓ ఘీంకారం దోశ.. టోకెన్ ఇవ్వు" అనడిగా.
(అంటే ఏనుగు అరుపు కాదు) -ed
"అది ఘీంకారం కాదు, ఘీ కారం" అన్నాడాయన కోపంగా.
"ఓహ్, ఒకటివ్వు" అన్నాను.
టోకెన్ తీసుకెళ్లి దోశ మాస్టర్ కిచ్చా.
పెనం మీద దోశ పిండిని రాశిగా పోశాడు.
గిన్నెతో పిండిని గుండ్రంగా చేశాడు.
తర్వాత నెయ్యి పోశాడు.
ఆపై దోశ మీద కారం గుజ్జు వేసి చదును చేశాడు.
తర్వాత ఏదో పొడి చల్లాడు.
ఆపై మళ్లీ నెయ్యి పోశాడు.
కాసేపు వేగనిచ్చాడు.
ఆ దోశ రంగు, రూపు చక్కగా ఉంది!!
బహుశా, ఇలాంటి దోశల ఫొటో తీసే, కొంత ప్యాచప్ చేసి,
కొత్త గెలాక్సీలను కనుగొన్నానని చెబుతాడేమో NASA వాడు!!
గెలాక్సీ ఘీంకారం దోశను తీసి
బల్లపరుపుగా ఉన్న ఓ చెక్క ప్లేట్లో వేసి,
ఓ చిన్న ప్లాస్టిక్ కప్పులో పల్లీ చట్నీ వేసిచ్చాడు, సర్వర్.
మరీ చిన్నగా ఉన్న ఆ ప్లాస్టిక్ కప్పును చూస్తే,
మన గెలాక్సీలో ప్లానెట్ హోదా కోల్పోయిన ప్లూటోలాగా అనిపించింది. పోనీయండి!!
దోశ తిందామని రెడీ అవుతుండగా
ఏదో ర్యాండమ్ కాల్ వచ్చింది. ఆన్సర్ చేశా!
"నేను నెహ్రూ మాట్లాడుతున్నా.." అని వినిపించింది.
"సార్ నేను బిజీగా ఉన్నా.
ఓ పావుగంట తర్వాత చేస్తారా.." అనడిగాను.
"5 నిమిషాల్లో ఓ కచేరీ ఉంది గానీ, వన్ మినిట్లో ట్రెండింగ్ న్యూస్ ఏంటో చెప్పు" అన్నారాయన.
అసలే పెద్దాయన, కాల్ కట్ చేస్తే ఫీల్ అవుతారు. చేసేదేం లేక,
"రూపాయ్ వాల్యూ ఘోరంగా పడిపోయింది.
ఇండియాకు, అమెరికాకు మరింత చెడింది.
ఇండిగో వాడు ఫ్లైట్స్, ప్యాసింజర్స్ తో ఫుట్ బాల్ ఆడుకున్నాడు.
మీ పార్టీ మేస్త్రీ, మెస్సీతో ఫుట్ బాల్ ఆడనున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో దిష్టి, భూతశుద్ది నడుస్తోంది.
బాలు స్టాచ్యూపై మళ్లీ మనోభావాలు దెబ్బతిన్నాయి.
మొత్తం వీటన్నింటికీ కారణం..
నెహ్రూనే అనుకుంటున్నారు,
బై, ఉంటా సార్," అని కాల్ కట్ చేయబోయా నేను.
"ఇంతకీ అఖండ 2 ఎందుకు వాయిదా పడింది" అనడిగారు ఆయన.
ఈయనేంటి ఇలా తగులుకున్నారు అనిపించింది.
"అఖండ 2 వాయిదాకు కారణం అప్పట్లో నెహ్రూ అనుసరించిన ఆర్థిక విధానాలే..అంటూ ట్వీట్ చేసి, ఆ సినిమా నిర్మాతలు కనిపించకుండా పోయారు. బాలయ్య త్రిశూలం పట్టుకుని బహుశా మీ దగ్గరకే రావచ్చు..’’ అని చెప్పా; ఇలాగైనా కాల్ కట్ చేస్తారేమోనని!
ఐనా, ఆయన కాల్ కట్ చేయలేదు.
"నీకో నిజం చెప్పనా" అన్నారాయన.
ఆకలితో ఓపిక నశించి
"చెప్పండి సార్" అన్నాను నీరసంగా.
"నీకు ఘీంకారం టోకెన్ ఇచ్చిన వాడు,
పెనం మీద పిండి వేసిన మాస్టర్,
దోశను అందజేసిన సర్వర్..
వీరు ముగ్గురూ ఎవరనుకుంటున్నావ్?
మారువేశంలో ఉన్న 14 Reels ఓనర్స్,
అప్పుల్లో ఉన్న అఖండ 2 నిర్మాతలే.." అని చెప్పి
కాల్ కట్ చేశారు ఆయన.
దోశ తినకుండానే
దబేల్మని పడిపోయా, నేను!!
ఇలాంటి అతి క్లిష్ట పరిస్థితుల్లో,
మీరు ముందుగా,
108కి కాల్ చేస్తారా? లేక,
బాలయ్యకు కాల్ చేస్తారా?
సరైన సమాధానం తెలిసీ చెప్పకపోయారో...
మీకు "ట్రంప్ దిష్టి" తగులుతుంది, ఖబడ్దార్!! 🤧😜
More News...
<%- node_title %>
<%- node_title %>
ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి. జగిత్యాల ఆర్డీవో మధుసూదన్
జగిత్యాల, మార్చి 2(. ప్రజా మంటలు)
వాల్మీకి ఆవాసం సేవా భారతి ద్వారా అందిస్తున్న ఉచిత శిక్షణ ను ఉపయోగించుకుని ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకోవాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ గౌడ్ అన్నారు. వాల్మీకి ఆవాసం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం, కంప్యూటర్ శిక్షణ కేంద్రం లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి... పోలీస్ ప్రధాన కార్యాలయంలో స్వర్గీయ శ్రీపాదరావు జయంతి వేడుకలు
జగిత్యాల మార్చి 2 ( ప్రజా మంటలు)ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీ దుద్దిల్ల శ్రీపాద రావు జయంతిని జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాద రావు చిత్రపటానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మరియు పోలీస్ అదికారులు పూలమాలవేసి నివాళులర్పించారు.
నైతిక విలువలు, ప్రజల పట్ల... పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణగా రిజర్చావేషన్లు :అసెంబ్లీలో తీర్మానం చేయాలి: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ మార్చ్ 02 (ప్రజా మంటలు):
హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీల జనాభా 15 శాతం నుంచి 18 శాతానికి పెరిగినట్టు గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల గణనలో వెల్లడైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు.
సోమవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి... ఘనంగా దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు
కరీంనగర్, మార్చి 02 (ప్రజా మంటలు):
మాజీ శాసనసభ స్పీకర్, అజాతశత్రువు దుద్దిళ్ల శ్రీపాదరావు గారి 89వ జయంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు.ముందుగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు... మస్కట్ ద్వారా రోడ్డు మార్గంలో భారత్‌కు వచ్చే అవకాశం – కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్ / న్యూఢిల్లీ మార్చ్ 02 (ప్రజా మంటలు):
అమెరికా–ఇజ్రాయిల్–ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో నివసిస్తూ ఆందోళనకు గురవుతున్న ప్రవాస భారతీయులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఇకపై భయపడాల్సిన అవసరం లేదని, స్వదేశానికి తిరిగి రావడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం... తెలంగాణ విద్యా కమిషన్‌పై వివాదం: అర్హతలే ప్రశ్నార్థకమా?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంస్కరణల పేరుతో ప్రయోగాలా?
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ సమర్పించిన “తెలంగాణ విద్యా విధానం–2026” నివేదిక రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ కమిటీకి పరిపాలనా అనుభవం ఉన్నవారు ఉన్నప్పటికీ, స్కూల్ లేదా యూనివర్సిటీ స్థాయిలో బోధన అనుభవం ఉన్న అసలైన విద్యావేత్తలు లేరనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రేవంత్ రెడ్డి... కుమ్మెర గ్రామం చిన్నారి మృతికి రజక సంఘం నిరసన కొవ్వొత్తులతో నివాళి
జగిత్యాల మార్చి 1(ప్రజా మంటలు)కుమ్మెర గ్రామంలో చిన్నారి మృతికి రజక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని చింతకుంట వద్ద గల ఐలమ్మ విగ్రహం ముందునిరసన వ్యక్తం చేసి కొవ్వొత్తులతో నివాళులర్పించారు
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కుమ్మెర గ్రామంలో జాతరలో జరిగిన సంఘటనను నిరసన వ్యక్తం చేస్తూ కార్యక్రమం చేసినట్లు తెలిపారు ఇలాంటి... అర్హత లేమి, పారదర్శకత లోపం, విద్యా భవిష్యత్తుపై ముప్పు
కరీంనగర్ మార్చ్ 01 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక రాష్ట్ర విద్యావ్యవస్థ భవిష్యత్తుపై తీవ్రమైన సందేహాలు రేకెత్తిస్తోందని, TRSMA రాష్ట్ర గౌరవాధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు విమర్శించారు.
కేవలం రాజకీయ విమర్శలుగా కాకుండా, విద్యా విధాన రూపకల్పనలోని మౌలిక లోపాలను ఎత్తిచూపుతున్న గంభీర హెచ్చరికగా
ఆయన... ఘనంగా ముగిసిన శ్రీ అష్టలక్ష్మి దేవాలయం బ్రహ్మోత్సవ వేడుకలు
జగిత్యాల మార్చి 1( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డు సమీపంలోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయం లో అంగరంగ వైభవంగా జరుగుతున్న 11వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా, 6 వ రోజు, చివరి రోజు అయిన ఆదివారం ఉదయం సుప్రభాతం, సేవ కాలం,పంచహారతి, అష్టోత్తర శత కలశాభిషేకం, మహా పూర్ణాహుతి, విమానోపరి కుంభాభిషేకం, చక్ర... మహిళా పోలీస్ సిబ్బందికి ఫ్రీ హెల్త్ క్యాంప్, క్యాన్సర్ వ్యాక్సినేషన్ పై అవగాహన సదస్సు
జగిత్యాల మార్చ్ 1(ప్రజా మంటలు)మహిళలలో వచ్చే రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్‌ను ముందస్తుగా ఏవిదంగా గుర్తించడం మరియు ఈ యొక్క క్యాన్సర్ లు రావడానికి గల కారణాలు, ఈ యొక్క క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తుగా తీసుకోవలసిన హెచ్ పి వి వ్యాక్సినేషన్ గురించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల వారి సహకారంతో స్థానిక ఐ... జగిత్యాల వీరశైవ సమాజం నూతన కార్యవర్గ ఎన్నిక
జగిత్యాల మార్చి 1( ప్రజా మంటలు)జగిత్యాల నూతన వీర శైవ సమాజం అధ్యక్షుడుగా కంది కైలాసం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా హద్దునూరి నాగేంద్రం ఎన్నికయ్యారు.
గౌరవ అధ్యక్షులుగా ములస్తం శివకుమార్ ఉపాధ్యక్షులుగా సూరం వీరయ్య గుంటిమట్టం నిరంజన్ కోశాధికారిగా సిద్ధాంతి శ్రీనివాస్ మరియు సంయుక్త కార్యదర్శిగా వూడే అవంతిక అంగడి మఠంవీర... ఘనంగా ముందస్తు మహిళ దినోత్సవ వేడుకలు
జగిత్యాల మార్చ్ 1( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం లోని ఉమా శంకర్ గార్డెన్స్ లో పద్మశాలి కిట్టి పార్టీ వేడుకలలో భాగంగా ఆదివారం ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు మహిళలు ఘనంగా జరుపుకున్నారు. జ్యోతి ప్రజలన గావించి, కార్యక్రమాలు ప్రారంభించారు.
మహిళలు ఆటపాటలతో అల రించారు. రోజంతా సందడి నెలకొందని సామాజిక కార్యకర్త తవుటు... 