గాంధీలో చికిత్స పొందుతూ సాయి ఈశ్వర్ చారి మృతి

గాంధీ ఆసుపత్రి వద్ద ఆందోళనలు, అరెస్టులు -నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపు

On
గాంధీలో చికిత్స పొందుతూ సాయి ఈశ్వర్ చారి మృతి

బీసీ సంఘాల ఆందోళనతో గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత *ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు – పలు పోలీస్ స్టేషన్లకు తరలించిన నిరసనకారులు

రిజర్వేషన్ల అంశంపైనే ఆత్మహత్యాయత్నమని బీసీ నాయకుల ఆరోపణ

సికింద్రాబాద్,  డిసెంబర్  06(ప్రజా మంటలు): 

హైదరాబాద్ సిటీ శివారులోని మేడిపల్లి వద్ద గురువారం సాయంత్రం పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన సాయి ఈశ్వర్ చారి (30) గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 12.26 గంటలకు మరణించాడు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం, పోచారం గ్రామానికి చెందిన ఈశ్వర్ చారి, జీవనోపాధి కోసం జగద్గిరిగుట్టలో నివాసముంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.IMG-20251206-WA0000

మృతుడికి భార్య కవిత, తల్లి ప్రమీలతో పాటు ముగ్గురు చిన్న పిల్లలు—కృత్తిక (3), కృష్ణదత్త (2), చిట్టి (1) ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కు మృతితో కుటుంబం కన్నీరుమున్నీరైంది. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని జగద్గిరిగుట్టకు తరలించగా, శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.

రిజర్వేషన్ల అంశంపైనే ఆత్మహత్యాయత్నమని బీసీ నాయకుల ఆరోపణ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌ నేపథ్యంలోనే ఈశ్వర్ చారి ఆత్మహత్యకు పాల్పడ్డాడని బీసీ సంఘాల నాయకులు ఆక్షేపించారు. ఈ ఘటనతో గాంధీ ఆసుపత్రి వద్ద వాతావరణం ఉద్రిక్తమైందని పేర్కొన్నారు.

గాంధీ ఆసుపత్రి వద్ద ఆందోళనలు, అరెస్టులు

మధ్యాహ్నం నుంచి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు ప్రారంభమయ్యాయి. జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ ఐఏఎస్ చిరంజీవులు, చెరుకు సుధాకర్, మణిమంజరి, జూలూరి గౌరిశంకర్, పూర్ణచందర్ తదితరులు గాంధీ మెయిన్ బిల్డింగ్ ఎదుట బైఠాయించి ప్రభుత్వంపై నినాదాలు చేశారు.

నాయకులు పోలీస్ అడ్డుగోడను దాటి ఆరవ ఫ్లోర్‌లోని బర్న్ వార్డు వద్దకు చేరుకుని సాయి కుటుంబ సభ్యులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తమవగా, ఈస్ట్‌జోన్ డీసీపీ బాలస్వామి, చిలకలగూడ ఇన్‌స్పెక్టర్ అనుదీప్ నేతృత్వంలో పోలీసులు భారీగా మోహరించి ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.

అరెస్టైన వారిని బొల్లారం, తిరుమలగిరి, అంబర్‌పేట్, ఉప్పల్ పోలీస్ స్టేషన్లకు ప్రత్యేక వాహనాల్లో తరలించారు.

నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపు

సాయి ఈశ్వర్ మృతిపై కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని, బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదించాలని బీసీ జేఏసీ డిమాండ్ చేసింది. కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించాలనూ కోరింది. రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.


---

“బలిదానాలు వద్దు… బరి గీసి పోరాడుదాం” – మాజీ ఐఏఎస్ చిరంజీవులు

బీసీలకు 42% రిజర్వేషన్లు అందిస్తామని చెప్పి తప్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఆత్మహత్యాయత్నం చేసిన సాయి ఈశ్వర్ చారి ఇంటికి మాజీ ఐఏఎస్ చిరంజీవులు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ—

“బీసీ యువత ఆత్మహత్యల బాట పట్టకూడదు.

తమిళనాడు తరహాలో రాజ్యాంగబద్ధంగా శాంతియుత ఉద్యమంతో హక్కులు సాధించాలి.

సాయి ఈశ్వర్ వంటి యువకులు ఇలాంటి మార్గం ఎంచుకోవడం అత్యంత బాధాకరం.

ప్రాణం విలువైనది… పోతే తిరిగి రాదు.

రాజకీయ హక్కులు పోరాటంతోనే వస్తాయి” అని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో బీసీఐఎఫ్ చైర్మన్ బాలగౌని బాలరాజు గౌడ్, బీసీ మేధావుల సమాఖ్య రాష్ట్ర కోఆర్డినేటర్ డా. అవ్వారు వేణు కుమార్, పిడికిలి రాజు, కేవీ గౌడ్, ఆంజనేయులు, బైరూ శేఖర్ గంగపుత్ర, వీరమల్ల రమేష్ గౌడ్, సిలివేరు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
----

Tags
Join WhatsApp

More News...

Local News 

ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి.  జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ 

ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి.    జగిత్యాల ఆర్డీవో మధుసూదన్     జగిత్యాల, మార్చి 2(. ప్రజా మంటలు) వాల్మీకి ఆవాసం సేవా భారతి ద్వారా అందిస్తున్న ఉచిత శిక్షణ ను ఉపయోగించుకుని ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకోవాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ గౌడ్ అన్నారు. వాల్మీకి ఆవాసం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం, కంప్యూటర్ శిక్షణ కేంద్రం  లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి...
Read More...
Local News 

పోలీస్ ప్రధాన కార్యాలయంలో స్వర్గీయ శ్రీపాదరావు జయంతి వేడుకలు

పోలీస్ ప్రధాన కార్యాలయంలో స్వర్గీయ శ్రీపాదరావు జయంతి వేడుకలు జగిత్యాల మార్చి 2 ( ప్రజా మంటలు)ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్  స్వర్గీయ శ్రీ దుద్దిల్ల  శ్రీపాద రావు  జయంతిని  జిల్లా పోలీస్ ప్రదాన  కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా శ్రీపాద రావు చిత్రపటానికి జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  మరియు పోలీస్ అదికారులు పూలమాలవేసి నివాళులర్పించారు. నైతిక విలువలు, ప్రజల పట్ల...
Read More...
State News 

పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణగా రిజర్చావేషన్లు :అసెంబ్లీలో తీర్మానం చేయాలి: కల్వకుంట్ల కవిత

పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణగా రిజర్చావేషన్లు :అసెంబ్లీలో తీర్మానం చేయాలి: కల్వకుంట్ల కవిత హైదరాబాద్ మార్చ్ 02 (ప్రజా మంటలు): హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీల జనాభా 15 శాతం నుంచి 18 శాతానికి పెరిగినట్టు గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల గణనలో వెల్లడైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. సోమవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి...
Read More...
Local News  State News 

ఘనంగా దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు

ఘనంగా దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు కరీంనగర్, మార్చి 02 (ప్రజా మంటలు): మాజీ శాసనసభ స్పీకర్, అజాతశత్రువు దుద్దిళ్ల శ్రీపాదరావు గారి 89వ జయంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు.ముందుగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు...
Read More...
National  International   State News 

మస్కట్ ద్వారా రోడ్డు మార్గంలో భారత్‌కు వచ్చే అవకాశం – కేంద్ర మంత్రి బండి సంజయ్

మస్కట్ ద్వారా రోడ్డు మార్గంలో భారత్‌కు వచ్చే అవకాశం – కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్ / న్యూఢిల్లీ  మార్చ్ 02 (ప్రజా మంటలు): అమెరికా–ఇజ్రాయిల్–ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో నివసిస్తూ ఆందోళనకు గురవుతున్న ప్రవాస భారతీయులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఇకపై భయపడాల్సిన అవసరం లేదని, స్వదేశానికి తిరిగి రావడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం...
Read More...
State News 

తెలంగాణ విద్యా కమిషన్‌పై వివాదం: అర్హతలే ప్రశ్నార్థకమా?

తెలంగాణ విద్యా కమిషన్‌పై వివాదం: అర్హతలే ప్రశ్నార్థకమా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంస్కరణల పేరుతో ప్రయోగాలా? తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ సమర్పించిన “తెలంగాణ విద్యా విధానం–2026” నివేదిక రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ కమిటీకి పరిపాలనా అనుభవం ఉన్నవారు ఉన్నప్పటికీ, స్కూల్ లేదా యూనివర్సిటీ స్థాయిలో బోధన అనుభవం ఉన్న అసలైన విద్యావేత్తలు లేరనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి...
Read More...
Local News 

కుమ్మెర గ్రామం చిన్నారి మృతికి రజక సంఘం నిరసన కొవ్వొత్తులతో నివాళి

కుమ్మెర గ్రామం చిన్నారి మృతికి రజక సంఘం నిరసన కొవ్వొత్తులతో నివాళి జగిత్యాల మార్చి 1(ప్రజా మంటలు)కుమ్మెర గ్రామంలో చిన్నారి మృతికి రజక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని చింతకుంట వద్ద గల ఐలమ్మ విగ్రహం ముందునిరసన వ్యక్తం చేసి కొవ్వొత్తులతో నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కుమ్మెర గ్రామంలో జాతరలో జరిగిన సంఘటనను నిరసన వ్యక్తం చేస్తూ కార్యక్రమం చేసినట్లు తెలిపారు ఇలాంటి...
Read More...
Local News  Social  State News 

అర్హత లేమి, పారదర్శకత లోపం, విద్యా భవిష్యత్తుపై ముప్పు

అర్హత లేమి, పారదర్శకత లోపం, విద్యా భవిష్యత్తుపై ముప్పు కరీంనగర్ మార్చ్ 01 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక రాష్ట్ర విద్యావ్యవస్థ భవిష్యత్తుపై తీవ్రమైన సందేహాలు రేకెత్తిస్తోందని, TRSMA రాష్ట్ర గౌరవాధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు విమర్శించారు.   కేవలం రాజకీయ విమర్శలుగా కాకుండా, విద్యా విధాన రూపకల్పనలోని మౌలిక లోపాలను ఎత్తిచూపుతున్న గంభీర హెచ్చరికగా ఆయన...
Read More...
Local News 

ఘనంగా ముగిసిన శ్రీ అష్టలక్ష్మి దేవాలయం బ్రహ్మోత్సవ వేడుకలు

ఘనంగా ముగిసిన శ్రీ అష్టలక్ష్మి దేవాలయం బ్రహ్మోత్సవ వేడుకలు   జగిత్యాల మార్చి 1( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డు సమీపంలోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయం లో అంగరంగ వైభవంగా జరుగుతున్న 11వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా, 6 వ రోజు, చివరి రోజు అయిన ఆదివారం ఉదయం సుప్రభాతం, సేవ కాలం,పంచహారతి, అష్టోత్తర శత కలశాభిషేకం, మహా పూర్ణాహుతి, విమానోపరి కుంభాభిషేకం, చక్ర...
Read More...
Local News 

మహిళా పోలీస్ సిబ్బందికి  ఫ్రీ హెల్త్ క్యాంప్,  క్యాన్సర్ వ్యాక్సినేషన్ పై అవగాహన సదస్సు

మహిళా పోలీస్ సిబ్బందికి  ఫ్రీ హెల్త్ క్యాంప్,  క్యాన్సర్ వ్యాక్సినేషన్ పై అవగాహన సదస్సు జగిత్యాల మార్చ్ 1(ప్రజా మంటలు)మహిళలలో వచ్చే  రొమ్ము, సర్వైకల్  క్యాన్సర్‌ను ముందస్తుగా ఏవిదంగా  గుర్తించడం మరియు ఈ యొక్క క్యాన్సర్‌ లు రావడానికి గల కారణాలు, ఈ యొక్క క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తుగా తీసుకోవలసిన  హెచ్ పి వి వ్యాక్సినేషన్ గురించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల వారి సహకారంతో  స్థానిక  ఐ...
Read More...
Local News 

జగిత్యాల వీరశైవ సమాజం  నూతన కార్యవర్గ ఎన్నిక 

జగిత్యాల వీరశైవ సమాజం  నూతన కార్యవర్గ ఎన్నిక  జగిత్యాల మార్చి 1( ప్రజా మంటలు)జగిత్యాల నూతన వీర శైవ సమాజం అధ్యక్షుడుగా కంది కైలాసం  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా హద్దునూరి  నాగేంద్రం  ఎన్నికయ్యారు.     గౌరవ అధ్యక్షులుగా ములస్తం శివకుమార్   ఉపాధ్యక్షులుగా సూరం వీరయ్య గుంటిమట్టం నిరంజన్  కోశాధికారిగా సిద్ధాంతి శ్రీనివాస్ మరియు సంయుక్త కార్యదర్శిగా  వూడే అవంతిక అంగడి మఠంవీర...
Read More...
Local News 

ఘనంగా ముందస్తు మహిళ దినోత్సవ వేడుకలు

ఘనంగా ముందస్తు మహిళ దినోత్సవ వేడుకలు జగిత్యాల మార్చ్ 1( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం లోని ఉమా శంకర్ గార్డెన్స్ లో పద్మశాలి కిట్టి పార్టీ వేడుకలలో భాగంగా  ఆదివారం ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు మహిళలు ఘనంగా జరుపుకున్నారు. జ్యోతి ప్రజలన           గావించి,  కార్యక్రమాలు ప్రారంభించారు.   మహిళలు ఆటపాటలతో  అల రించారు. రోజంతా సందడి నెలకొందని సామాజిక కార్యకర్త తవుటు...
Read More...