మెరుగైన ప్రమాణాలతో విద్య బోధన, క్రీడలలో ఆసక్తి పెంచాలి - సీఎం రేవంత్ రెడ్డి

On
మెరుగైన ప్రమాణాలతో విద్య బోధన, క్రీడలలో ఆసక్తి పెంచాలి - సీఎం రేవంత్ రెడ్డి

బాలిక‌ల‌కు వివిధ అంశాల‌పై కౌన్సెలింగ్

పాఠ‌శాల‌లో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం

ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌ల్లో చదువుతున్న వారిలో 90 శాతానికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే

విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష

హైదరాబాద్ ఆగస్ట్ 29 (ప్రజా మంటలు):

పాఠ‌శాల‌లు మొద‌లు విశ్వవిద్యాల‌యాల వ‌ర‌కు ప్ర‌తి విద్యా సంస్థ‌లోనూ మెరుగైన విద్యా బోధ‌న, బోధ‌న‌లో నాణ్య‌తా  ప్ర‌మాణాలు మ‌రింత‌గా పెంచాల‌ని ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు, ప్రొఫెషన‌ల్ కాలేజీల్లో విద్యార్థులు, బోధ‌న సిబ్బందికి ఫేషియ‌ల్ రిక‌గ్నేష‌న్ త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని చెప్పారు. ముఖ గుర్తింపుతో హాజరు శాతం మెరుగుపడటంతో పాటు లోటుపాట్ల‌ను అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని అన్నారు.

 ఐసీసీసీ (ICCC)లో ముఖ్యమంత్రి విద్యా శాఖలపై సమీక్షించారు. విద్యా శాఖ ప‌రిధిలో అద‌న‌పు గ‌దులు, వంట గ‌దులు, మూత్ర‌శాల‌లు, మ‌రుగుదొడ్లు, ప్ర‌హారీల నిర్మాణం వివిధ విభాగాలు చేప‌ట్ట‌డం స‌రికాద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ నిర్మాణాల‌ నాణ్య‌త‌ ప్ర‌మాణాలు, నిర్మాణ ప‌ర్య‌వేక్ష‌ణ‌, నిధుల మంజూరు, జ‌వాబుదారీత‌నానికి గానూ ఒకే విభాగం కింద ఉండాల‌న్నారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల నిర్మాణాన్ని ప‌ర్య‌వేక్షిస్తున్న విద్యా, సంక్షేమ వ‌స‌తుల అభివృద్ధి సంస్థ (EWIDC) కింద‌నే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థ‌ల నిర్మాణాలు కొన‌సాగాల‌ని ఆదేశించారు. ఈ సంస్థ‌కు అవ‌స‌ర‌మైన ఇంజినీరింగ్‌, ఇత‌ర సిబ్బందిని ఇత‌ర విభాగాల నుంచి వెంట‌నే డిప్యూటేష‌న్‌పై తీసుకోవాల‌ని సూచించారు. ఈ సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.IMG-20250829-WA0022

▪️మ‌ధ్యాహ్న భోజ‌న బిల్లుల చెల్లింపును గ్రీన్ ఛాన‌ల్‌లో చేప‌ట్టాలి. ఈ విష‌యంలో ఎలాంటి అల‌స‌త్వం చూపొద్దు.

▪️తెలంగాణ‌లోని మ‌హిళా కళాశాల‌లు, బాలికల పాఠ‌శాల‌ల్లో మూత్ర‌శాల‌లు, మ‌రుగుదొడ్లు, ప్ర‌హ‌రీల నిర్మాణాన్ని వేగ‌వంతం చేయాలి.

 ▪️కంటైన‌ర్ కిచెన్ల‌కు ప్రాధాన్య‌మివ్వాలి.  వాటిపై సోలార్ ప్యానెళ్ల‌తో అవ‌స‌ర‌మైన విద్యుత్ వినియోగించుకోవ‌చ్చు.

▪️ప్ర‌తి పాఠ‌శాల‌లో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అవ‌స‌ర‌మైతే కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిన వ్యాయామ ఉపాధ్యాయుల‌ను నియ‌మించే అంశాన్ని ప‌రిశీలించాలి.

▪️అమ్మ ఆద‌ర్శ పాఠ‌శాల‌ల కింద పాఠ‌శాల‌ల్లో పారిశుద్ధ్య ప‌నులకు సంబంధించిన బిల్లులు త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాలి.

▪️సంక్షేమ గురుకుల పాఠ‌శాల‌ల్లోని బాలిక‌ల‌కు వివిధ అంశాల‌పై కౌన్సెలింగ్ ఇచ్చేందుకు మ‌హిళా కౌన్సెల‌ర్ల‌ను నియ‌మించాలి.

విద్యా రంగంపై పెడుతున్న ఖ‌ర్చును తాము ఖ‌ర్చుగా కాకుండా పెట్టుబ‌డిగా చూస్తున్నామ‌ని ముఖ్యమంత్రి తెలిపారు. యంగ్ ఇండియా ఇంటెగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్స్ స్కూళ్ల‌తో పాటు విద్యా రంగం అభివృద్ధికి తీసుకునే రుణాల‌ను ఎఫ్ఆర్‌బీఎం ప‌రిమితిలో లేకుండా చూడాల‌ని ఉప ముఖ్య‌మంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ కు విజ్ఞ‌ప్తి చేశార‌ని తెలిపారు.

ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌ల్లో చదువుతున్న వారిలో 90 శాతానికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నార‌ని, ఈ విష‌యాన్ని నిర్ధారించేందుకు గ‌త ప‌దేళ్ల‌లో ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌ల్లో చ‌దివిన వారి వివ‌రాల‌పై నివేదిక రూపొందించాల‌ని ముఖ్యమంత్రి ఆదేశించారు.

 ఈ సమావేశంలో ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి గారు, ముఖ్య‌మంత్రి ఓఎస్డీ వేములు శ్రీ‌నివాసులు గారు, విద్యా శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి యోగితా రాణా గారు, ఉన్న‌త విద్యా మండ‌లి ఛైర్మ‌న్ ప్రొఫెస‌ర్ బాల‌కిష్టారెడ్డి గారు, సాంకేతిక విద్యా శాఖ క‌మిష‌న‌ర్ శ్రీ‌దేవ‌సేన‌ గారు, పాఠ‌శాల విద్యా శాఖ సంచాల‌కుడు న‌వీన్ నికోల‌స్ గారితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

State News 

వెలుగుమట్ల బాధితులకు ఇళ్లు ప్రకటించడంతో కవిత దీక్ష విరమణ – భూదాన్ భూములపై శ్వేతపత్రం డిమాండ్

వెలుగుమట్ల బాధితులకు ఇళ్లు ప్రకటించడంతో కవిత దీక్ష విరమణ – భూదాన్ భూములపై శ్వేతపత్రం డిమాండ్ హైదరాబాద్, మార్చ్ 11 (ప్రజా మంటలు): ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలకు గురైన బాధితులకు ప్రభుత్వం ఇళ్లు, ఇండ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో కొనసాగుతున్న నిరాహార దీక్షను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరియు ధర్మసమాజ్ పార్టీ నాయకుడు విశారదన్ మహారాజ్ విరమించారు.జస్టిస్ ఈశ్వరయ్య నిమ్మరసం ఇచ్చి...
Read More...
Local News 

స్మశాన వాటికలో చెట్లు నాటిన ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్

స్మశాన వాటికలో చెట్లు నాటిన ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్    జగిత్యాల మార్చి 11 (ప్రజా మంటలు)పట్టణ గొల్లపల్లి రోడ్ లో గల సత్య హరిచంద్ర స్మశాన వాటిక లో రోటరీ ఆపి రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఏర్పాటుచేసిన మొక్కలు నాటే కార్యక్రమం,పలు అభివ్రుద్ది కార్యక్రమాల్లో పాల్గొని మొక్కలు నాటిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల...
Read More...
Local News 

ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణ సిబ్బందికి అవగాహన

ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణ సిబ్బందికి అవగాహన జగిత్యాల మార్చి 11 (ప్రజా మంటలు)ఈనెల 14 నుండి ప్రారంభం కాబోయే ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణకు కేటాయింపబడిన సిబ్బందికి అవగాహన కార్యక్రమం బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.   జిల్లా  వ్యాప్తంగా ఈనెల 14 నుండి ప్రారంభం కాబోయే ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణకు కేటాయింపబడిన చీఫ్ సూపర్డెంట్ లకు మరియు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు నియమ ఈ...
Read More...
Local News 

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి జగిత్యాల మార్చి 11 ( ప్రజా మంటలు)పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని జగిత్యాల పట్టణం లో జగిత్యాల జిల్లా ఎంఐఎం పార్టీ అధ్యక్షులు లియాకత్ అలీ మోసిన్  స్వగృహం లో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని  శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి .ఈ...
Read More...
Local News 

సామాజిక మార్పుతోనే మహిళా సాధికారత సాధ్యం: సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు

సామాజిక మార్పుతోనే మహిళా సాధికారత సాధ్యం: సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు మెట్‌పల్లి, మార్చ్ 10 (ప్రజా మంటలు): సమాజంలో సానుకూల మార్పులు వచ్చినప్పుడే మహిళలకు నిజమైన సాధికారత సాధ్యమవుతుందని మెట్‌పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మండల న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన...
Read More...
State News 

కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచిస్తా – మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచిస్తా – మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు జగిత్యాల రూరల్,  మార్చ్ 10 (ప్రజా మంటలు): కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేదా అన్న విషయంపై తాను ఆలోచిస్తున్నానని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల రోజే...
Read More...
State News 

కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం

 కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం హైదరాబాద్, మార్చ్ 10 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్రానికి కొత్త రాష్ట్రపతి ప్రతినిధిగా, గవర్నర్ gaa నియమితులైన శివ ప్రతాప్ శుక్లా రాష్ట్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.ఈ స్వాగత కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,...
Read More...
Local News 

వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతపై కవిత నిరవధిక నిరాహార దీక్ష కొనసాగింపు

వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతపై కవిత నిరవధిక నిరాహార దీక్ష కొనసాగింపు ఖమ్మం/హైదరాబాద్, మార్చ్ 10 (ప్రజా మంటలు): ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత ఘటనకు నిరసనగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతోంది. సోమవారం రాత్రి ఖమ్మంలో దీక్ష ప్రారంభించిన కవితను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. ఖమ్మం సీపీ ఆధ్వర్యంలో సుమారు 600...
Read More...
State News 

వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా కల్వకుంట్ల కవిత నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభం

వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా కల్వకుంట్ల కవిత నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభం ఖమ్మం, మార్చ్ 9 (ప్రజా మంటలు): ఖమ్మం పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అంబేద్కర్ భవన్‌లో వెలుగుమట్ల బాధితులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు.ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద మాట్లాడిన ఆమె, తెలంగాణ జాగృతి, ఎస్సీ–ఎస్టీ–బీసీ జేఏసీ, ధర్మసమాజ్ పార్టీ...
Read More...
Local News 

ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిశీలించాలి

ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిశీలించాలి జగిత్యాల మార్చ్ 9(ప్రజా మంటలు)ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా అదనపు  కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్ లత  అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు.   అదనపు కలెక్టర్ (రెవెన్యూ)  బిఎస్ లత  మాట్లాడుతూ...
Read More...
National  International  

ఇరాన్ సుప్రీం లీడర్‌గా మోజ్తభా ఖమెనీ నియామకం –

ఇరాన్ సుప్రీం లీడర్‌గా మోజ్తభా ఖమెనీ నియామకం – ఇరాన్ సుప్రీం లీడర్‌గా మోజ్తభా కామెనీ నియామకం మధ్యప్రాచ్య దేశమైన ఇరాన్లో అత్యున్నత మత-రాజకీయ అధికారం అయిన సుప్రీం లీడర్ పదవికి మోజ్తభా కామెనీను ఎంపిక చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, దౌత్య వర్గాల్లో చర్చకు దారితీసింది.మోజ్తభా కామెనీ, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయిన అయాతొల్లా...
Read More...
Local News 

ఖమ్మంలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ – మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే అరెస్టుపై వివాదం

ఖమ్మంలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ – మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే అరెస్టుపై వివాదం ఖమ్మం, మార్చి 09 (ప్రజా మంటలు): వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా ఖమ్మం జెడ్పీ సెంటర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్, వెలుగుమట్ల బాధితులు మరియు జాగృతి నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కవితతో...
Read More...