మున్సిపల్ ఎన్నికలు వ్యక్తిగత దూషణలకే పరిమితం : కవిత
బడ్జెట్‌లో హామీలకు నిధులు కేటాయించాలి: కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు):
మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రజా సమస్యలపై కాకుండా వ్యక్తిగత దూషణలకే పరిమితమైందని తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో నీరు, రవాణా, విద్య, వైద్యం వంటి మౌలిక సమస్యలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.
ప్రెస్‌మీట్‌లో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే రాబోయే బడ్జెట్‌లో స్పష్టమైన నిధుల కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. 1.89 లక్షల ఉద్యోగాల భర్తీకి బడ్జెట్‌లో ప్రావిజన్ పెట్టి, వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరారు.
బీసీలకు ఏటా రూ.20 వేల కోట్లు కేటాయించి, బీసీ సబ్ ప్లాన్ ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు ఉన్నప్పటికీ ఒక్క మున్సిపాలిటీలో మాత్రమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఉందని, అభివృద్ధి రాజకీయ సర్దుబాట్లకే పరిమితమైందని విమర్శించారు.
మహబూబ్‌నగర్ వంటి పట్టణాల్లో ఇప్పటికీ రెండు రోజులకోసారి నీళ్లు వస్తున్నాయని, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మెరుగుపడలేదని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కంటే ఉపాధ్యాయులే ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉందని, బస్తీ దవాఖానాల్లో మందులు, వైద్యులు లేరని ఆరోపించారు.
రాబోయే బడ్జెట్ సుమారు రూ.3.25 లక్షల కోట్లుగా ఉండే అవకాశం ఉందని పేర్కొంటూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ల ప్రకారం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పెన్షన్ల కోసం రూ.35 వేల కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు నిధులు ఇవ్వాలని సూచించారు.
రైతు రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని, ప్రకటించిన మొత్తాలు, వాస్తవంగా చెల్లించిన మొత్తాల మధ్య భారీ వ్యత్యాసం ఉందని తెలిపారు. యాసంగి రైతు భరోసా ఇప్పటికీ విడుదల కాలేదని విమర్శించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
ఆర్టీసీ కార్మికుల సంఖ్య తగ్గిపోవడం ఆందోళనకరమని, ఎలక్ట్రిక్ బస్సుల్లో ఆర్టీసీ ఉద్యోగులకే అవకాశం ఇవ్వాలని అన్నారు. మహిళలకు స్కూటీ, తులం బంగారం వంటి హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రం రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ ముఖ్యమంత్రి స్పందించడం లేదని విమర్శించారు. లేబర్ కోడ్ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 12న జరిగే బంద్‌కు తెలంగాణ జాగృతి మద్దతు ఇస్తుందని తెలిపారు. అదే రోజు తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలు సర్దుబాట్లకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ, ప్రజలు వ్యక్తులను చూసి ఓటు వేయాలని, సింహం గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జిమ్మీ లైకు 20 ఏళ్ల జైలు – హాంకాంగ్‌లో పత్రికా స్వేచ్ఛ క్షీణత
హాంకాంగ్ ఫిబ్రవరి 10:చైనా ప్రభుత్వానికి తీవ్ర విమర్శకుడిగా పేరుగాంచిన, హాంకాంగ్‌కు చెందిన ప్రజాస్వామ్య అనుకూల మీడియా వ్యాపారవేత్త జిమ్మీ లైకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు హాంకాంగ్‌లో పత్రికా స్వేచ్ఛ తీవ్రంగా క్షీణిస్తున్నదన్న ఆందోళనలకు మరింత బలం చేకూర్చింది.
యాపిల్ డైలీ పత్రిక వ్యవస్థాపకుడైన జిమ్మీ లై, బీజింగ్... మున్సిపల్ ఎన్నికలు వ్యక్తిగత దూషణలకే పరిమితం : కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు):
మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రజా సమస్యలపై కాకుండా వ్యక్తిగత దూషణలకే పరిమితమైందని తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో నీరు, రవాణా, విద్య, వైద్యం వంటి మౌలిక సమస్యలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.
ప్రెస్‌మీట్‌లో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే... ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కొరకే ఫ్లాగ్ మార్చ్:డిఎస్పి రఘు చందర్
జగిత్యాల ఫిబ్రవరి 9 (ప్రజా మంటలు)ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలి.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.... అభివృద్ధే అస్త్రం… అధికార పార్టీతోనే జగిత్యాల పురోగతి: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):
చేసిన అభివృద్ధి పనులకే ప్రజలు పట్టం కడతారని, ప్రభుత్వంతో కలిసి పనిచేసే ప్రతినిధులను గెలిపిస్తేనే జగిత్యాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
యావర్ రోడ్డు విస్తరణకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, 200 కోట్ల... మళ్ళీ సెన్సార్ కు జన నాయకన్ సినిమా: కోర్టులో కేసు ఉపసంహరణ
చెన్నై – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):
TVK పార్టీ నాయకుడు దలపతి నటించిన ‘జననాయకన్’ చిత్రాన్ని మళ్లీ సెన్సార్ బోర్డుకు పంపాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో సంబంధించి కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసును చిత్ర బృందం ఉపసంహరించుకున్నట్లు న్యాయస్థానానికి తెలియజేసింది.
ఇంతవరకు ఉన్న ఈ చిత్ర సెన్సార్ పై ఉన్న సందేహాలను... సీషెల్స్‌కు 175 మిలియన్ డాలర్ల అభివృద్ధి సహాయం ప్రకటించిన భారత్
న్యూఢిల్లీ – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):
భారతదేశానికి ఆరు రోజుల అధికారిక పర్యటనకు వచ్చిన సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహుళ రంగాలపై విస్తృత చర్చలు జరిపారు. ఈ సమావేశాల్లో వాణిజ్యం, ఆర్థిక సహకారం, భద్రతా అంశాలపై పరస్పర సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఇరుపక్షాలు అంగీకరించాయి.
ఈ చర్చల అనంతరం,... అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ జప్తు
ఇబ్రహీంపట్నం – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):
అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకుని, లారీ ఓనర్ మరియు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన భూక్య వంశీ (24) తన యజమాని ఇస్లావత్ శంకర్ ఆదేశాల మేరకు వేంపల్లి గ్రామ శివారులోని గోదావరి నది నుంచి ఇసుకను... ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో గొల్లపల్లి బి ఆర్ ఎస్ నాయకులు
గొల్లపల్లి ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు);
ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 6,7,,8,, వార్డుల అభ్యర్థులకు,తోడుగా ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజల మధ్యలో ఓట్లు అభ్యర్థిస్తున్నా, మాజీ ఎంబిపీపి నక్క శంకయ్య గోస్కుల జలంధర్ పి ఎస్ సి ఎస్ చైర్మన్ చెందోళ గందే మాధవ రావు ఓరగంటి అశోక్ ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా, రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలి
జగిత్యాల – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):
మున్సిపాలిటీలు ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా పనిచేయాలని, రాజ్యాంగ స్ఫూర్తితో పాలన సాగిస్తూ అవకతవకలకు తావు లేకుండా ఉండాలని ఎమ్మెల్సీ ఎల్. రమణ అన్నారు. జగిత్యాల పట్టణంలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బి.ఆర్.ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని... అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శరద్ పవార్
ముంబై ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు)ఎన్‌సీపీ (ఎస్‌పీ) అధినేత శరద్ పవార్ ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా గొంతు ఇన్ఫెక్షన్, శ్వాసకు సంబంధించిన ఇబ్బందులతో బాధపడుతున్న ఆయనను వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేర్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా... రాయికల్ లో బి ఆర్ ఎస్ నాయకుల ప్రచారం
రాయికల్ ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్) పార్టీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహించారు. రాయికల్ బస్టాండ్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగులు ఏర్పాటు చేసి, ప్రజలతో నేరుగా మమేకమై పార్టీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను... 