తెలుగు పత్రికా రంగానికి మార్గ నిర్దేశకుడు నార్ల.
- ఫిబ్రవరి 16 - నార్ల వెంకటేశ్వరరావు వర్ధంతి.
( రామ కిష్టయ్య సంగన భట్ల - 9440595494 ).
నార్ల వెంకటేశ్వరరావు... పరిచయం అక్కర్లేని పేరు.
నిర్భయానికి, నిక్క చ్చితత్వానికి, నిబద్ధతకు మారు పేరు. వృత్తి నిబద్దతతో నిర్వహించారు. వృత్తి నిర్వహణ సామాజిక బాధ్యతగా భావించారు. పత్రికా రంగానికి మార్గదర్శకులు, జర్నలిస్టు లకు దిశానిర్దేశకులు. ఆయనొక విజ్ఞాన సర్వస్వం. అయన జీవితం సంస్కరణల మయం. రచన ఏది చేసినా, ప్రక్రియ ఎదైనా, ప్రజా చైతన్యమే ఆయన లక్ష్యం. లక్ష్య సిద్ది కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకే సాగిన వైనం.
రచయితగా, నాటకకర్తగా, విమర్శ కుడిగా, అనువాదకుడిగా బహు ముఖ పాత్రలు పోషించిన ఆయన జీవిత పర్యంతం హేతుబద్ధమైన ఆలోచనల ద్వారా సామాజిక స్పృహ కల్పించే ప్రయత్నం చేశారు. ఆంగ్ల భాషలోనూ నిష్ణాతులైనా, తెలుగు ప్రజలకు తన రచనలు చేరువ కావాలనే తలంపుతో, తెలుగు పత్రికా రంగాన్ని కావాలనే ఎంచుకున్నారు.
మధ్య ప్రదేశ్ లోని జబల్‌పూర్‌లో డిసెంబర్ 1, 1908 జన్మించిన నార్ల, విద్యాభ్యాసం కృష్ణా జిల్లాలో జరిగిం ది. వెంకటేశ్వరరావు ఏప్రిల్ 3, 1958 నుండి ఏప్రిల్ 2, 1970 వరకు రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా పని చేశారు.
స్వరాజ్య, జన వాణి, ప్రజా మిత్ర పత్రికలో పని చేసి, ఆంధ్ర ప్రభ, చివరకు ఆంధ్ర జ్యోతి పత్రికలకు ఎడిటర్ గా విధులు నిర్వర్తించారు. విధి నిర్వహణలో ఎన్నడూ అయన రాజీ పడలేదు. ఆయన సంపాద కీయ రచనలు సూటిదనం, గడుసు దనం, వ్యంగ్యం, చమత్కారం, లోక జ్ఞత, సమయజ్ఞత కల గలిపి ఉండే వి. పండితునికి, పామరునికి తెలు గు భాష అర్థమయ్యే రీతిలో నార్ల సంపాదకీయాలు, రచనలు చేశారు.
''వాస్తవమ్ము నార్లవారి మాట'’ మకుటంతో ఆటవెలదులు రచించారు. ‘'నవయుగాల బాట నార్ల మాట'’ మకుటంతో 700కు పైగా సందేశాత్మక పద్యాలు రాశారు. 16 ఏకాంకికల సంపుటి వెలువరించారు. నార్ల సొంత గ్రంథాలయంలో 20,000 పుస్తకాలు ఉండేవట అంటే మాటలు కాదు.
సంపాదకుడు అనే మాటను అయన అంగీకరించ లేదు. ఆమోదించ లేదు. ఎడిటర్ అనే పదాన్నే వాడే వారు.
నార్ల... టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, , కాసు బ్రహ్మానంద రెడ్డి, ఎన్.జి. రంగా ఎవరినీ వదల లేదు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ చాందసాన్ని విమర్శించక మాన లేదు. ఇందిరా గాంధి, ఆమె కుటుంబ వారసత్వ రాజకీయాల్ని ద్వేషించారు.
ఆయన వ్యాసాలను నిరక్షరాస్యులు గ్రామాల్లోని రచ్చబండల దగ్గర చదివి వినిపించుకునే వారంటే ఆయనలోని రచనా వ్యాసంగ శక్తి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.
ఆంధ్రప్రభ నుంచి వైదొలిగిన సందర్భంలో, నార్ల కోసం కొందరు ముఖ్యులు కలిసి ఆంధ్ర జ్యోతి పత్రిక ప్రారంభించారంటే ఆయన గొప్పతనం స్పష్టం అవుతున్నది. గోరాశాస్త్రి మాటల్లో చెప్పాలంటే 'కేవలం సత్వగుణ ప్రధానంగా, అచ్చ తెలుగులో చప్పచప్పగా ఉన్న పత్రికా రచనలో వాడినీ, వేడినీ సృష్టించి, తెలుగు నుడికారంలో ఎంత 'కారం' ఉందో తెలియజెప్పిన వాడు' నార్ల.
"యొక్కలతో తెలుగుభాష డొక్క పొడవొద్దు...ఎంత గొప్ప వాడైనా వస్తాడే కాని విచ్చేయడు...
సంపాదకుడు అనొద్దు ఎడిటర్ అనండి...బడు వాడేవాడు బడుద్ధాయి. అంటూ పత్రికా భాష ఎలా ఉండాలో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఫిబ్రవరి 16, 1985న ఈ లోకాన్ని వీడి వెళ్లిన నార్ల తెలుగు సాహిత్య, పత్రికా రంగాలలో చెరగని ముద్ర వేసి వెళ్లారు.
"ఎడిటరైన వాడు బిడియము చూపుచో ధాటి తగ్గు వృత్తి ధర్మమందు, కడుపుకూటి రాత కక్కుర్తి రాతరా''
"నిజము కప్పిపుచ్చి నీతిని విడనాడి స్వామి సేవ సేయు జర్నలిస్టు తార్చువాని కంటే తక్కువ వాడురా" అంటూ విలువలు వీడ వలదని హితవు పలికారు. ప్రస్తుత పరిస్థితులలో ఆయన చేసిన మార్గ నిర్దేశం నేటి జర్నలిస్టులకు నిజంగానే శిరోధార్యం.
More News...
<%- node_title %>
<%- node_title %>
నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
జగిత్యాల జిల్లా ప్రతినిధి, ( ప్రజా మంటలు) సెప్టెంబర్ 19:
గణేశ్ నిమజ్జనo శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తో కలిసి గణేష్ నిమజ్జన ప్రాంతాలైన జగిత్యాలలో... వర్ష కొండలో గణపతి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు,
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలో పెద్ద చెరువు వద్ద గణపతి నిమజ్జన ఏర్పాట్లను తహసిల్దార్ వరప్రసాద్,ఎస్ఐ నవీన్ పరిశీలించినరు,
గంగమ్మ గుడి కట్టపైన నుండి చిన్న గణపతులు నిమజ్జనం, గంగపుత్ర సంఘ భవనం వద్ద నుండి పెద్ద గణపతులు నిమగ్నం చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నట్లు... మహాత్మ జ్యోతిరావ్ ఫూలే స్కూల్ ని ఆకష్మిక తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జి.-ఆర్. అజయ్ కుమార్
మెట్టుపల్లి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
మెట్ పల్లి మండల లీగల్ సర్వీసెస్ ఛైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి ఆర్. అజయ్ కుమార్, శనివారం పట్టణంలోని మహాత్మ జ్యోతిరావ్ పూలే బాలుర హాస్టల్, బీర్పూర్ ఎట్ మెట్ పల్లిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో ఉన్న కిచెన్, బాత్రూం,... చేనేత కార్మికులందరికీ ‘చేయూత’ పెన్షన్ వర్తింపజేయాలి : ఎల్ రమణ
హైదరాబాద్ సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న అర్హులైన ప్రతి కార్మికుడికి ‘చేయూత’ పెన్షన్ పథకం వర్తించేలా అర్హత ప్రమాణాలను విస్తరించాలని బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
ప్రస్తుతం జియో ట్యాగింగ్ ద్వారా గుర్తింపు... రేవంత్‌రెడ్డికి సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదు: మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
పాలన చేతగాక.. రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్
హైకోర్టు తీర్పు పార్టీ ఫిరాయింపుల విషయంలో ప్రభుత్వానికి గుణపాఠం
జగిత్యాల, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి ఆరోపించారు. రైతుల సమస్యలు, ఆరు గ్యారంటీల అమలు వంటి... కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అమన్ జిత్ సింగ్
కరీంనగర్, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
కరీంనగర్ పట్టణంలోని సిక్కు వాడకు చెందిన కాంగ్రెస్ నాయకుడు అమన్ జిత్ సింగ్ను జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. చొప్పదండి ఎమ్మెల్యే, DCC అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం రేకుర్తి క్యాంపు కార్యాలయంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్... రేపే కొడంగల్ గడ్డపై కల్వకుంట్ల కవిత పాంచజన్య శంఖారావం
కొడంగల్–కోస్గి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు)::
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కోస్గి కాలేజీ గ్రౌండ్‌లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. సభకు పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. 120 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో సభా వేదికను ఏర్పాటు చేయగా, సుమారు... మున్సిపల్ లో గణనాథునుకి ఉత్తర పూజలు
జగిత్యాల, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
వినాయక నవరాత్రుల సందర్భంగా జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాథునికి మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్య ప్రణవ్, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్తర పూజలు చేసి అన్నదానం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర చేపట్టారు.... సింహాచలం జగన్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు
ఎండపెల్లి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎండపెల్లి మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన కుటుంబ సభ్యులను జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత... రాయికల్‌లో లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే సంజయ్
రాయికల్, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
రాయికల్ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.30 లక్షల వ్యయంతో నాలుగు డీటీఆర్‌లు ఏర్పాటు చేసినట్లు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. గృహజ్యోతి పథకం... రాయికల్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ
రాయికల్, సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు):
రాయికల్ పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరనాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆవిష్కరించారు.
ఈ విగ్రహాన్ని వేముల ప్రభాకర్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా... శ్రీ గౌరీ ప్రియ నగర వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద కొనసాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు
కీసర సెప్టెంబర్ 17 ( ప్రజా మంటలు)కుందన్ పల్లి లోని శ్రీ గౌరీ ప్రియ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతినిత్యం కొనసాగుతున్నాయి.
దీనిలో భాగంగా గణేష్ హోమము మాతలచే సామూహిక కుంకుమార్చనలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు... 