తెలుగు పత్రికా రంగానికి మార్గ నిర్దేశకుడు నార్ల.

- ఫిబ్రవరి 16 - నార్ల వెంకటేశ్వరరావు వర్ధంతి.

On
తెలుగు పత్రికా రంగానికి మార్గ నిర్దేశకుడు నార్ల.

( రామ కిష్టయ్య సంగన భట్ల - 9440595494 ).

నార్ల వెంకటేశ్వరరావు... పరిచయం అక్కర్లేని పేరు.

నిర్భయానికి, నిక్క చ్చితత్వానికి, నిబద్ధతకు మారు పేరు. వృత్తి నిబద్దతతో నిర్వహించారు. వృత్తి నిర్వహణ సామాజిక బాధ్యతగా భావించారు. పత్రికా రంగానికి మార్గదర్శకులు, జర్నలిస్టు లకు దిశానిర్దేశకులు. ఆయనొక విజ్ఞాన సర్వస్వం. అయన జీవితం సంస్కరణల మయం. రచన ఏది చేసినా, ప్రక్రియ ఎదైనా, ప్రజా చైతన్యమే ఆయన లక్ష్యం. లక్ష్య సిద్ది కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకే సాగిన వైనం. 

 రచయితగా, నాటకకర్తగా, విమర్శ కుడిగా, అనువాదకుడిగా బహు ముఖ పాత్రలు పోషించిన ఆయన జీవిత పర్యంతం హేతుబద్ధమైన ఆలోచనల ద్వారా సామాజిక స్పృహ కల్పించే ప్రయత్నం చేశారు. ఆంగ్ల భాషలోనూ నిష్ణాతులైనా, తెలుగు ప్రజలకు తన రచనలు చేరువ కావాలనే తలంపుతో, తెలుగు పత్రికా రంగాన్ని కావాలనే ఎంచుకున్నారు. 

మధ్య ప్రదేశ్ లోని జబల్‌పూర్‌లో డిసెంబర్ 1, 1908 జన్మించిన నార్ల, విద్యాభ్యాసం కృష్ణా జిల్లాలో జరిగిం ది. వెంకటేశ్వరరావు ఏప్రిల్ 3, 1958 నుండి ఏప్రిల్ 2, 1970 వరకు రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా పని చేశారు.

స్వరాజ్య, జన వాణి, ప్రజా మిత్ర పత్రికలో పని చేసి, ఆంధ్ర ప్రభ, చివరకు ఆంధ్ర జ్యోతి పత్రికలకు ఎడిటర్ గా విధులు నిర్వర్తించారు. విధి నిర్వహణలో ఎన్నడూ అయన రాజీ పడలేదు. ఆయన సంపాద కీయ రచనలు సూటిదనం, గడుసు దనం, వ్యంగ్యం, చమత్కారం, లోక జ్ఞత, సమయజ్ఞత కల గలిపి ఉండే వి. పండితునికి, పామరునికి తెలు గు భాష అర్థమయ్యే రీతిలో నార్ల సంపాదకీయాలు, రచనలు చేశారు.

 ''వాస్తవమ్ము నార్లవారి మాట'’ మకుటంతో ఆటవెలదులు రచించారు. ‘'నవయుగాల బాట నార్ల మాట'’ మకుటంతో 700కు పైగా సందేశాత్మక పద్యాలు రాశారు. 16 ఏకాంకికల సంపుటి వెలువరించారు. నార్ల సొంత గ్రంథాలయంలో 20,000 పుస్తకాలు ఉండేవట అంటే మాటలు కాదు.

సంపాదకుడు అనే మాటను అయన అంగీకరించ లేదు. ఆమోదించ లేదు. ఎడిటర్ అనే పదాన్నే వాడే వారు. 

నార్ల... టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, , కాసు బ్రహ్మానంద రెడ్డి, ఎన్.జి. రంగా ఎవరినీ వదల లేదు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ చాందసాన్ని విమర్శించక మాన లేదు. ఇందిరా గాంధి, ఆమె కుటుంబ వారసత్వ రాజకీయాల్ని ద్వేషించారు. 

ఆయన వ్యాసాలను నిరక్షరాస్యులు గ్రామాల్లోని రచ్చబండల దగ్గర చదివి వినిపించుకునే వారంటే ఆయనలోని రచనా వ్యాసంగ శక్తి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.

ఆంధ్రప్రభ నుంచి వైదొలిగిన సందర్భంలో, నార్ల కోసం కొందరు ముఖ్యులు కలిసి ఆంధ్ర జ్యోతి పత్రిక ప్రారంభించారంటే ఆయన గొప్పతనం స్పష్టం అవుతున్నది. గోరాశాస్త్రి మాటల్లో చెప్పాలంటే 'కేవలం సత్వగుణ ప్రధానంగా, అచ్చ తెలుగులో చప్పచప్పగా ఉన్న పత్రికా రచనలో వాడినీ, వేడినీ సృష్టించి, తెలుగు నుడికారంలో ఎంత 'కారం' ఉందో తెలియజెప్పిన వాడు' నార్ల. 

"యొక్కలతో తెలుగుభాష డొక్క పొడవొద్దు...ఎంత గొప్ప వాడైనా వస్తాడే కాని విచ్చేయడు...

సంపాదకుడు అనొద్దు ఎడిటర్ అనండి...బడు వాడేవాడు బడుద్ధాయి. అంటూ పత్రికా భాష ఎలా ఉండాలో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఫిబ్రవరి 16, 1985న ఈ లోకాన్ని వీడి వెళ్లిన నార్ల తెలుగు సాహిత్య, పత్రికా రంగాలలో చెరగని ముద్ర వేసి వెళ్లారు.

 "ఎడిటరైన వాడు బిడియము చూపుచో ధాటి తగ్గు వృత్తి ధర్మమందు, కడుపుకూటి రాత కక్కుర్తి రాతరా''

"నిజము కప్పిపుచ్చి నీతిని విడనాడి స్వామి సేవ సేయు జర్నలిస్టు తార్చువాని కంటే తక్కువ వాడురా" అంటూ విలువలు వీడ వలదని హితవు పలికారు. ప్రస్తుత పరిస్థితులలో ఆయన చేసిన మార్గ నిర్దేశం నేటి జర్నలిస్టులకు నిజంగానే శిరోధార్యం.

Tags

More News...

Local News 

ఇబ్రహీంపట్నం తాసిల్దార్ కార్యాలయ తనిఖీ.

ఇబ్రహీంపట్నం తాసిల్దార్ కార్యాలయ తనిఖీ. ఇబ్రహీంపట్నం ఆగస్టు 20 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండల్ తాసిల్దార్ కార్యాలయంనుఅదనపు కలెక్టర్  మరియు ఆర్డీవో మెట్పల్లి  తనిఖీ చేశారు, భూ భారత్ కి సంబంధించిన ఫైల్ వెరిఫై చేసి, త్వరగా పూర్తి చేయుటకు ఆదేశాలు జారీ చేసిసారు. కార్యాలయ సిబ్బందికి తగు సూచనలు జారీ చేసి,  గోదుర్ గ్రామంలో గల రాజరాజేశ్వర...
Read More...
Local News  State News 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి  వేడుకల్లో డాక్టర్ కోట నీలిమ

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి  వేడుకల్లో డాక్టర్ కోట నీలిమ సికింద్రాబాద్, ఆగస్ట్ 20 (ప్రజామంటలు) : ఆధునిక భారత రూపకర్త, ఐటీ విప్లవ పితామహుడు, మాజీ ప్రధానమంత్రి భారతరత్న ,దివంగత రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలను బన్సీలాల్ పేట్, బేగంపేట్, అమీర్ పేట్, సనత్ నగర్ డివిజన్లలో పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ...
Read More...
Local News  Crime  State News 

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతుల అదృశ్యం

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతుల అదృశ్యం ఇబ్రహీంపట్నం ఆగస్టు 20( ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన బోడ రవి - బోడ ప్రమీల దంపతులిద్దరూ శనివారం 16వ తేదీన ఇంట్లో నుండి వెళ్లి, ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాలేదని పోలీసులకు కూతురు ఫిర్యాదు చేసింది. అదృశ్యం అయిన వారి కూతురు అంబటి మీనాక్షి, ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు...
Read More...
Local News 

ఘనంగా రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుక

ఘనంగా రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుక (అంకం భూమయ్య)  గొల్లపల్లి ఆగస్టు 20 (ప్రజా మంటలు):  గొల్లపెల్లి మండల కేంద్రంలో స్థానిక ఎంపిడిఓ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు జరుపుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు...
Read More...
National  Opinion  State News 

130వ సవరణ రాజకీయ శుద్ధికా లేక రాజ్యాంగ మౌలికాంశాలనే మార్చడానికా? 

130వ సవరణ రాజకీయ శుద్ధికా లేక రాజ్యాంగ మౌలికాంశాలనే మార్చడానికా?  130వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపక్షాల ప్రభుత్వాలను కూల్చడానికేనా?  రాష్ట్ర ప్రభుత్వాలు ఇక గవర్నర్ చేతిలో కీలుబొమ్మలేనా? న్యూ ఢిల్లీ ఆగస్ట్ 20:130వ సవరణ బిల్లు ఆర్టికల్ 75 (కేంద్ర మంత్రులకు సంబంధించిన నిబంధనలు), ఆర్టికల్ 164 (రాష్ట్ర మంత్రులకు సంబంధించిన నిబంధనలు), మరియు ఆర్టికల్ 239AA (దిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన నిబంధనలు)లలో...
Read More...
Local News 

ముల్కనూర్ నూతన ఎస్సైగా రాజు

ముల్కనూర్ నూతన ఎస్సైగా రాజు భీమదేవరపల్లి, ఆగస్టు 20 ప్రజామంటలు :  ముల్కనూర్ నూతన ఎస్సైగా గీసుకొండ పోలీస్ సషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ రాజు రానున్నారు.భీమదేవరపల్లి మండలంలో గత రెండున్నర సంవత్సరాలుగా సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నండ్రు సాయిబాబును వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ కు సాధారణ బదిలీలలో  భాగంగా బదిలీ అయ్యారు. బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ...
Read More...
Local News 

వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ

వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ సికింద్రాబాద్, ఆగస్టు 20 (ప్రజామంటలు): ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా జిహెచ్ఎంసి ఎంటమాలజీ సిబ్బంది బన్సీలాల్ పేట డివిజన్ బోయిగూడ ఐడిహెచ్ కాలనీ లో దోమల అవగాహన ర్యాలీ నిర్వహించారు.  దోమలతో కలుగు వ్యాధులు,  వాటి వ్యాప్తి, నివారణ పై స్థానికులకు అవగాహన కల్పించారు . ర్యాలీలో గాంధీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్  డాక్టర్...
Read More...
National  Filmi News  State News 

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత  వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు పబ్లిక్ పాలసీ ముసాయిదాను సమర్పించండి - కోర్ట్ ఆదేశాలు  సినిమాల్లో మహిళలకు సమానత్వ చట్టం పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత (intersectional) వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు లో న్యాయమూర్తులు మౌఖిక సూచన చేశారు వినోద పరిశ్రమలో మహిళల రక్షణ కోసం సమానత్వ చట్టాన్ని రూపొందించేటప్పుడు సంబంధితిత" అంశాలను కూడా...
Read More...
Local News  State News 

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి 

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి  మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘన నివాళులు  దేశ సమగ్రతను కాపాడేందుకు ఆయన ప్రాణాలర్పించారు - రేవంత్ రెడ్డి  హైదరాబాద్ ఆగస్ట్ 20 (ప్రజా మంటలు): పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికతను జోడించాలని ఆనాడు రాజీవ్ గాంధీ ఆలోచన చేశారని,18 ఏండ్లు నిండిన వారికి ఓటు హక్కును కల్పించి దేశ భవిష్యత్ ను నిర్ణయించే అవకాశం...
Read More...
Local News 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇందిరా భవన్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలు జగిత్యాల ఆగస్ట్ 20 ( ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇందిరా భవన్ లో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు...
Read More...
Filmi News  State News 

వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్

వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్ ఎందరో నటులు సినీరంగం నుండి రాజకీయాల్లోకి - అదేబాటలు సుమన్ విజయవాడ ఆగస్టు 20: 2029 లో సుమన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పోటీ పోటీచేస్తానని ప్రకటించారు.ఇక తాజాగా సినీ హీరో సుమన్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో స్వతంత్ర సమరయోధులు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణకు హాజరయ్యారు. ఈ సభలో మాట్లాడిన సుమన్ తన...
Read More...
National  State News 

ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు

ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని స్వాగతించిన చిన్నారెడ్డి గారు హైదరాబాద్ ఆగస్ట్ 20 (ప్రజా మంటలు): భారత దేశ ఉప రాష్ట్రపతి ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి పేరును ప్రకటించడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.  ప్రస్తుతం దేశంలో...
Read More...