ఇది బీసీల ఆత్మగౌరవ పోరాటం - 42% బిసి బిల్లు ఆమోదించాలని దీక్ష - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం రావాలి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ ఆగస్ట్ 04:
బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి అనేక పోరాటాలు చేసిందనీ, కాంగ్రెస్ హామీ ఇచ్చిన, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన మేర, 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ తో ఈరోజు నుండి 72గంటల పాటు దీక్ష చేస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు.
ముందుగా అనుకున్నట్లే ఈరోజు ఉదయం 10.30 లకు కవిత, ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్ లో దీక్ష ప్రారంభించారు.
ఈసందర్భంగా అక్కడ చేరిన వేలాదిమంది అభిమానులను, కార్యకర్తలను, బిసి నాయకులను, కుల సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ, సబ్బండవర్గాలు బాగుండాలని తెలంగాణ తెచ్చుకున్నాము. తెలంగాణ వచ్చాక అనేక పనులు చేసుకున్నాము. తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం రావాలనీ అన్నారు.
సమాజంలో సగం జనాభా బీసీలు ఉన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని వెంటపడుతున్నాం. తెలంగాణ జాగృతి పోరాటాలతో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై అసెంబ్లీలో బిల్లు పెట్టారు
సావిత్రిభాయి పూలే జయంతిని ఉమెన్స్ టీచర్స్ డే గా ప్రకటించారు.జ్యోతిభా పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టమంటే ప్రభుత్వం ట్యాంక్ బండ్ పై పెట్టింది. ఈ రోజు జరిగేది బీసీల
ఆత్మగౌరవ పోరాటం
ముస్లిం 10 శాతం రిజర్వేషన్లకు ప్రత్యేకంగా బిల్లు ఆపెడతామని కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వాలి.ముస్లింలకు 10శాతం ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నాం.
బీజేపీ అప్పుడు ఏం చేస్తుందో చూద్దాం.బీజేపీ కేంద్ర ప్రభుత్వం,గవర్నర్ సంతకం పెట్టకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తాము
ఉమ్మడి ఏపీలో అంబేద్కర్ విగ్రహం కోసం 48 గంటలు దీక్ష చేశాము. ఆంధ్రా వాళ్ళ కంటే మీరు పాపం అయ్యారా...?
తెలంగాణలో ధర్నా చౌక్ లు ఓపెన్ చేశామని సీఎం ఢిల్లీలో గప్పాలు కొడుతున్నారు.తెలంగాణ జాగృతి దీక్షకు పర్మిషన్ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు భయం
ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద 72గంటలు దీక్ష చేయడానికి
ప్రభుత్వం మాకు అనుమతి ఇవ్వాలి.బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలు అంతా ఏకంకావాలి
రెండు ఏళ్లనుంచి ఊర్లల్లో సర్పంచులు,ఎంపీటీసీలు ఉన్నారా.బీసీలకు హక్కులు వచ్చాకే స్థానికసంస్థల ఎన్నికలు జరపాలి
బీసీ రిజర్వేషన్ల కోసం తమిళనాడులో 9 సంవత్సరాలు స్థానికసంస్థల ఎన్నికలు జరగలేదు. తమిళనాడు పట్టుపట్టడంతోనే బీసీ రిజర్వేషన్లు సాధ్యంఅయ్యాయి. తెలంగాణ జాగృతి ఎప్పుడూ శాంతియుతంగానే దీక్షలు చేసింది.72 గంటలు పర్మిషన్ ఇవ్వకుండా నన్ను తీసుకువెళ్లి పోలీసు స్టేషన్ లో పెట్టినా,హాస్పిటల్ లో పెట్టినా,ఇంటి దగ్గర పెట్టినా అక్కడే దీక్ష చేస్తాను
రాజకీయ పార్టీలు ఏం మాట్లాడినా పట్టించుకోకుండా బీసీ రిజర్వేషన్ల సాధనకోసం బీసీలు ఏకం కావాలి. 72గంటల నిరాహారదీక్షకు దిగిన జాగృతి అధ్యక్షురాలు కవిత
బీసీ రిజర్వేషన్లు సాధనే లక్ష్యంగా ఎమ్మెల్సీ కవిత నిరాహారదీక్ష. బీసీల హక్కులు సాధించేవరకు 72గంటల దీక్షను కొనసాగిస్తాను
హాస్పిటల్ తీసుకెళితే హాస్పిటల్లో.. ఇంటికి తీసుకెళితే ఇంట్లో దీక్ష చేస్తాను.బీసీల హక్కులు సాధించేవరకు దీక్ష విరమించను.బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ జంతర్ మంతర్ లో సైతం దీక్షకు దిగుతాం
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే.నాది రాజకీయ పోరాటం కాదు.. బీసీల ఆత్మగౌరవ పోరాటం.గాంధీ చెప్పిన అహింసా మార్గంలోనే 42శాతం రిజర్వేషన్లు సాధిస్తాం*
కేంద్రంపై నెపాన్ని నెట్టి కాంగ్రెస్ చేతులు దులుపుకోచాలని చూస్తుంది.రిజర్వేషన్లు రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారమని బీజేపీ చెప్తుంది.
బీసీ, ముస్లిం రిజర్వేషన్లు వేర్వేరుగా ఉండాలి
కేంద్రంలో ఉన్న బీజేపీ సంతకాలు పెట్టడం లేదని బీసీలను కాంగ్రెస్ మోసం చేయవద్దు.బీసీలకు హక్కులు వచ్చాకనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి.
ముస్లింలకు 10శాతం రిజర్వేషన్లు ప్రత్యేకంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించాలి
More News...
<%- node_title %>
<%- node_title %>
“కథ చెబుతా వింటారా” కథల పోటీ
హనుమకొండ, మే 30 (ప్రజా మంటలు):తెలుగు భాషపై చిన్నారుల్లో మక్కువ పెంపొందించడంతో పాటు, అమ్మభాషైన తెలుగును గౌరవించే భావనను పెంచేందుకు హనుమకొండకు చెందిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. “కథ చెబుతా వింటారా” పేరుతో కథల చెప్పే పోటీని నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ మంజుల సాగంటి ఒక... ఎసిబి వలలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్
హైదరాబాద్ మే 30 (ప్రజా మంటలు):
ఏసీబీ వలలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ చిక్కారు. లంచం కేసులో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ బత్తుల మహేందర్ శనివారం అరెస్ట్ అయ్యారు.ఎసిబి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ డీఎస్పీ కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సైబర్ మోసం కేసులో కుటుంబ... రైతు డిస్కమ్‌తో రైతాంగాన్ని నాశనం చేసే కుట్ర : కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు
హైదరాబాద్ మే 29 (ప్రజా మంటలు):హైదరాబాద్‌లో జరిగిన రైతు డిస్కమ్ పబ్లిక్ హియరింగ్‌లో తెలంగాణ రక్షణ సేన చీఫ్ Kalvakuntla Kavitha ప్రభుత్వం తీసుకొస్తున్న రైతు డిస్కమ్ వ్యవస్థపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల అనుమతి లేకుండా విద్యుత్ సంస్కరణల పేరుతో వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. డిస్కమ్‌లకు ప్రభుత్వం... కొనసాగుతున్న ఉచిత బాస్కెట్‌బాల్ శిక్షణ శిబిరం
జగిత్యాల మే 28 (ప్రజా మంటలు)స్కిర్మిష్ బాస్కెట్‌బాల్ ఆధ్వర్యంలో జగిత్యాల స్వామి వివేకానంద మినీ స్టేడియం లో ప్రతిరోజు ఉచిత బాస్కెట్‌బాల్ శిక్షణ శిబిరం ఎంతో ఉత్సాహంగా కొనసాగుతోంది. కోచ్ శ్రీరామ్ ఆధ్వర్యంలో, జిల్లా యువజన మరియు క్రీడాశాఖ అధికారి ( డి వై ఎస్ ఓ )డా. రవికుమార్ సహకారంతో పాటు
శారీరక... సబ్బండ తెలంగాణ వర్గాల గతి మార్చే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, మే 28 (ప్రజా మంటలు):
సబ్బండ తెలంగాణ వర్గాల గతి మార్చే అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్నామని, అది రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోడ జనార్దన్ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బంజారాహిల్స్‌లోని... ఘనంగా ముగిసిన శ్రీమద్ భాగవత సప్తాహం
జగిత్యాల మే 28(ప్రజా మంటలు)జగిత్యాల పట్టణం గీత భవన్ లో గత ఏడు రోజులుగా ఖండవల్లి ఆదిత్య శర్మచే భాగవత సప్తాహం కొనసాగుతుండగా గురువారం ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ద్వాదశ అక్షర శ్రీమద్ భాగవత జ్ఞాన యజ్ఞం నిర్వహించారు. ఆదిత్య శర్మ పలశృతి వివరిస్తూ జనన మరణాల చక్రంలో జారకుండా ఉండడానికి... జగిత్యాల పట్టణంలో అందరిని అలరిస్తున్న ఎగ్జిబిషన్
జగిత్యాల మే 28(ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎగ్జిబిషన్ వయోభేదం లేకుండా అందర్నీ అలరిస్తుంది .జిల్లాలోని గ్రామాల నుండి సైతం చూడడానికి కుటుంబాల వారితో కలిసి ఎగ్జిబిషన్ లో ఉన్న ప్రదర్శనలను తిలకిస్తూ ఆనంద వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తాజ్ మహల్ తో పాటు జలకన్య ప్రత్యేక ఆకర్షణగా చూపరులను ఆకట్టుకుంటుంది.
అంతేకాకుండా పెద్దపులి... తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
హైదరాబాద్ మే 28 (ప్రజా మంటలు):
తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు నిరంతర హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందించేందుకు అమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ (ABP) అమలుపై ముఖ్యమంత్రి A. Revanth Reddy కేంద్ర సమాచార శాఖ మంత్రి Jyotiraditya Scindiaతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి Duddilla Sridhar Babu... తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తుపై మహారాష్ట్రతో చర్చలకు తెలంగాణ అడుగు
హైదరాబాద్, మే 28 (ప్రజా మంటలు):
తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు, నిర్మాణ అంశాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి A. Revanth Reddy మహారాష్ట్ర ముఖ్యమంత్రి Devendra Fadnavis కు లేఖ రాశారు. తెలంగాణ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయం కేటాయించాలని, త్వరలో అనుకూల తేదీ... ఒకే ఒక లోకం” మూవీ మే 29న గ్రాండ్ రిలీజ్.. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహణ
హైదరాబాద్ మే 27:
హైదరాబాద్‌లో “ఒకే ఒక లోకం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ప్రకాశం బుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కొరిటాల రోహిణి సమర్పణలో, కొరిటాల సాయిచౌదరి నిర్మించిన ఈ చిత్రానికి వై.విష్ణునారాయణ దర్శకత్వం వహించారు. సినిమా మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో తెలుగు... సర్వేలతో సర్కార్ కాలయాపన – అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని టీఆర్ఎస్ నేతల విమర్శ
హైదరాబాద్, మే 27 (ప్రజా మంటలు):
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా సర్వేల పేరుతో కాలయాపన చేస్తోందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర నాయకులు విమర్శించారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, ఆర్వీఆర్ ప్రసాద్, లోక రవిచంద్ర ప్రభుత్వ పనితీరుపై... లోక్ భవన్లో గవర్నర్‌ను కలిసిన కల్వకుంట్ల కవిత – భూ బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి
హైదరాబాద్, మే 26 (ప్రజా మంటలు):
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మంగళవారం హైదరాబాద్‌లోని లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేత బాధితులు, ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులు, పరిగి మండలం కడ్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రభావితుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.ఈ సమావేశంలో ధర్మ... 