నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్: 316 వాహనాలు సీజ్: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల జులై 11 ( ప్రజా మంటలు)
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ నంబర్ లేని, నంబర్ ప్లేట్ దాచి,కొన్ని నంబర్లు తొలగించిన వాహనాలను గుర్తించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది వివిధ టీంలు గా ఏర్పడి ఏక కాలంలో ముమ్మర తనిఖీ లు చేసారు.
వాహనాల తనిఖీ చేయగా ఇందులో సరైన నెంబర్ ప్లేట్స్ లేని 316 వాహనాలను సీజ్ చేయడం జరిగింది. నెంబర్ ప్లేట్స్ సరిగా లేని వాహనాలను, నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి వాటికి సరైన నెంబర్ ప్లేట్లను బిగించిన తర్వాత వాహనాలను విడిచి పెట్టడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... నిబందనలకు విరుద్దంగా , ఇష్టారీతిన వాహన నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేయడం కొందరు వాహనదారులు ట్రాఫిక్ ఈ చలాన్ నుంచి తప్పించుకోవడం కోసం వాహనాలపై ఫ్యాన్సీ నంబర్ తో పాటు తప్పుడు నంబర్ లు సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయా నంబర్ ప్లేట్లపై వివిధ ఆకారాలు, డిజైన్లు, పదాలు, అక్ష రాలు గుర్తించలేనంతగా ఉంటున్నాయి. కొందరు కావాలనే వాటిని తొలగించడం, నంబర్ గుర్తించకుండా నెంబర్ ప్లేట్ విరగ్గొట్టడం చేస్తున్నారు.
ఇలాంటి వారు వాహన తనిఖీల్లో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కావున జిల్లా పరిదిలోని ప్రజలు అందరు పోలీస్ వారికీ సహకరించి తమ వాహనాల నెంబర్ ప్లేట్స్ నిబందనల ప్రకారం బిగించు కోవాలని, లేని పక్షం లో వాహనాలపై నంబర్ లేకుండా, నిబందనలకు విరుద్దంగా నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసి వాహనం నడిపితే వాహనదారుడి పై ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని సూచించారు.
నెంబర్ ప్లేట్ లేని వాహనాలను ఉపయోగించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న దృష్ట్యా ఈ యొక్క తనిఖీలు నిరంతర నిర్వహించడం జరుగుతుందని కావున జిల్లా పరిదిలోని ప్రజలు అందరు పోలీస్ వారికీ సహకరించాలని కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల పట్టణంలో విద్యానగర్ లో 11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్
1.jpeg)
రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి. జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.

మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి కుంకుమార్చన

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి
