ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు
గురు పౌర్ణమి సందర్బంగా భక్తుల రద్దీ
సికింద్రాబాద్ జూలై 10 (ప్రజామంటలు) :
పద్మారావునగర్ లోని శ్రీసాయి కుమార్ వ్యాధి నివారణ ఆశ్రమ్ లోని శ్రీసాయిబాబా ఆలయంలో గత వారం రోజుల నుంచి నిర్వహిస్తున్న శ్రీసాయి సప్తాహ వేడుకలు గురువారం తో ముగిశాయి. చివరి రోజున ఉదయం శ్రీసాయి కుంభాభిషేకం,శ్రీసాయి విభూతి సేవ,సాయంత్రం మహామృత్యుంజయ హోమం నిర్వహించారు. సద్గురు శ్రీసాయి కుమార్ జీ భక్తులనుద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. సత్సంగ్ లో ఆలయ ఉత్తరాధికారి శ్రీకీర్తిమా, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.
:
గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం శ్రీసాయి బాబా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ఉదయం నుంచి వందలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి, బాబా ను దర్శించుకొని, పూజలు చేశారు. అన్నదానం నిర్వహించారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్, రాష్ర్ట మాజీ మంత్రి, ఎన్డీఎమ్ఏ మాజీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డిలు ఆలయాన్ని సందర్శించి, బాబా ఆశీస్సులు తీసుకున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల పట్టణంలో విద్యానగర్ లో 11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్
1.jpeg)
రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి. జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.

మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి కుంకుమార్చన

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి
