జీలుగుల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను సందర్శించిన రాష్ట్ర టిబి పరిశీలనా బృందం
243 మందికి ఆరోగ్య పరీక్షలు – 12 మందికి ఎక్స్‌రే, 19 మందికి తెమడ పరీక్షలు
ఎల్కతుర్తి జూన్ 13 (ప్రజామంటలు) :
"టిబి ముక్త్ భారత్" అభియాన్‌లో భాగంగా జూన్ 13న జీలుగుల గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 243 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా, 19 మందికి తెమడ (CBNAAT) పరీక్షలు, 12 మందికి ఎక్స్‌రే పరీక్షలు చేశారు.
ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి టిబి మానిటరింగ్ బృందం సభ్యుడు డాక్టర్ విష్ణు ఆదిత్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "2025 నాటికి టిబి నిర్మూలన లక్ష్యంగా ప్రతి ఒక్కరు టిబి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ఇది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి బాధ్యత," అన్నారు.
స్థానిక వైద్యాధికారి డాక్టర్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ, "క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రజల సహకారం ఎంతో అవసరం. ప్రతి ఒక్కరూ టిబిపై అవగాహన పెంచుకోవాలి," అని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాహితీ, హెల్త్ సూపర్వైజర్ సంపత్ రెడ్డి, స్థానిక ఏఎన్ఎం రెటా, టిబి నివారణ విభాగానికి చెందిన సిబ్బంది సతీష్, సుష్మ, నగేష్‌తో పాటు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆషాడ జాతర ఉజ్జయిని టెంపుల్ హుండీల లెక్కింపు

పుప్పాల గూడ భూములపై విచారణకు లోకాయుక్త ఆదేశం

రోడ్డు ప్రమాద బాధితుడికి 1.52 లక్షలు సాయం.

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

కొడంగల్ - నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో ఎమ్మెల్సీ కవిత

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పట్టదారుల వివరాలను పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలి.. రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్ కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు

సృష్టి కేసులో ఐదు రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత

న్యూ ఢిల్లీలో లండన్ వెళ్లాల్సిన విమానం నిలిపివేత - ఆందోళనలో ప్రయాణికులు

పలు గ్రామాలకు నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి -: మంత్రి లక్ష్మణ్ కుమార్

జర్నలిస్టు సంఘ నాయకులను సన్మానించిన ఐఎంఏ వైద్యులు
