బ్రెయిన్ ట్యూమర్ పేషంట్లకు ఎండోస్కోపిక్ విధానం ఓ వరం
రాష్ర్ట ఆరోగ్య శాఖ కార్యదర్శి డా.క్రిస్టినా జెడ్ చోంగ్తు
యశోదా హాస్పిటల్ లో స్కల్ బేస్ ఎండోస్కోపి సమ్మిట్
సికింద్రాబాద్ ఏప్రిల్ 26 (ప్రజామంటలు) :
తెలుగు రాష్ర్టాలలో బ్రెయిన్ ట్యూమర్ రోగులకు న్యూరో ఎండోస్కోపిక్ , ఎండోస్కోపీ ద్వారా నిర్వహించబడే నాడీ సంబందిత బ్రెయిన్ సర్జరీలకు యశోద హాస్పిటల్స్ భారతదేశంలోనే మొటమొదటి రోబోటిక్ న్యూరో సర్జరీ ఆండ్ న్యూరో ఎండోస్కోపిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఒక చక్కని వేధిక అవుందని తెలంగాణ రాష్ర్ట ఆరోగ్య శాఖ కార్యదర్శి డా.క్రిస్టినా జెడ్ చోంగ్తు అన్నారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ లో నిర్వహిస్తున్న రెండు రోజుల స్కల్ బేస్ ఎండోస్కోపీ సమ్మిట్–2025 ను శనివారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మెదడు, వెన్నముక శస్ర్త చికిత్సలలో న్యూరో ఎండోస్కోప్ గత రెండు దశాబ్దాలలో గణనీయమైన పురోగతిని సాధించిందని, దాని మినిమల్లీ ఇన్యాసివ్ (అతి తక్కువ కోత) విధానం, హై రిజల్యూషన్, వ్యాధిని పూర్తిగా తగ్గించే సామర్ద్యం, రోగి త్వరగా కోలుకోవడం వంటివి ఈ అత్యాధునిక రోబోటిక్ న్యూరో సర్జరీ ఆండ్ న్యూరో ఎండోస్కోపీ సర్జరీల యొక్క ప్రత్యేకతలు అవని ఆమె పేర్కొన్నారు.
యశోద హాస్పిటల్స్ సీనియర్ న్యూరో సర్జన్ ఆండ్ స్కల్ బేస్ ఎండోస్కోపి సమ్మిట్ కన్వీనర్, డాక్టర్ ఆర్.అయ్యదురై మాట్లాడుతూ..ఈ సమ్మిట్ భారతదేశంలోనే న్యూరో సర్జరీ రంగంలో నిర్వహించబడిన మొట్టమొదటి అంతర్జాతీయ స్కల్ బేస్ ఎండోస్కోపి సమ్మిట్ లైవ్ వర్క్ షాప్ అని అన్నారు. వైద్య రంగంలో రోబోటిక్ సహాయం ఒక గొప్ప వరంలా మిగిలిపోతుందన్నారు.
ముఖ్యంగా మెదడు సర్జరీల కోసం ఉద్దేశించిన రోబోటిక్ వ్యవస్థ చాలా సున్నితమైనదని, ఇది శస్ర్తచికిత్స యొక్క భద్రతను అసమానమైన స్థాయికి పెంచుతుదన్నారు.యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, యూనిట్ హెడ్ డాక్టర్ విజయ్ కుమార్ తదితరులు మాట్లాడారు. ఈ సమ్మిట్ లో పలువురు డాక్టర్లు, ఆయా విభాగాల వైద్య నిపుణులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రావి నారాయణ రెడ్డికి తెలంగాణలో సముచిత స్థానం కల్పిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
భూమి–భుక్తి–వెట్టిచాకిరి విముక్తి పోరాట వీరుడికి ప్రభుత్వ గౌరవం
హైదరాబాద్ ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన సమరయోధుడు రావి నారాయణ రెడ్డికి తెలంగాణ సమాజంలో ప్రభుత్వం సముచితమైన స్థానం కల్పిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రావి నారాయణ రెడ్డి చరిత్రను పాఠ్యాంశాల్లో... హుస్నాబాద్ పట్టణాన్ని రాష్ట్రంలో రోల్ మోడల్ చేస్తా - పొన్నం
హుస్నాబాద్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, ఫిబ్రవరి2,(ప్రజా మంటలు):
ఈనెల 11 వ తేదీన జరిగే ఎన్నికల్లో హుస్నాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని 20 లోస్థానాలు గెలిపించి తనకు మరింత బలాన్ని ఇవ్వాలని హుస్నాబాద్ పట్టణంను ప్రత్యేక ప్రణాళిక ద్వారా అభివృద్ధి చేస్తున్నామని ,గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఒక్క డబుల్... లయన్స్ క్లబ్, లీడ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమం
గొల్లపల్లి, ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో సోమవారం లయన్స్ క్లబ్ గొల్లపల్లి, లీడ్ ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మోటివేటివ్ స్పీకర్ కెప్టెన్ డా. లయన్ బుర్ర మధుసూదన్ రెడ్డి విద్యార్థుల్లో ఉత్సాహం, ఆత్మవిశ్వాసాన్ని నింపారు.... అంగరంగ వైభవంగా బుగ్గారం పోచమ్మల జాతర – రథోత్సవం
బుగ్గారం / గొల్లపల్లి ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో సోమవారం శ్రీ ముత్యాల పోచమ్మ – నల్ల పోచమ్మల జాతర, రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ జిల్లాలతో పాటు అంతర్రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తజనం తండోప తండాలుగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు.
ఆలయ కమిటీ చైర్మన్... మొదటిరోజు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతం
జగిత్యాల ఫిబ్రవరి 2 ( ప్రజా మంటలు)జిల్లాలో సోమవారం 17 (జనరల్ మరియు ఒకేషనల్) పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల్లో భాగంగా ఈరోజు జరిగిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ రోజు జరిగిన ప్రాక్టికల్ పరీక్షలలో ఉదయం 1409 మంది విద్యార్థులకు గాను 1312 మంది విద్యార్థులు హాజరైనారు.
జనరల్ విభాగంలో... గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ఫిబ్రవరి 2 ( ప్రజా మంటలు)బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం
ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 7గురు అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్... పెట్టుబడుల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
మహిళలకు భద్రత లేదు – గన్ కల్చర్ పెరుగుతోంది
పెట్టుబడులపై Fact Check
(వివరాలు కింది టేబుల్ లో)
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం
ఫోన్ ట్యాపింగ్ కేసు – పారదర్శక విచారణ జరగాలి
హైదరాబాద్, ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తున్న వేల కోట్ల పెట్టుబడులు కట్టుకథలేనని తెలంగాణ జాగృతి... అభ్యర్థి మంచోడా చెడ్డోడా కాదు – ప్రజలకు ఉపయోగపడేవాడే ముఖ్యం : కవిత
మహిళలకు భద్రత లేదు – గన్ కల్చర్ పెరుగుతోంది
హైదరాబాద్ ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):
మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థి మంచోడైనా చెడ్డోడైనా కేసీఆర్ ను చూసి ఓటు వేయాలని కేటీఆర్ కోరుతున్నారని కవిత విమర్శించారు.ఇది బీఆర్ఎస్లోని రాజరిక, నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు.
ఈరోజు జాగృతి ఆఫీస్ లో పాత్రికేయులతో మాట్లాడుతూ, కులం, మతం,... అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్-XII విజయవంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జిల్లా లో 37 మoది బాల కార్మికులకు విముక్తి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల ఫిబ్రవరి 1 ప్రజా (మంటలు)బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, మరియు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం... 44 వ వార్డులో బిజెపి అభ్యర్థికి మద్దతుగా డా. భోగ శ్రావణీ ప్రచారం
జగిత్యాల ఫిబ్రవరి 1 ( ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికలలో భాగంగ జగిత్యాల పట్టణంలోని 44వ వార్డ్ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆర్మూర్ పద్మ-శ్రీకాంత్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా .బోగ శ్రావణి
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముద రాజు, బీజేవైఎం... కంటోన్మెంట్ బోర్డు విలీన పోరాటానికి JAC సన్నాహక సమావేశం
సికింద్రాబాద్, ఫిబ్రవరి 01 (ప్రజా మంటలు):
కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలనే డిమాండ్‌తో ఆదివారం బాలంరాయిలోని లీ ప్యాలెస్‌లో జేఏసీ (జాయింట్ యాక్షన్ కమిటీ) ఏర్పాటు సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది. ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు నియోజకవర్గంలోని కాలనీ అసోసియేషన్ సభ్యులు, బస్తీల... 