డబుల్ బెడ్రూం ఇళ్లు లబ్ధిదారుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కు మాజీ కౌన్సిలర్ జయశ్రీ ఫిర్యాదు
(వనమాల గంగాధర్)
జగిత్యాల ఎప్రిల్ 24 (ప్రజా మంటలు):
ఇందిరమ్మ కమిటీల గురించి మరియు డబుల్ బెడ్రూంల క్రింద, గతంలో ఇచ్చిన స్థలం పోయిన వారి సమస్యలు పరిష్కరించి అర్హులైన వారి పేర్లను ఆన్లైన్ లో పెట్టడానికి సర్వే కూడా చేయడంలేదని, వెంటనే వీటిని గుర్తించి, ఆన్లైన్ లో పెట్టాలని మాజీ కౌన్సిలర్ హనుమాండ్ల జయశ్రీ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు..
ఇంకా, ఇందిరమ్మ ఇండ్లకు సంబందించి ప్రతి గ్రామాన, ప్రతి వార్డు యందు ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారులను గుర్తించి వచ్చిన వాటిని అధికారుల కమీటీ ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్క అర్హునికి లబ్దిచెంది విధంగా రూపకల్పన చేస్తే, జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి పట్టణంలో ఇప్పటి వరకు ఒక్క ఇందిరమ్మ కమిటీ కూడ వేయలేదు. లబ్దిదారుల ఎంపిక ఏ విధంగా చెస్తారు? అని ఆమె ప్రశ్నించారు.
పట్టణానికి, జగిత్యాల నియోజకవర్గంకు జిల్లా పంచాయతీ అధికారి మదన్ మోహన్ ను ప్రత్యేక అధికారి గా నియమిస్తూ క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని చెప్పారు. కాని, ఇప్పటి వరకు జగిత్యాల పట్టణంలో లబ్దిదారుల ఎంపికకు సంబందించిన వివరాలు సేకరించలేదు. వెంటనే ఇందిరమ్మ కమిటీలను వార్డు వారిగా నియమించి క్షేత్ర స్థాయిలో లబ్దిదారుల పేర్లను సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని జయశ్రీ కోరారు.
గతంలో కేటాయించిన. ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు కేటాయించిన వారి భూములు తీసుకొన్నా ఇళ్లు కేటాయించలేదు
గతంలో రెండు పడుకల ఇండ్ల నిర్మాణం లో భాగంగా అంతకు ముందు ఇందిరమ్మ ఇంటి స్థలాలకు సంబందించిన దాదాపు " 1700 మంది " స్థలాలను తీసుకొని అ స్థలం లోనే ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. అక్కడ ఎవరి స్థలాలు కోల్పోయారు అన్న విషయం అధికారులు కూడ పూర్తి స్దాయి వివరాలు ఇవ్వలేక పోయారు. మాకు (కౌన్సిలర్ లకు) ఒక దాదాపు " 800 మంది " కి సంబందించిన లబ్దిదారుల వివరాలు ఇస్తే మేము కొంత మంది లబ్దిదారులను గుర్తించి అప్పుడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకు వెళ్ళితే వాళ్ళను ఆన్లైన్ చేయించమన్నారు. మేము చేయించాము కాని కొంతమందికి తెలియక స్థలం కోల్పోయిన లబ్దిదారులు ఇంకా M.R.O ఆఫీస్ చూట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. online చేయించిన వారివి కూడ "ఎంక్వైరీ" చేసారు. కాని "డబుల్ బెడ్రూం" ఇండ్లు ఇవ్వలేదు. గతంలో గౌరవ M.LA గారు కూడ స్థలం కోల్పోయిన ప్రతి ఒక్క లబ్దిదారుడ కి "డబుల్ బెడ్రూం" మంజూరు చేస్తాం అన్నారు. కాబట్టి వెనువెంటనే మిగిలిన 700 డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబందించి మొదటి ప్రాధాన్యతగా తీసుకొని స్థలం కోల్పోయిన వారికి డబుల్ బెడ్రుం ఇండ్లు ఇచ్చిన పిదప మిగిలిన వాటికి కొత్తగా దరఖాస్తు చేసుకొన్న ఎంక్వైరీ పూర్తయిన లబ్బిదారుడికి ఇవ్వాలని ఆమె కోరారు..
నూక పెల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి సంబందించిన స్థలంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ స్థలాలలో ఇప్పటికి ఇంకా పూర్తిస్థాయి ఇల్లు కట్టుకోలెక వదిలిన స్థలాలు మరియు కొంత మంది రేకులతో నిర్మాణం ఈ విధంగా రకరకాలుగా ఉన్న స్థలంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మోడల్ ఇంటినిర్మాణం' చేపట్టి ప్రతి ఒక్క లబ్దిదారుడికి అందేటట్లు గా ప్రభుత్వంకు లేఖ రాసి ప్రతి ఒక్కరి కళను నేరవేర్చే విధంగా చూడాలని హనుమండ్ల జయశ్రీ కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం..

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మీ భేటి

ధర్మపురి మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్

చదువుతోపాటు సంస్కారం అందించాలి -గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక"*

జగిత్యాలలో ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ

ధరూర్ క్యాంప్ ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు

సిరిసిల్ల TV9 రిపోర్టర్ ప్రసాద్ మృతి

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు
