శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు
జగిత్యాల మార్చి 19(ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రతిష్టించిన, గోవింద మాంబ సమేత శ్రీమద్విరాట్ జగద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవాలయం లో షష్టమ సంవత్సర వార్షికోత్సవాల్లో భాగంగా,శ్రీ గోవింద మాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం మహా వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి పోతులూరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి 8వ తరం వారసులు శ్రీ వీరభద్ర స్వామి, లక్ష్మి భ్రమరాంబిక,దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేసి కళ్యాణం జరిపించారు. అరవింద్ నగర్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం నుండి ఎదురుకోళ్లు కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో వందలాదిమంది మాత లు కోలాటాలు,వేస్తూ, నృత్యాలు చేస్తూ, ఉత్సవమూర్తులను ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపైకి చేర్చారు. ఆలయ ప్రధాన అర్చకులు ఎదులాపురం సదాశివ ఆచార్యులు, కళ్యాణ కార్యక్రమ క్రతువు బ్రహ్మశ్రీ శ్రీపాద లక్ష్మీనరసింహ శాస్త్రి,,కార్యక్రమం నిర్వహించారు. ఈనాటి కార్యక్రమానికి ప్రముఖ జ్యోతిష్య,పౌరాణిక,వేద, పండితులు శ్రీ మాన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక, వేంచేసి మంగళ శాసనాలు అందించారు.
ఈనాటి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పి చైర్పర్సన్ దావ సంత, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గిరి నాగభూషణం, మరియు విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు టీవీ సత్యం, టీవీ సూర్యం, పట్టణ జిల్లా మహిళా అధ్యక్షులు గాజోజు రాధ, సంకోజు లక్ష్మి, పట్టణ అధ్యక్షులు సంకోజి రమణ, రామస్వామి, నిరంజనా చారి, మేడం పెళ్లి శ్రీనివాసు, కత్రోజి శ్రీనివాస్,కంపోజి నారాయణ,మద్దుల పల్లి సత్యం, భూమయ్య, గంగారాం, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)