విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి డిఆర్డి ఎపిడి రఘువరన్
మల్యాల /కొండగట్టు మార్చి 15(ప్రజా మంటలు)
విద్యతో పాటు యువత క్రీడల్లో ముందుండాలని డి ఆర్డి ఏ పిడి రఘువరన్ అన్నారు.
నెహ్రూ యువ కేంద్ర,భారత ప్రభుత్వము క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ.
నెహ్రు యువ కేంద్ర సంఘటన ఆదేశాల మేరకు నెహ్రూ యువ కేంద్ర జగిత్యాల్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లాస్థాయి యువ ఉత్సవ్ కార్యక్రమం జె ఎన్ టీ యూ కొండగట్టు లో నిర్వహించబడింది.
ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డి అర్ డి ఏ పిడి రఘువరన్ మాట్లాడుతూ
కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయి యువ ఉత్సవ్ వేడుకలు చేసుకుంటున్నామని, ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల పోటీలు కూడా నెహ్రు యువ కేంద్ర జగిత్యాల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని, ఈ పోటీలలో పాల్గొంటున్న యువతీ యువకులకు అభినందనలు తెలియజేశారు.
ప్రపంచంలోనే భారత దేశము భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అని అన్నారు, ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశమని యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యపడుతుందని అన్నారు. నేటి యువకులు మంచి విద్యతోపాటు ఆరోగ్యానికి ఉపయోగపడే క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు సంగీతము యోగా లాంటి అంశాలలో కూడా పాల్గొనాలని అన్నారు.నేటి యువత క్రమశిక్షణతో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని కష్టపడితే అనుకున్నది సాధించి వారి కుటుంబానికి దేశానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా తయారవుతారని అన్నారు
.ఈ యువ ఉత్సవ్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రఘువరన్ గారు డిపి డిఆర్ఓ వివిధ పోటీలలో గెలుపొందిన ప్రధమ, ద్వితీయ, తృతీయ అభ్యర్థులకు సర్టిఫికెట్స్ మెమొంటోస్ మరియు నగదు బహుమతులను అందజేసినారు.యువత ఇలాంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర జగిత్యాల్ జిల్లా యువజన అధికారి ఏం వెంకట్ రాంబాబు జిల్లా యువజన ఉత్సవాల గురించి వివరించడం జరిగింది.అదే మాదిరిగా నెహ్రూ యువ కేంద్ర కార్యక్రమాలను వివరించినారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో 21 మంది వివిధ పోటీలకు సంబంధించిన జడ్జీలు, ఎన్ఎస్ఎస్ అధికారులు, ఎన్ ఎస్ ఎస్ క్యాన్డేట్స్, ఎన్ వై కే వాలంటీర్స్, 300 మంది విద్యార్థినీ విద్యార్థులు యువతి యువకులు పాల్గొనడం జరిగింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం..

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మీ భేటి

ధర్మపురి మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్

చదువుతోపాటు సంస్కారం అందించాలి -గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక"*

జగిత్యాలలో ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ

ధరూర్ క్యాంప్ ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు

సిరిసిల్ల TV9 రిపోర్టర్ ప్రసాద్ మృతి

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు
