ధర్మపురి మం నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి
ఢిల్లీ ఫిబ్రవరి 11 ( ప్రజా మంటలు)
తెలంగాణ రాష్ట్రంలోని ధర్మపురి మండలం నేరెళ్లలో జవహర్ నవోదయ విద్యాలయాన్ని సకాలంలో అమలు చేయాలని కేంద్ర విద్య శాఖ మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాన్ కలిసిన ప్రభుత్వ విప్పు లక్ష్మణ్ కుమార్
*కేంద్ర ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయన్ని ధర్మపురి మండలం నేరెళ్లలో మంజూరు చేయగా దాన్ని తరలించకుండ నెరెల్లలోనే యధావిధిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కొనసాగించాలని కోరుతూ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు డిల్లీ లోని కేంద్ర విద్య శాఖ మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాన్ ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపి వంశి క్రిష్ణ మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రాలను అందజేశారు*
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురిలో జవహర్ నవోదయ విద్యాలయ స్థాపనలో భాగంగా నవోదయ విద్యాలయ సమితి నిబంధనల ప్రకారం అన్ని విధివిధానాలను పూర్తి చేయడం జరిగిందని, రాష్ట్ర స్థాయిలో అధికారులకు అనేక అభ్యర్థనలు సమర్పించి, మార్గదర్శకాల ప్రకారం జగిత్యాల జిల్లా ధర్మపురిలోని నేరేళ్ల గ్రామం వద్ద 30 ఎకరాల ప్రభుత్వ భూమిని, రోడ్డు కనెక్టివిటీని గుర్తించి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపడం జరిగిందని,
తెలంగాణ ప్రభుత్వం ధర్మపురికి చెందిన నేరెళ్లతో పాటు (18) జవహర్ నవోదయ విద్యాలయల ఏర్పాటుకు ప్రతిపాదనలను కేంద్రానికి పంపడం జరిగిందని, NVS నోటిఫికేషన్ తేదీ 10.01.2025 ప్రకారం,ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) నేరెళ్లతో సహా తెలంగాణలోని 7 జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడానికి ఆమోదించడం జరిగిందని,
తదనుగుణంగా 2025 విద్యా సంవత్సరంలో పాఠశాల కార్యకలాపాలు ప్రారంభించాలనే లక్ష్యంతో జగిత్యాల జిల్లా కలెక్టర్ నవోదయ విద్యాలయ సమితి నిబంధనల ప్రకారం తాత్కాలిక ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, పై విషయాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్రంలోని ధర్మపురి మండలం నేరెళ్లలో జవహర్ నవోదయ విద్యాలయాన్ని సకాలంలో అమలు చేసేలా సంబంధిత అధికార యంత్రాంగాన్ని ఆదేశించవలసిందిగా కేంద్ర మంత్రి ని కలిసి వారిని కోరడం జరిగిందని, దానిపైన వారు కూడా సానుకూలంగా స్పందించి ఇట్టి విషయాన్ని పరిశీలిస్తామని ఈ సంధర్బంగా తెలిపారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
