దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు
జగిత్యాల ఫిబ్రవరి 11(ప్రజా మంటలు)
300 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన జగిత్యాల రూరల్ మం అంబారి పేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే దేవాలయం వద్ద బోర్డును ఏర్పాటు చేశామని, ఏ మతాన్ని గానీ వ్యక్తులను గానీ కించపరచాలనే ఉద్దేశం తమ గ్రామస్తులకు లేదని అంబారిపేట గ్రామస్తులు స్పష్టం చేశారు.
శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం ముందు అన్య మత ప్రచారం నిషేధం అంటూ బోర్డు ఏర్పాటు చేయగా ఆ బోర్డును తీసివేయాలంటూ ఓ వ్యక్తి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో పోలీసులు ఆ బోర్డును తొలగించాలని గ్రామస్తులపై ఒత్తిడి చేయడంతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు గ్రామస్తులందరూ అధికారుల చర్యలను ఖండించారు.
ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామానికి కొంతమంది క్రిస్టియన్ మత ప్రచారకులు వచ్చి గ్రామానికి చెందిన మహిళలను మతం మారాలంటూ ఒత్తిడి తెచ్చారని, ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వారిని గ్రామం నుండి పంపివేశామని తెలిపారు.
దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రామ సర్పంచ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా పవిత్రమైన దేవాలయం కొండపై గుర్తుతెలియని వ్యక్తులు సిలువ గుర్తు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
ఈ విషయంలో కూడా వివాదం చెలరేగిందని గుర్తు చేశారు. పవిత్రమైన ఆలయం వద్ద అన్యత ప్రచారం, అసాంఘిక కార్యకలాపాలు జరగకూడదనే ఉద్దేశంతో తాము ఈ బోర్డును ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.
గ్రామస్తుల మనోభావాలకు వ్యతిరేకంగా కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇతర మతస్తుల నుండి తమ దేవాలయాన్ని, గ్రామాన్ని రక్షించుకోవడం తమ అందరి బాధ్యత అని ఈ విషయాన్ని అధికారులు అర్థం చేసుకోవాలని కోరారు.
ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘం నాయకులు అక్కడికి చేరుకొని వారికి సంఘీభావం తెలిపిన లింగంపేట శ్రీనివాస్, అంకార్ సుధాకర్, వేముల సంతోష్, జిట్టవేణి అరుణ్ కుమార్ గాజోజు సంతోష్, వారికి సంఘీభావం తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తెలంగాణ ఉద్యమ కవి అందెశ్రీ కన్నుమూత – సాహిత్య లోకానికి, తెలంగాణ భావజాలానికి తీరని లోటు
హైదరాబాద్ నవంబర్ 10 (ప్రజా మంటలు):: తెలంగాణలో విషాదం ఏర్పడింది. ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గీతాల సృష్టికర్త డా. అందెశ్రీ (64) ఇక లేరు. ఆదివారం రాత్రి ఇంట్లోనే ఒక్కసారిగా తీవ్రమైన అస్వస్థతకు గురై కుప్పకూలిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ... ఢిల్లీ విమానాశ్రయంలో GPS సిస్టమ్‌పై కుట్ర?
న్యూఢిల్లీ నవంబర్ 10: దేశ రాజధాని ఢిల్లీ ఇంద్రాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు రోజుల క్రితం జరిగిన భారీ విమాన రద్దులు, ఆలస్యాల వెనుక ఉన్న నిజం బయటపడింది. GPS (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) లో సిగ్నల్ జ్యామింగ్ జరిగిందని దర్యాప్తులో స్పష్టమైంది. దీని కారణంగా 800కిపైగా ఫ్లైట్లు ప్రభావితమైనట్లు అధికారులు ధృవీకరించారు.పైలట్లకు నకిలీ... వివాహేతర అనుమానాలతో భార్యను బ్యాట్‌తో కొట్టి హత్య చేసిన భర్త
చందానగర్ నవంబర్ 10:సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం జరిగిన దారుణ ఘటనతో ప్రాంతం ఒక్కసారిగా కలకలం రేగింది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భర్త తన భార్యను కిరాతకంగా హత్యచేసిన కేసును పోలీసులు నమోదు చేశారు.
గుంటూరు జిల్లాకు చెందిన బ్రహ్మయ్య – క్రిష్ణవేణి(37) దంపతులు కొంతకాలంగా అమీన్పూర్ పట్టణంలోని ... RBI కొత్త నిబంధనలు: బ్యాంక్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నియమాలు — మీకు తెలియాల్సినది
ముంబాయి నవంబర్ 10:
ప్రస్తుతం భారత్‌లో ఎక్కువ మంది బ్యాంక్ ఖాతాలను వినియోగిస్తున్నారు. సాధారణంగా బ్యాంక్ ఖాతాలు రెండు రకాల్లో ఉంటాయి — Current Account మరియు Savings Account. చాలా మంది వారి సేవింగ్స్ ఖాతాల్లో అవసరమైన కనీస బ్యాలెన్స్ (Minimum Balance) ను నిలిపి ఉంచుటలో విఫలవుతున్నారు. ఈ కారణంగా బ్యాంకులు... గోపాల్ గంజ్ లో అదుపు తప్పిన కారు: ముగ్గురికి తీవ్ర గాయాలు – ఉద్రిక్తతతో హింసాకాండ
గోపాల్ గంజ్ నవంబర్ 10:
బీహార్‌లోని గోపాల్గంజ్ జిల్లా ఆదివారం సాయంత్రం భయానక సంఘటనకు వేదిక అయింది. సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో అదుపు తప్పిన ఒక కారు రోడ్డుపై నడుచుకుంటున్న మూడు మందిని ఢీకొట్టి తీవ్రంగా గాయపడేలా చేసింది. ఘటన అనంతరం స్థానికులు వెంటనే గాయపడిన వారిని సదర్ ఆసుపత్రికి తరలించి... బిహార్‌లో ఓటింగ్ ముగిసిన తర్వాత రైళ్లలో భారీ రద్దీ
పాట్నా/ సమస్తిపూర్ నవంబర్ 10:
బిహార్‌లో ఓటింగ్ (వోటింగ్) ప్రక్రియ ముగిసిన వెంటనే రాష్ట్రం వెలుపలకి ప్రయాణించే వారి సంఖ్య పెరగడంతో రైళ్లలో అపారమైన రద్దీ నమోదైంది. ప్రయాణికుల పెరుగుతున్న ఒత్తిడిని నియంత్రించేందుకు సమస్తీపూర్ రైల్వే మండల పరిపాలన ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో, మండలంలోని విభిన్న స్టేషన్ల నుండి ఈ రోజు నుంచి... కంచి పీఠమే కుటుంబ వ్యవస్థ బలం – శంకర ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ విభాగం ప్రారంభించిన సీఎం చంద్రబాబు
గుంటూరు నవంబర్ 09 (ప్రజా మంటలు):
మన దేశంలో కుటుంబ వ్యవస్థ పటిష్టంగా నిలవడానికి కంచి పీఠం వంటి ఆధ్యాత్మిక సంస్థలు కీలక పాత్ర పోషించాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆదివారం గుంటూరు సమీపంలోని శంకర ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా... 25వ వార్డులో అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల నవంబర్ 9 (ప్రజా మంటలు)పట్టణ 25వ వార్డులో 10 లక్షల నిధులతో చేపట్టిన సీసీ డ్రైన్ అభివృద్ధి పనులని పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
పనులు నాణ్యతలో చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు.ముఖ్యమంత్రి గారు జగిత్యాల కు 62.50 కోట్ల నిధులు మంజూరు చేయటం జరిగింది అని,అతిత్వరలో పనులు టెండర్... జగిత్యాల కవయిత్రి మద్దెల సరోజనకు ‘జాతీయ కీర్తిచక్ర–2025’ పురస్కారం
జగిత్యాల నవంబర్ 09 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ కవయిత్రి, కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం ప్రధాన అడ్మిన్ శ్రీమతి మద్దెల సరోజన గారు సాహిత్య రంగంలో అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ ‘జాతీయ కీర్తిచక్ర–2025’ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆమె ప్రతిభ, కృషి, కవితా వైభవానికి ఇది గొప్ప గుర్తింపుగా నిలిచింది.
ఈ... మార్కండేయ ఆలయంలో ఆంజనేయస్వామి ,జంట నాగుల పునఃప్రతిష్ట
జగిత్యాల నవంబర్ 9 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో ఆంజనేయ స్వామి, జంట నాగేంద్ర స్వామి, విగ్రహాల పున: ప్రతిష్ట సందర్భంగా ఆదివారం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి ర సోమవారం ఉదయం ఏడు గంటల 30 నిమిషాల వరకు జరిగే అఖండ హనుమాన్
ఉదయం... జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగింపు – పోలింగ్ స్థితిగతులు, భద్రతా ఏర్పాట్లు పూర్తి: అధికారులు
హైదరాబాద్ నవంబర్ 09 (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారం ఇవాళ సాయంత్రం అధికారికంగా ముగిసింది. మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుండగా, ఎన్నికల నిర్వాహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు.
ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా సాయంత్రం 6 గంటల తర్వాత స్థానికేతరులు నియోజకవర్గం విడిచి వెళ్లాల్సిందిగా... ఫుట్ పాత్ నిరాశ్రయులకు 288 వ అన్నదానం
సికింద్రాబాద్, నవంబర్ 09 (ప్రజామంటలు):
రాష్ట్ర రాజధాని మహానగరం హైద్రాబాద్ లో వాహనంలో సంచరిస్తూ వివిధ ప్రాంతాలలో ఫుట్ పాత్ ల మీద ఆకలితో ఉన్న అనాథలు, నిరాశ్రయులు, సంచార జాతుల వారికి ఆదివారం స్కై ఫౌండేషన్ తమ 288 వ వారం అన్నదానం నిర్వహించారు. ఈసందర్బంగా వారికి ఫుడ్డు ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లను అందచేశారు.... 