దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు
జగిత్యాల ఫిబ్రవరి 11(ప్రజా మంటలు)
300 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన జగిత్యాల రూరల్ మం అంబారి పేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే దేవాలయం వద్ద బోర్డును ఏర్పాటు చేశామని, ఏ మతాన్ని గానీ వ్యక్తులను గానీ కించపరచాలనే ఉద్దేశం తమ గ్రామస్తులకు లేదని అంబారిపేట గ్రామస్తులు స్పష్టం చేశారు.
శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం ముందు అన్య మత ప్రచారం నిషేధం అంటూ బోర్డు ఏర్పాటు చేయగా ఆ బోర్డును తీసివేయాలంటూ ఓ వ్యక్తి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో పోలీసులు ఆ బోర్డును తొలగించాలని గ్రామస్తులపై ఒత్తిడి చేయడంతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు గ్రామస్తులందరూ అధికారుల చర్యలను ఖండించారు.
ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామానికి కొంతమంది క్రిస్టియన్ మత ప్రచారకులు వచ్చి గ్రామానికి చెందిన మహిళలను మతం మారాలంటూ ఒత్తిడి తెచ్చారని, ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వారిని గ్రామం నుండి పంపివేశామని తెలిపారు.
దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రామ సర్పంచ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా పవిత్రమైన దేవాలయం కొండపై గుర్తుతెలియని వ్యక్తులు సిలువ గుర్తు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
ఈ విషయంలో కూడా వివాదం చెలరేగిందని గుర్తు చేశారు. పవిత్రమైన ఆలయం వద్ద అన్యత ప్రచారం, అసాంఘిక కార్యకలాపాలు జరగకూడదనే ఉద్దేశంతో తాము ఈ బోర్డును ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.
గ్రామస్తుల మనోభావాలకు వ్యతిరేకంగా కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇతర మతస్తుల నుండి తమ దేవాలయాన్ని, గ్రామాన్ని రక్షించుకోవడం తమ అందరి బాధ్యత అని ఈ విషయాన్ని అధికారులు అర్థం చేసుకోవాలని కోరారు.
ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘం నాయకులు అక్కడికి చేరుకొని వారికి సంఘీభావం తెలిపిన లింగంపేట శ్రీనివాస్, అంకార్ సుధాకర్, వేముల సంతోష్, జిట్టవేణి అరుణ్ కుమార్ గాజోజు సంతోష్, వారికి సంఘీభావం తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాపల్లి శివారులో పేకాట స్థావరాలపై దాడి
1.jpeg)
మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్

టీయూడబ్ల్యూజే(ఐ జే యు) నూతన ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను సన్మానించిన జంబి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు

ప్లేట్లెట్లు దానం చేసి మానవత్వం చాటుకున్న పోలీస్ కానిస్టేబుల్

ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిని ఇంట్లోంచి గెంటేసిన కొడుకులు -ఆర్డీవోకు ఫిర్యాదు

దేవరకొండ ఎస్ టి గురుకుల బాలికల ఘటనపై కేసు నమోదు

అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు
