యూ పి ఎస్ పై యుద్ధభేరిని విజయవంతం చెయ్యాలి
యూ పి ఎస్ పై యుద్ధభేరిని విజయవంతం చెయ్యాలి
ఓ పీ ఎస్ ను పునరుద్ధరించాలి -టి ఎస్ సి పి ఎస్ ఈ యు
ధర్మపురి ఫిబ్రవరి 10:
ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయబోతున్న ఏకీకృత పెన్షన్ పథకం (యూపీఎస్) విధానం కు వ్యతిరేకంగా మార్చ్ 2 వ తేదీన ధర్నా చౌక్ ,హైదరాబాద్ లో జరిగే యూ పి ఎస్ పై యుద్ధభేరి ని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్ కుమార్ కోరారు.
ధర్మపురి పట్టణం లో గోడ పత్రిక ఆవిష్కరించారు ఈ సందర్భంగా మ్యాన పవన్ కుమార్ మాట్లాడుతూ
సీపీఎస్ వద్దంటూ పాత పెన్షన్ కొరకు రాష్ట్రవ్యాప్తంగా దశాబ్ద కాలంగా ఉద్యోగ ఉపాధ్యాయులు పోరాటం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం కొత్తగా యూపీఎస్ పేరుతో ఉద్యోగుల భవిష్యత్తును కార్పొరేట్లకు తాకట్టు పెడుతుందని దీనివల్ల ఉద్యోగుల జీవితాలు మరింత దుర్భరం అవుతాయనీ ఆందోళన వ్యక్తం చేశారు యూపీఎస్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలనీ ఇది యూనిపైడ్ పెన్షన్ స్కీం కాదని యూస్ లెస్ పెన్షన్ స్కీం అని విమర్శించారు.
ఉద్యోగి దాచుకున్న డబ్బుల నుండే పెన్షన్ ఇవ్వడం అంటే ఉద్యోగి తనకు హక్కుగా రావాల్సిన పెన్షన్ ను డబ్బులతో కొనుకోలు చేసినట్లు అవుతుందని వెంటనే ఏలాంటి చందా చెల్లించకుండానే సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగికి 50% పెన్షన్ ఇచ్చే పాత పెన్షన్ పునరుద్ధరణ చేయాలని కోరారు తెలంగాణలో వచ్చేనెల రెండున హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ లో యూ పి ఎస్ పై యుద్ధభేరికి రాష్ట్రంలోని రెండు లక్షల యాభై వేల సి పి ఎస్ ఉద్యోగ ఉపాద్యాయులు హాజరై విజయవంతం చేయాలని కోరారు
More News...
<%- node_title %>
<%- node_title %>
రెండో రోజు గణనాథులకు వీడ్కోలు పలికిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల, సెప్టెంబర్ 24 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలో రెండో రోజు గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణనాథులకు పూజలు నిర్వహించి, భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆమె వెంట కౌన్సిలర్ కోరె జయ గంగమల్లు, బొలుసాని శ్రీనివాస్, నిమ్మల నాగరాజుతో పాటు ముఖ్య నాయకులు... ట్రాఫిక్ నియంత్రణకు తెలంగాణలో కొత్త వ్యవస్థ : ముఖ్యమంత్రి ప్రకటన
హైదరాబాద్ సెప్టెంబర్ 24 (ప్రజా మంటలు)
:తెలంగాణలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలకు సమగ్ర పరిష్కారం చూపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. **‘తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో’ (TG-TMARS)**ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో 135 జారీ చేసింది. ట్రాఫిక్ నిర్వహణను... చింతకుంట చెరువులో వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశిలించిన ఎమ్నెల్యె సంజయ్
జగిత్యాల, సెప్టెంబర్ 24 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువు వద్ద కొనసాగుతున్న వినాయక నిమజ్జన ఏర్పాట్లను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. మున్సిపల్ అధికారులు, సిబ్బందితో కలిసి నిమజ్జన ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించారు.... ఓయూకు హామీ ఇచ్చిన రూ.1,000 కోట్లు ఏమయ్యాయి?: ప్రశ్నించిన కవిత
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (ప్రజా మంటలు):
ఉస్మానియా యూనివర్సిటీకి ప్రభుత్వం ప్రకటించిన రూ.1,000 కోట్ల నిధులు ఏమయ్యాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఓయూ లా కాలేజ్ విద్యార్థులు కనీస సౌకర్యాల కోసం నెలల తరబడి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఓయూ లా కాలేజీలో జరిగిన వినాయక... ప్రణయ్ హత్య కేసు దోషి అబ్దుల్ బారీ మృతి..
సికింద్రాబాద్,సెప్టెంబర్ 24 ( ప్రజామంటలు):
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ అమృత-ప్రణయ్ పరువు హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఏ-4 నిందితుడు అబ్దుల్ బారీ (52) కన్నుమూశాడు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉన్న అతనికి గురువారం తెల్లవారు జామున తీవ్రమైన గుండెనొప్పితో అస్వస్థతకు గురికావడంతో జైలు సిబ్బంది వెంటనే
ప్రస్తుతం... అధునాతన వైద్య సౌకర్యాలతో గచ్చిబౌలిలో బట్టర్ ఫ్లై హాస్పిటల్స్ ప్రారంభం..
సికింద్రాబాద్, సెప్టెంబర్ 24 (ప్రజా మంటలు):
మహిళలు, చిన్నారులకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు గచ్చిబౌలిలో నూతనంగా ఏర్పాటు చేసిన 'బటర్‌ఫ్లై హాస్పిటల్స్' శాఖను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హర్కారా వేణుగోపాల్ రావు, సినీనటి మంజుల ఘట్టమనేని, ఎమ్మెల్యే ఆరెకపూడి... జగిత్యాలలో ఈదురుగాలులకు కారుపై విరిగిపడిన వేప చెట్టు
జగిత్యాల, సెప్టెంబర్ 24 (ప్రజా మంటలు):
పట్టణంలో వీచిన ఈదురుగాలులకు 6వ వార్డు గోవిందుపల్లెలో నిలిపి ఉంచిన మారుతి బలెనో కారుపై వేప చెట్టు విరిగిపడింది. ఈ కారు కొత్తపేట నాగలయం ఈఓ విక్రమ్‌కు చెందినదిగా తెలిసింది. చెట్టు విరిగిపడటంతో కారు ధ్వంసమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
రైతును రిజిస్ట్రేషన్ చేసి రైతుగా గుర్తించడమెందుకు - దావ వసంత
పంట పండించడం ఒక పరీక్ష.. అమ్ముకోవడం మరో పరీక్ష: దావ వసంత సురేష్
సారంగాపూర్, సెప్టెంబర్ 24 (ప్రజా మంటలు): రైతు పంట పండించడమే కాకుండా, దానిని అమ్ముకోవడానికి కూడా ప్రభుత్వ నిబంధనలతో ఇబ్బందులు పడుతున్నారని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. రేచపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి... రెండో సంవత్సరం సైతం వేలంలో లడ్డూను దక్కించుకున్న రఘుపతి శర్మ
జగిత్యాల సెప్టెంబర్ 23 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నవరాత్రుల ప్రారంభం రోజు నాడు గణేష్ ని పూజలో ఉంచిన లడ్డును వేలంలో జగిత్యాల బ్రాహ్మణ వీధికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు సిరిసిల్ల రఘుపతి శర్మ 15,116 రూపాయలకు వేలంలో దక్కించుకున్నాడు.
రఘుపతి శర్మ... తాల్ల రాంపుర్ లో 49 కుటుంబాలపై సామాజిక బహిష్కరణ ఆరోపణలు
నిజామాబాద్, సెప్టెంబర్ 24:ఎర్గట్ల మండలం తల్లారంపూర్ గ్రామంలో 39 గౌడ (బీసీ), 10 ఎస్సీ కుటుంబాలపై గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) సామాజిక బహిష్కరణ విధించిందని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. తమతో ఎవరైనా మాట్లాడినా, సంబంధాలు పెట్టుకున్నా రూ.25 వేల జరిమానా విధిస్తామని గ్రామస్తులను హెచ్చరించినట్లు వారు పేర్కొన్నారు.బాధిత కుటుంబాల ప్రతినిధులు బుధవారం నిజామాబాద్... ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక ఖాయం.. దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24:
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లుగా కొనసాగనుంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా... ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకున్న మర్రి శశిధర్ రెడ్డి
సికింద్రాబాద్, సెప్టెంబర్ 23 ( ప్రజా మంటలు):
హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ బడా గణేష్‌ను మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గణనాథుడికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా... 