కేంద్ర బడ్జెట్ బీహార్ బడ్జెట్ గా కనబడుతుంది. - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఫిబ్రవరి 2 ( ప్రజా మంటలు ) :
కేంద్ర బడ్జెట్ బీహార్ బడ్జెట్ గా కనిపిస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి అన్నారు.
జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
- వికసిత భారత్ అంటూ ఉదరగొడుతూ నరేంద్ర మోడీ 10 ఏళ్లు ప్రధానిగా 2015 మార్చ్1 బడ్జెట్ నాటికి దేశ అప్పు 62 లక్షల కోట్లు అండగా పదేళ్ల లో ఎన్ డీ ఏ సాధించిన ప్రగతి 1,80,000కోట్లు అని ఎద్దేవా చేశారు.
- కేంద్ర బడ్జెట్ బీహార్ రాష్ట్ర బడ్జెట్ గా కనపడుతోంది.
- దేశ జీ డీ పీలో5శాతం సమకూర్చుతున్న తెలంగాణ కు నిధుల కేటాయింపుల్లో వివక్ష చూపారు.
- రాష్ట్ర విభజన హామీలు బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐ ఐ ఎం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బడ్జెట్ లో ఉసే లేదు.
- తెలంగాణ ప్రజల హక్కులు కాపాడేందుకు రాజకీయాలు అతీతంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం తో సన్నిథంగా ఉంటు రాష్ట్రానికి నిధుల సాధన కోసం కృషి చేస్తున్న బడ్జెట్ లో తెలంగాణకు మోంది చెయ్యి చూపారు.
- బీ ఆర్ ఎస్ బీజేపీ మధ్య సఖ్యత లేకపోవడం తో పదేళ్లు తెలంగాణ ప్రజలు తమ హక్కులు కోల్పోయారు.
- రింగ్ రోడ్డు,రేడియల్ రోడ్లు, మెట్రో రైలు, మూసి పునరుద్ధరణ పథకం ప్రాజెక్టుల కోసం 1లక్ష 63 వేల నిధుల కోసం ప్రతిపాదనలు పంపితే ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు.
- పసుపు బోర్డు ఏర్పాటు చేసుకున్న బడ్జెట్ లో కేటాయింపులు లేవు.
- ఆర్మూర్ నుండి అదిలాబాద్ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే ఢిల్లీ ప్రత్యామ్నాయ మార్గం అయితదన్నారు.
- ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించకపోవడం తో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు.
- యూపీ ఏ ప్రభుత్వ హయాంలో శంషాబాద్ ఏర్పోర్ట్ చేసినం.. ప్రస్తుత ప్రభుత్వం వరంగల్ ఏర్పోట్ కూడా ఏర్పాటు చేయలేదన్నారు.
- బడ్జెట్ లో తెలంగాణ అనే పదమే ఉచ్చరించకపోవడం తో దేశంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నదనే కనీసఆలోచన అయిన కేంద్రానికి ఉన్నదా.. అని అనుమానం వస్తుందన్నారు.
- పీ ఏం ఆవస్ యోజన కింద గతంలో రు.30,171 కోట్లు కేటాయించి, ఈ ఏడాది 10 వేల కోట్లు తగ్గించారు.
- రైతులను రుణ విముక్తులను చేసేందుకు యూ పీ ఏ హయాంలో జాతీయ స్థాయిలో రు.70 వేల కోట్లు మంజూరు చేసి, లక్ష రూపాయలు రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు.
- తెలంగాణ రైతులను రుణ విముక్తులను చేసేందుకు 21 వేల కోట్లు కేటాయించింది.
- రైతులను రుణ విముక్తులను చేసిన రాష్ట్రానికి కనీసం సహకారం అందించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు.
- ఉపాధి హామీ నిధులు గతేడాది నిధులు కేటాయించారు.
- గ్రామీణ నిరుపేద వ్యవసాయ కూలీలు ఉపాధికి నిధులు పెంచకపోవడం ప్రధాని నరేంద్ర మోడీకి నిరుపేదల పై ఉన్న వివక్ష తెలుస్తోంది.
- మూసి పునరుజ్జీవం కు అనుకూలం అని చెప్తున్న బీజేపీ మంత్రులు కనీసం నిధులు కేటాయించలేకపోయారు.
- కేంద్ర బడ్జెట్ బీహార్ రాష్ట్ర బడ్జెట్ గా గోచరిస్తుంది.
- బడ్జెట్ పై వాస్తవాలు మాట్లాడాలి..
- రైతులకు, రైతు కూలీలకు అండగా నిలువాలి.
- బీజేపీ నాయకుల్లో సానుకూల దృక్పధం కొరవడింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శనాత్మక కోణంలోనే చూస్తున్నారు.
- మెట్రో రైలు ఎంత ప్రదానమైనదో మంత్రి కిషన్ రెడ్డి కి తెలియదా అని ప్రశ్నించారు.
- ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు తో అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ కు గుర్తింపు వచ్చింది.
- మామిడి ప్రోత్సాహానికి మామిడి బోర్డు ఏర్పాటు చేయాలి.
- రైతులకు అండగా నిలువాలి.
- తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరారు.
- సిట్టింగ్ ఎమ్మెల్సీ గెలుస్తాం అన్నారు.
- తెలంగాణ రాష్ట్రంలో 55 వేల ఉద్యోగాలు భర్తీ చేసినం అన్నారు.
ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
- కేంద్ర బడ్జెట్ పై తెలంగాణకు నిధులు కేటాయించక పోవడం పై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం..
- రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న నిధులు తీసుకు రాలేకపోయారు.
- కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నప్పటి నుండి ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రానికి నిధులు కేటాయిస్తున్నారు..
- తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో అన్యాయం జరిగినా బీ ఆర్ ఎస్ ,బీజేపీ నోరు మెదపడం లేదు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపుల్లో వివక్ష పై జగిత్యాల జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 3న నిరసన కార్యక్రమం చేపడుతున్నామని, జిల్లా లోని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తరలి రావాలని పిలుపునిచ్చారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఆకట్టుకున్న సందేశాత్మక ముగ్గు
Published On
By Sama satyanarayana
జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు):
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మంగళవారం జగిత్యాలలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో జగిత్యాలకు చెందిన యూట్యూబ్ స్టార్ దేశవేని మమత వేసిన సందేశాత్మక ముగ్గు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
“రైతు లేనిదే రాజ్యం లేదు… జవాన్ లేకపోతే దేశానికి రక్షణ లేదు” అనే నినాదంతో, పలు రకాల అందమైన రంగులను... హైదరాబాద్లో జర్నలిస్టుల అరెస్టులు
Published On
By From our Reporter
హైదరాబాద్ జనవరి 14 (ప్రజా మంటలు):
హైదరాబాద్లో జర్నలిస్టుల వరుస అరెస్టుల వ్యవహారంపై మాజీ మంత్రి హరీశ్ రావు డీజీపీతో ఫోన్లో మాట్లాడారు. పండుగ పూట అర్ధరాత్రి జర్నలిస్టుల ఇళ్లకు వెళ్లి తలుపులు పగలగొట్టి అరెస్టులు చేయడం అవసరమా? అని ప్రశ్నించారు.
నోటీసులు ఇవ్వకుండా, చట్టపరమైన ప్రొసీజర్ అనుసరించకుండా జర్నలిస్టులను అరెస్టు చేయడం సరికాదని హరీశ్... జగిత్యాల ప్రభుత్వ నర్సింగ్ హాస్టల్‌లో కలకలం
Published On
By From our Reporter
జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ హాస్టల్‌లో విద్యార్థినుల మొబైల్ ఫోన్లు లాక్కొని, సంక్రాంతి పండుగకు ఇంటికి పంపించకుండా గదుల్లో నిర్బంధించారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
హాస్టల్‌లో సెలవులపై ముందస్తు ప్రకటన లేకుండా విద్యార్థినుల వ్యక్తిగత కమ్యూనికేషన్ను ఆపివేయడం,... జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో వైభవంగా ముగ్గుల పోటీలు _ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల జనవరి 13 ( ప్రజా మంటలు)జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్, అధ్యక్షతన మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏర్పాటుచేసిన మహిళా ఉద్యోగులకు ముగ్గుల పోటీల కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు హాజరైనారు. జగిత్యాల జిల్లా లోని... జగిత్యాల ,రాయికల్ మున్సిపాలిటీ పై బీజేపీ జెండా ఎగరవేయడమే మా లక్ష్యం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రావణి ప్రవీణ్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల జనవరి 13 (ప్రజా మంటలు)నియోజక వర్గంలోని జగిత్యాల, రాయికల్ రెండు మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బిజెపి పార్టీ పని చేస్తుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి ప్రవీణ్ అన్నారు
జగిత్యాల నియోజకవర్గం కార్యాలయము కమలా నిలయంలో మీడియా సమావేశంలో బిజెపి పార్టీ శ్రేణులతో కలిసి ఆమె... తలసాని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పీఎస్ లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
Published On
By From our Reporter
సికింద్రాబాద్, జనవరి 13 ( ప్రజామంటలు ):
బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బన్సీలాల్పేట్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు.తలసాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్న కాంగ్రెస్ నేతలు, వాటిని... సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి పురస్కారాలు
Published On
By From our Reporter
జగిత్యాల జనవరి 13 (ప్రజా మంటలు):
తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన సీనియర్ సిటీజెన్లకు సంక్రాంతి పురస్కారాలను , ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. మంగళవారం జిల్లా సీనియర్ సిటీజేన్స్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో... మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే
Published On
By From our Reporter
హైదరాబాద్, జనవరి 13 (ప్రజా మంటలు):
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం, మినీ స్టేడియం మంజూరైనప్పటికీ... సంక్రాంతి – ముగ్గులు ::సంప్రదాయం, శాస్త్రం, స్త్రీశక్తి
Published On
By From our Reporter
ముగ్గులు ఏ ప్రదేశాన్నైనా సౌందర్యవంతంగా మార్చడమే కాక, ఆ ఇంటిని లక్ష్మీ నివాసంగా మలిచే పవిత్ర చిహ్నాలు. రంగురంగుల డిజైన్లు మాత్రమే కాదు, ప్రతి ముగ్గు వెనుక దాగి ఉన్న శాస్త్రీయత, ఆధ్యాత్మిక భావన, సామాజిక ఉద్దేశం చాలా లోతైనవి. రోజూ మనం చూసే ఒక సాధారణ ముగ్గుకే ప్రత్యేక అర్థం ఉంది. ఆ అర్థం,... సంక్రాంతి ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన దావ వసంత
Published On
By From our Reporter
జగిత్యాల, జనవరి 13 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం సన్నిధిలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీల్లో పాల్గొని విజేతలకు జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ తెలుగువారి ప్రత్యేక పండుగలలో ఒకటని తెలిపారు. సంక్రాంతి... వైద్య విద్యార్థిని శ్రీనితకు సత్కారం
Published On
By From our Reporter
జగిత్యాల, జనవరి 13 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాకు చెందిన సీనియర్ పాత్రికేయుడు అంజయ్య కుమార్తె బొడ్డుపల్లి శ్రీనిత సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రామగుండం వైద్య కళాశాలలో ఈ విద్యా సంవత్సరానికి ఫ్రీ సీట్ సాధించిన సందర్భంగా ఆమెకు అభినందన సత్కారం నిర్వహించారు.
కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం, జగిత్యాల అధినేత గుండేటి... కట్కాపూర్లో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు
Published On
By From our Reporter
రాయికల్, జనవరి 13 (ప్రజా మంటలు):
కట్కాపూర్ గ్రామంలో సంక్రాంతి శుభ సందర్భంగా గ్రామ సర్పంచ్ పడాల పూర్ణిమ తిరుపతి గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగింది.
గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా మొత్తం 50 మంది ముగ్గులు వేశారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన ... 