బిబికే ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్ల పంపిణీ
బిబికే ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్ల పంపిణీ
గొల్లపల్లి జనవరి 23 (ప్రజా మంటలు):
పేదలకు తోచిన రీతిన సాయ మందించడంలోనే ఆత్మసంతృప్తి కలుగుతుందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి అన్నారు. జగిత్యాల లోని వాల్మీకి ఆవాసం సేవా భారతి లో భీమ్ రాజ్ పల్లి బొమ్మెన కుమార్ ( బి బి కే ) ట్రస్ట్ & ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతలు ఎరసాని శ్రవణ్ కుమార్, పరిణిత దంపతులు సహకారంతో 74 మంది నిరుపేదలకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి చేతులమీదుగా గురువారం దుప్పట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద విద్యార్థులు తాము పేదవాళ్ళము తల్లిదండ్రులు లేని వాళ్ళము అని భావించకుండా పట్టుదలతో చదివి ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతమైన కొలువులు కొట్టాలని సూచించారు. అలాగే పలు సేవా కార్యక్రమాల ద్వారా ఎంతోమంది యువతకు బి బి కే ఫౌండర్ బొమ్మెన కుమార్ స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఆయన పేదలకు చేస్తున్న సేవల పట్ల అభినందించారు. భవిష్యత్తులో మరింత సేవా కార్యక్రమాల ద్వారా పేదల జీవితాల్లో బి బి కే ట్రస్ట్& ఫౌండేషన్ వెలుగులు నింపాలని కోరారు.ఈ కార్యక్రమంలో బి బి కే ఫౌండర్ బొమ్మెన కుమార్ మాధవి దంపతులు, సంపూర్ణ చారి, అంజి, మల్లేశం, హరీష్ దితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బుర్ర భాస్కర్ శర్మచే గీత భవన్ లో ఘనంగా కొనసాగిన కూర్మ పురాణం

నలంద కళాశాలలో ఘనంగా స్వాగతొత్సవ వేడుకలు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన బండ కార్తీక చంద్రారెడ్డి

ఏడు దశాబ్దాల వైద్య సేవల గాథ… గాంధీ మెడికల్కళాశాలకు జయహో

ఓల్డ్ బోయిన్ పల్లిలో మత్తు మందు తయారీ గుట్టు రట్టు

ఎల్. ఐ.సి. ఎవోఐ డివిజన్ "కో - కన్వీనర్" గా ఆమందు రాజ్ కుమార్

యూరియా గోదాం ను ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ భీమా సంతోష్

ఆర్యవైశ్య అభ్యున్నతే లక్ష్యంగా కృషి - రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత

సి సి రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్

పెన్షనర్ల సంక్షేమానికి కృషి. - జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

శాంతి భద్రతలకు భంగం కలిగించే రౌడీషీటర్ బండి శ్రీకాంత్ పై పీడి యాక్ట్ అమలు. నిందితునికి కరీంనగర్ జైల్లో పీడి ఉత్తర్వులు అందజేత.

నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు
