అర్హులకు 4లక్షల రేషన్ కార్డులు అందిస్తాం - జైన గ్రామ సభలో రాష్ర్ట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
అర్హులకు 4లక్షల రేషన్ కార్డులు అందిస్తాం - జైన గ్రామ సభలో రాష్ర్ట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
(రామ కిష్టయ్య సంగన భట్ల)
తమ ప్రభుత్వం 4లక్షల కార్డులు ఇవ్వబోతున్నామని, దరఖాస్తు చేసుకోవడానికి గడువు అనేది లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ పథకాల అమలులో లబ్ధిదారుల ఎంపికలో ప్రజామోదం పొందే గ్రామ సభలో భాగంగా బుధవారం ధర్మపురి మండలం జైనా గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో మరో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తం కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ... రేషన్ కార్డులు గత ప్రభుత్వము ఉప ఎన్నికలు వస్తే తప్ప ఇవ్వలేదని.. గత పదేళ్లలో ఆ ప్రభుత్వము కేవలం 40000 రేషన్ కార్డులు ఇచ్చారని గుర్తు చేశారు.
ఇవాళ లబ్ధిదారుల పేర్లు లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోండి.. అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు ఇస్తామని ప్రకటించారు. జగిత్యాల జిల్లాలో గోదావరి నది జలాల ఎండిపోవడం వల్ల రైతులకు కలిగే ఇబ్బందులను నివారిస్తు, నీటిపారుదల అధికారులతో మాట్లాడి తప్పకుండా శాశ్వత పరిష్కారం చేస్తామన్నారు. ప్రస్తుతం గోదావరి ఎండిపోవడం వల్ల ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్ తమ దృష్టికి తెగా, శ్రీరాంసాగర్ నుంచి నీరు విడుదల చేసామన్నారు. ఎమ్మేల్యే లక్ష్మణ్ అంటే తనకు చాలా అభిమానమని, ఆయన ఎంతో కష్టపడి ఎమ్మేల్యే గా గెలుపొందారన్నారు. అడ్లూరి లక్ష్మణ్ ఏ ప్రతిపాదన తీసుకొచ్చిన మంజూరు చేయిస్తానన్నారు..
రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం చేయలేని కార్యక్రమాలు తమ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందన్నారు.
ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కామెంట్స్
గోదావరి తీరప్రాంత రైతాంగానికి కష్టకాలంలో నీటిని విడుదల చేయించిన జల ప్రదాత ఉత్తంకుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే అర టిఎంసి నీటిని గోదావరిలోకి వదిలారని, మరో అర టీఎంసీ నీటిని విడుదల చేస్తారన్నారు. తలాపున గోదావరి ఉన్న తీర ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బుగ్గారం మండలంలోని యశ్వంత్ రావు పేట చెరువుతో పాటు జంగల్ నాల ప్రాజెక్టులను పునరుద్ధరిస్తే నియోజకవర్గంలోని అత్యధిక శాతం సాగుకు లబ్ధి చేకూరుతుందన్నారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు కవ్వంపెల్లి, మేడిపెల్లి, కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, నాయకులు సంగణభట్ల దినేష్ నరసింగరావు, అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి, అధికారులు, నాయకులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
