మ్యూనిచ్ లో రేవంత్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం
మ్యూనిచ్ లో రేవంత్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం
మ్యూనిచ్ జనవరి 20:
దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum) సదస్సులో పాల్గొనడానికి జ్యూరిచ్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందానికి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.
ముఖ్యమంత్రి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల ప్రతినిధి బృందం జ్యూరిచ్ విమానాశ్రయం చేరుకోగానే అక్కడ స్థిరపడిన తెలుగు వారితో సందడి నెలకొంది. ముఖ్యమంత్రికి పెద్ద ఎత్తున హాజరై అభినందనలు తెలియజేశారు.
జ్యూరిచ్ విమానాశ్రయంలో రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరస్పరం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై వారి మధ్య క్లుప్తంగా చర్చ జరిగింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి శ్రీధర్ బాబు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కూడా ఉన్నారు.
దావోస్ సదస్సు తొలి రోజున పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. అంతర్జాతీయ పెట్టుబడుల గమ్య స్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసే నిర్దిష్టమైన భవిష్యత్తు ప్రణాళికతో ఈ పర్యటనపై రాష్ట్ర ప్రతినిధి బృందం ప్రత్యేకంగా దృష్టి సారించింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

పద్మశాలి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మెహందీ ఉత్సవం

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
