మధ్యాహ్న భోజన పథకం లో పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలి - వర్కర్స్ యూనియన్ వినతి పత్రం
మధ్యాహ్న భోజన పథకం లో పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలి - వర్కర్స్ యూనియన్ వినతి పత్రం
మెట్టుపల్లి జనవరి 20( ప్రజా మంటలు)
తెలంగాణ రాష్ట్ర ఏఐటీయూసీ అనుబంధ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలని మెట్పల్లిలోని మండల విద్యాశాఖ అధికారికి మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ వారు వినతిపత్రం ఇచ్చారు.
అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు వారానికి మూడుసార్లు కోడిగుడ్లు ఇవ్వాలని ఆదేశించారు, వీటి ధర ఒక కోడి గుడ్డుకు 5/ రూపాయల చొప్పున ఇస్తామన్నారు కానీ మార్కెట్ ధర రూ:లు 8/ గా ఉన్నాయి, దీనికి అదనంగా 3/ రూ: నష్టపోతున్నామన్నారు కావున మార్కెట్ ధరలకు అనుకూలంగా కోడిగుడ్డు ధరలు లేనందువలన విద్యార్థులకు అందించలేమని ప్రభుత్వమే పూర్తిగా కోడిగుడ్లను సరఫరా చేయాలన్నారు, అలాగే ప్రభుత్వం చెల్లిస్తామన్న రూ:10,000 వేతనం వెంటనే చెల్లించాలి, మెనూ చార్జీలు ప్రతి విద్యార్థికి రూ: 25/ చెల్లించాలి, వంట సందర్భంలో జరుగుతున్న ప్రమాదాలకు జీవిత బీమా సౌకర్యం కల్పించాలి, గత 9 నెలలుగా పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలన్నారు, ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకుడు ఎండి ఉస్మాన్, మధ్యాహ్న భోజన వర్కర్స్ పి సులోచన, కే సరస్వతి, లావణ్య, గంగు, భారత, శారద, భూమన్న, సాలమ్మ తదితరులు పాల్గొన్నారు,
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏ పార్టీ తెలవని ఎమ్మెల్యే బీ-ఫారం ఎలా ఇస్తారు? – కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం సహించం: మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి
జగిత్యాల, జనవరి 19 (ప్రజా మంటలు):
తాను ఏ పార్టీకి చెందినవాడో కూడా స్పష్టత లేని ఎమ్మెల్యే, మున్సిపల్ ఎన్నికలలో బీ-ఫారం ఇవ్వడం గురించి మాట్లాడడం విడ్డూరమని మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
జిల్లా... జన్వాడ భూకుంభకోణం మళ్లీ తెరపైకి : నేడు నాంపల్లి కోర్టులో విచారణ
₹5,000 కోట్ల స్కామ్పై స్పాట్లైట్
సికింద్రాబాద్, జనవరి 19 (ప్రజా మంటలు):
జన్వాడ భూకుంభకోణం కేసు మరోసారి రాజకీయ, న్యాయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. సుమారు ₹5,000 కోట్ల మేర అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్న ఈ కేసులో సత్యం రాజు, నందిని రాజు, తేజ రాజులను మళ్లీ విచారించే అవకాశముందని సమాచారం.
జన్వాడ-లింక్స్ కేసులో... మేడారం సమ్మక్క–సారలమ్మ పుణ్యక్షేత్రం పునరుద్ధరణ పూర్తి – ప్రజలకు అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారం / హైదరాబాద్, జనవరి 19(ప్రజా మంటలు):
ఆదివాసీల అతిపెద్ద పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క–సారలమ్మ పుణ్యక్షేత్రం పునరుద్ధరణ పనులు పూర్తికావడంతో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఈ చారిత్రాత్మక పుణ్యక్షేత్రాన్ని ప్రజలకు అంకితం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కుటుంబ సమేతంగా సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు... బీజేపీ జాతీయ అధ్యక్షునిగా నితిన్ నాబిన్ ఖరారు
న్యూఢిల్లీ, జనవరి 19 (ప్రజా మంటలు):భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి కొత్త జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నాబిన్ ఖరారయ్యారు. పార్టీ అంతర్గత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆయన ఏకగ్రీవంగా ఎంపికైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో నితిన్ నాబిన్ బాధ్యతలు చేపట్టనున్నారు.
బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రక్రియలో... కల్వకుంట్ల కవిత కొత్త పార్టీకి ప్రశాంత్ కిషోర్ మద్దతు?
హైదరాబాద్, జనవరి 19 (ప్రజా మంటలు):
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేయనున్న కొత్త రాజకీయ పార్టీ కోసం ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) పని చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కవితతో కలిసి పని చేసేందుకు ప్రశాంత్ కిషోర్ ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.... ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం: జి. రాజేశం గౌడ్
హైదరాబాద్, జనవరి 18 (ప్రజా మంటలు):
మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి, తెలంగాణ తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ ఎన్టీఆర్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1985–1990 మధ్యకాలంలో ఎన్టీఆర్ దూరదృష్టి, ప్రజాహిత పాలనతో న్యాయవ్యవస్థలో సంస్కరణలు, మహిళలకు... నిజాంపేట్ లో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి
సికింద్రాబాద్, జనవరి 18 ( ప్రజా మంటలు):
దివంగత మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా నిజాంపేట్ లో ఆదివారం పలువురు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా నిజాంపేట్ అధ్యక్షులు పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ..బీసీ, ఎస్సీ,ఎస్టీలకు రాజకీయ అవకాశాలు... స్వర్గీయ ఎన్టీరామారావు 30వ వర్ధంతి.. నివాళి అర్పించిన ఎన్టీఆర్ అభిమానులు
గొల్లపల్లి జనవరి 18 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం కేంద్రంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలు, వేసి అభిమానులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ బీసీ రాష్ట్ర సెల్ ఉపాధ్యక్షులు ఓరగంటి భార్గవ్, మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్, బడుగు బలహీన వర్గాల నాయకుడుగానిరుపేద గుండెల్లో దేవుడిగా ఉన్నారని అన్నారు.
నాడు పేద ప్రజల... ఎన్నికల హామీల అమలే ప్రజాప్రభుత్వ లక్ష్యం – గృహ జ్యోతి పథకం లబ్ధిదారులకు పత్రాల పంపిణీ
చిగురుమామిడి, జనవరి 18 (ప్రజా మంటలు):
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారని చిగురుమామిడి మాజీ జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గృహలక్ష్మి, గృహ జ్యోతి వంటి పథకాల ద్వారా లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని... ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 3.83 కోట్ల నిధుల విడుదల
ఇబ్రహీంపట్నం జనవరి 18( ప్రజా మంటలు దగ్గుల అశోక్)
నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ ఆదేశాల మేరకు రోడ్డు నిర్మాణం పనుల పరశీలన మండల బీజేపీ అధ్యక్షులు బాయి లింగారెడ్డి ఇబ్రహీంపట్నం నుండి ఫకీర్ కొండాపూర్ వరకు ప్రధాన మంత్రి గ్రామీణ సడక్యో జన కింద విడుదల ఐనా 3.83 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
ఈ... జగిత్యాల అభివృద్ధే నా లక్ష్యం – అసత్య ఆరోపణలకు ప్రజలే సమాధానం చెబుతారు: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
విమర్శించే ముందు గతాన్ని గుర్తుంచుకోవాలి
ఉద్దేశపూర్వక ఆరోపణలు, హింసా రాజకీయాలు వద్దు
జగిత్యాలకు అత్యధిక నిధులు – అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారు
(సిరిసిల్ల రాజేందర్ శర్మ)
జగిత్యాల, జనవరి 18 (ప్రజా మంటలు):
జగిత్యాల మోతే పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడారు. జగిత్యాల అభివృద్ధి కోసం... జగిత్యాల బ్రాహ్మణ సేవా సంఘం ఆత్మీయ సమ్మేళనం _తుంగూరు సర్పంచ్ కు సన్మానం
జగిత్యాల జనవరి 18 జగిత్యాల అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆత్మీయ సమ్మేళనం విద్యానగర్లోని ఎడ్ల అంగడి సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో తంగూరి గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన అర్షకోట రాజగోపాల్రావుకు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు.
ఈ సందర్భంగా... 