ఎస్సీ వర్గీకరణ సాధనకు మాదిగలు ఐక్యత కావాలి
ఎస్సీ వర్గీకరణ సాధనకు మాదిగలు ఐక్యత కావాలి
* లక్ష డప్పులు... వేల గొంతులు' ను విజయవంతం చేయాలి
* గాయకులు ఎన్.వై అశోక్
సికింద్రాబాద్, జనవరి 19 ( ప్రజామంటలు):
రానున్న ఫిబ్రవరి 7 న ట్యాంక్ బండ్ డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహాం వద్ద నిర్వహించే లక్షడప్పులు.. వేల గొంతులు కార్యక్రమానికి లక్షలాదిగా మాదిగ, మాదిగ ఉపకులాలు తరలి రావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మాదిగల హక్కుల అభివృద్ధి పార్టీల సంఘాల ఐక్యత జేఏసీ సనత్ నగర్ నియోజ కవర్గం అధ్వర్యంలో బన్సీలాల్ పేట్ డివిజన్ పరిధిలోని గొల్ల కొమరయ్య కాలనీ వెల్ఫేర్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు కే.ఎం కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఈ. నర్సింగ్ రావు, కోశాధికారి వినోద్ కుమార్, మనీష్ కుమార్ ఆధ్వర్యంలో కాలనీ కమ్యూనిటీ హాల్లో వెయ్యి గొంతులు లక్ష డప్పుల సన్నాహాక సమావేశం, జేఏసీ ఆత్మీయ కలయిక సమావేశం ఘనంగా నిర్వహించారు. స్థానిక నాయకులు కే.ఎం కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ గాయకులు ఎమ్మార్పీఎస్ కళామండలి రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వై అశోక్, రాగటి సత్యం, డాక్టర్ శివకుమార్ లాల్, పుల్లూరి మహేందర్, కళాకారుడు ఎన్. చందర్, డి. సుదర్శన్ బాబు ఎస్.ఆర్ మల్లేష్, ఎస్.రాజు, తదితరులు మాట్లాడారు. ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ వర్గీకరణ ద్వారా దళితుల్లోని 59 కులాలకు న్యాయం జరుగుతుందన్నారు. గాంధీనగర్ ఇన్స్పెక్టర్ డి. రాజు పాల్గొని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏసూరి మహేష్, కుర్మా లక్ష్మీపతి, బొడ్డు మహేష్, ఎన్. వై. గిరి కుర్మ మహేందర్, దేవేందర్, విజయ్ శంకర్, మాచర్ల ప్రభాకర్, శంకర్, రవి, రాపాక అశోక్, పి. చంద్రశేఖర్ తో పాటు వందలాది మాదిగ బిడ్డలు స్థానికులు దుబాయ్ నర్సింగ్, శంకర్, సి.హెచ్ నర్సింగరావు, కుమార్, గోపన్న, శ్రీధర్, చాంద్, చింటూ ఆర్. మహేష్, స్థానిక మహిళలు హాజరయ్యారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

పద్మశాలి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మెహందీ ఉత్సవం

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

కేసులకు భయపడి స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకోవద్దు - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
