గల్ఫ్ ఎక్స్ గ్రేషియా నిధులు విడుదల చేయండి సీఎంకు కాంగ్రెస్ ఎన్నారై సెల్ నాయకుల విజ్ఞప్తి
గల్ఫ్ ఎక్స్ గ్రేషియా నిధులు విడుదల చేయండి
సీఎంకు కాంగ్రెస్ ఎన్నారై సెల్ నాయకుల విజ్ఞప్తి
సింగపూర్ పర్యటనలో సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు
(రామ కిష్టయ్య సంగన భట్ల)
తెలంగాణ ప్రభుత్వం 94 మంది గల్ఫ్ మృతులకు ఇచ్చిన రూ.5 లక్షల చెక్కులకు రూ.4 కోట్ల 70 లక్షల నిధులను త్వరగా విడుదల చేయాలని సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, మంత్రి డి. శ్రీధర్ బాబు లను కాంగ్రెస్ ఎన్నారై సెల్ నాయకులు మంద భీంరెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి లు సింగపూర్ లోని హోటల్ లో కలిసి విజ్ఞప్తి చేశారు.
ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె. రామక్రిష్ణా రావు వద్ద ఉన్న పెండింగ్ ఫైల్ ను ఆమోదింప చేయాలని భీంరెడ్డి, దేవేందర్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి వారు సానుకూలంగా స్పందించారు. గల్ఫ్, ఇరాక్ లతో పాటు సింగపూర్, మలేసియా తదితర 18 ఈసీఆర్ దేశాలలో మృతి చెందిన కార్మికులకు కూడా ఎక్స్ గ్రేషియా వర్తింపజేయాలని వారు కోరారు.
రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా మంజూరి పత్రాలు జారీ చేసి నిధుల విడుదల కొరకు ఎదిరి చూస్తున్నవారి వివరాలు జిల్లా వారీగా. జగిత్యాల (31), నిజామాబాద్ (28), రాజన్న సిరిసిల్ల (8), నిర్మల్ (5), కామారెడ్డి, సిద్దిపేట నాలుగు చొప్పున, కరీంనగర్, మంచిర్యాల మూడు చొప్పున, మెదక్ (2), వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, నల్గొండ, సంగారెడ్డి, రంగారెడ్డి ఒకటి చొప్పున మొత్తం 94 కుటుంబాలకు చెక్కులు ఇచ్చారు.కానీ ఇంకా నిధులు విడుదల చేయకపోవడం వల్ల బాధితులకు డబ్బులు అందలేదని తెలిపారు.
అంతకు ముందు శనివారం సాయంత్రం ప్రవాసులతో సింగపూర్ లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం (మీట్ అండ్ గ్రీట్) కార్యక్రమంలో సీఎం ఏ. రేవంత్ రెడ్డి, మంత్రి డి. శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస రెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి, హైదరాబాద్ డీసీసీ అధ్యక్షులు డా. సి. రోహిన్ రెడ్డి, సింగపూర్ తెలంగాణ సంఘం అధ్యక్షులు గడప రమేష్, మాజీ అధ్యక్షులు నీలం మహేందర్, వ్యవస్థాపక అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, సునీతా రెడ్డి, కాసర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి మం "నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
.jpg)
సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్ ఫిబ్రవరి 11 (

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం
.jpg)
#Draft: Add Your Title
.jpg)
స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి
.jpg)