ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ జనవరి 10:
రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఆదివాసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల ప్రతినిధులు విద్య, ఉద్యోగావకాశాలు, రోడ్లు, రవాణా, సాగు, తాగునీటి వంటి పలు అంశాలు, సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించారు. ఆదివాసీల కోసం ఇప్పటికే చేపట్టిన పలు విషయాలను ప్రస్తావిస్తూ వారు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
✅ కొమురం భీమ్ జయంతి, వర్ధంతిలను అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే పలు అంశాలపై అధికారులకు సూచనలిచ్చారు. ఐటీడీఏ ప్రాంతాలకు జనాభా ప్రాతిపదికన ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలి.
✅ స్పెషల్ డ్రైవ్ కింద ఇందిర జలప్రభ ద్వారా ఉచితంగా బోర్లు వేసేందుకు చర్యలు చేపట్టాలి. ఆదివాసీ రైతుల వ్యవసాయ బోర్లకు సోలార్ పంపుసెట్లు ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ఆదివాసీ గూడాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి.
✅ ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని స్మృతి వనంగా మార్చాలని, అమరుల కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయడం వంటి చర్యలు ఇప్పటికే తీసుకున్నాం. రాజకీయంగానూ ఆదివాసీలకు న్యాయం చేస్తూ ముందుకు వెళుతున్నాం. అలాగే ఆదివాసీలు విద్య, ఉద్యోగ, ఆర్ధిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం.
✅ ఆదివాసీల మాతృ భాషలో విద్యను అందించడం, గోండు భాషలో ప్రాథమిక విద్యను అందించే అంశంపై అధ్యయనం చేసి నివేదిక అందించాలి. ఆదివాసీల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్, మౌలిక సదుపాయాలను వెంటనే మంజూరు చేస్తున్నాం.
✅ విదేశాల్లో చదువుకునే ఆదివాసీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్పులకు సంబంధించి పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలి. ఇప్పటికే మంజూరైన బీఈడీ కళాశాలకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి.
✅ ఆదివాసీ రాయి సెంటర్లకు భవనాలు నిర్మించేందుకు అధ్యయనం చేసి నివేదిక తయారు అందించాలి. కేస్లాపూర్ జాతరకు నిధులు మంజూరుకు చర్యలు తీసుకోవాలి. ఉద్యమాల్లో ఆదివాసీలపై పెట్టిన కేసులు తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
✅ ఈ సమావేశంలో మంత్రి ధనసరి సీతక్క గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
✅ ఆదివాసీ సంఘాల నేతలు ఆత్రం సక్కు గారు, గోడం గణేష్, మేస్రం మనోహర్, మర్స్ కోల తిరుపతి, టేకం భాస్కర్, జుగున్క దేవు సర్మేది, కొడప హన్నుపటేల్, ఆద అమృతరావు గారు, మేస్రం మోతీరాం గారు, ఆత్రం సుగుణ గారు, ప్రొ. గుమ్మడి అనురాధ గారు, ప్రొ. అప్క నాగేశ్వర రావు, ప్రొ. రేగ రాజేందర్, ప్రొ. సిదం కిశోర్, సిదం జగ్ను గారు, ఆత్రం లక్ష్మణ్, సోయం భీంరావు, సిదం అర్జు, బుర్సా పోచయ్య, మేస్రం గంగారాంతో పాటు పలువురు ప్రతినిధులు హాజరయ్యారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు
జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక వేదికను అలంకరింపజేసి ఉత్సవ మూర్తులను వేదికపై ఉంచి కళ్యాణాన్ని... ఎన్ టివి జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ జగిత్యాలలో నిరసన
జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు)
ఎన్ టివి ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు చారి, సుధీర్లను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ జగిత్యాల పట్టణంలో టి యు డబ్ల్యూ జే (ఐ జె యు) ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ చౌరస్తా వద్ద నిర్వహించిన ఈ... గంజాయి పట్టివేత యువత పై కేసు నమోదు
గొల్లపల్లి జనవరి 14 (ప్రజా మంటలు )
గొల్లపల్లి మండలం లోనీ చందోలి గ్రామ శివారులో యువకుడు గంజాయితో వెళుతున్నాడని పక్క సమాచారం మేరకు చందోలి శివారులో పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా యువకుడిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా అతడి వద్ద 89 గ్రాముల గంజాయి లభించగా వివరాల్లోకెళ్తే వెల్గటూర్ మండలo ఆకట్టుకున్న సందేశాత్మక ముగ్గు
జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు):
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మంగళవారం జగిత్యాలలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో జగిత్యాలకు చెందిన యూట్యూబ్ స్టార్ దేశవేని మమత వేసిన సందేశాత్మక ముగ్గు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
“రైతు లేనిదే రాజ్యం లేదు… జవాన్ లేకపోతే దేశానికి రక్షణ లేదు” అనే నినాదంతో, పలు రకాల అందమైన రంగులను... హైదరాబాద్లో జర్నలిస్టుల అరెస్టులు
హైదరాబాద్ జనవరి 14 (ప్రజా మంటలు):
హైదరాబాద్లో జర్నలిస్టుల వరుస అరెస్టుల వ్యవహారంపై మాజీ మంత్రి హరీశ్ రావు డీజీపీతో ఫోన్లో మాట్లాడారు. పండుగ పూట అర్ధరాత్రి జర్నలిస్టుల ఇళ్లకు వెళ్లి తలుపులు పగలగొట్టి అరెస్టులు చేయడం అవసరమా? అని ప్రశ్నించారు.
నోటీసులు ఇవ్వకుండా, చట్టపరమైన ప్రొసీజర్ అనుసరించకుండా జర్నలిస్టులను అరెస్టు చేయడం సరికాదని హరీశ్... జగిత్యాల ప్రభుత్వ నర్సింగ్ హాస్టల్లో కలకలం
జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ హాస్టల్లో విద్యార్థినుల మొబైల్ ఫోన్లు లాక్కొని, సంక్రాంతి పండుగకు ఇంటికి పంపించకుండా గదుల్లో నిర్బంధించారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
హాస్టల్లో సెలవులపై ముందస్తు ప్రకటన లేకుండా విద్యార్థినుల వ్యక్తిగత కమ్యూనికేషన్ను ఆపివేయడం,... జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో వైభవంగా ముగ్గుల పోటీలు _ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్
జగిత్యాల జనవరి 13 ( ప్రజా మంటలు)జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్, అధ్యక్షతన మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏర్పాటుచేసిన మహిళా ఉద్యోగులకు ముగ్గుల పోటీల కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు హాజరైనారు. జగిత్యాల జిల్లా లోని... జగిత్యాల ,రాయికల్ మున్సిపాలిటీ పై బీజేపీ జెండా ఎగరవేయడమే మా లక్ష్యం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రావణి ప్రవీణ్
జగిత్యాల జనవరి 13 (ప్రజా మంటలు)నియోజక వర్గంలోని జగిత్యాల, రాయికల్ రెండు మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బిజెపి పార్టీ పని చేస్తుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి ప్రవీణ్ అన్నారు
జగిత్యాల నియోజకవర్గం కార్యాలయము కమలా నిలయంలో మీడియా సమావేశంలో బిజెపి పార్టీ శ్రేణులతో కలిసి ఆమె... తలసాని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పీఎస్ లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
సికింద్రాబాద్, జనవరి 13 ( ప్రజామంటలు ):
బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బన్సీలాల్పేట్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు.తలసాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్న కాంగ్రెస్ నేతలు, వాటిని... సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి పురస్కారాలు
జగిత్యాల జనవరి 13 (ప్రజా మంటలు):
తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన సీనియర్ సిటీజెన్లకు సంక్రాంతి పురస్కారాలను , ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. మంగళవారం జిల్లా సీనియర్ సిటీజేన్స్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో... మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే
హైదరాబాద్, జనవరి 13 (ప్రజా మంటలు):
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం, మినీ స్టేడియం మంజూరైనప్పటికీ... సంక్రాంతి – ముగ్గులు ::సంప్రదాయం, శాస్త్రం, స్త్రీశక్తి
ముగ్గులు ఏ ప్రదేశాన్నైనా సౌందర్యవంతంగా మార్చడమే కాక, ఆ ఇంటిని లక్ష్మీ నివాసంగా మలిచే పవిత్ర చిహ్నాలు. రంగురంగుల డిజైన్లు మాత్రమే కాదు, ప్రతి ముగ్గు వెనుక దాగి ఉన్న శాస్త్రీయత, ఆధ్యాత్మిక భావన, సామాజిక ఉద్దేశం చాలా లోతైనవి. రోజూ మనం చూసే ఒక సాధారణ ముగ్గుకే ప్రత్యేక అర్థం ఉంది. ఆ అర్థం,... 