శ్రీరాములపల్లిలో ఆయిల్ పాం సాగును ప్రోత్సహించడానికి అవగాహన సదస్సు
శ్రీరాములపల్లిలో ఆయిల్ పాం సాగును ప్రోత్సహించడానికి అవగాహన సదస్సు
గొల్లపల్లి జనవరి 10 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని శ్రీరాములపల్లి గ్రామం లో ఆయిల్ పాం సాగును ప్రోత్సహించడానికి జిల్లా లోని ఉద్యాన శాఖ మరియు లోహియా ఎడిబుల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో ఆయిల్ పామ్ పంట మీద అవగాహన సదస్సును నిర్వహించడం ఇందులో భాగంగా జిల్లా ఉద్యాన అధికారి దేవ ప్రసాద్ మాట్లాడుతూ గొల్లపల్లి మండలంలో ఇదివరకే 310 ఎకరాలలో ఆయిల్‌పామ్ సాగును చేపట్టడం జరిగిందని ఆయన కొని ఆడారు. కొత్తగా ఆయిల్ పామ్ పంట సాగు చేయడానికి ముందుకు వచ్చే రైతులకు చెట్లను 90 శాతం సబ్సిడీ పై, డ్రిప్ పరికరాలను BC, సన్న చిన్న రైతులకు 90 శాతం ఎస్సీ, ఎస్టి రైతులకు 100 పర్సెంట్ సబ్సిడీ, OC పెద్ద రైతులకు 80% సబ్సిడీ మీద అందించడం జరుగుతుందని ఆయన మాట్లాడారు.ఆయిల్ పామ్ సాగు చేపట్టిన రైతులకు ఆయన తగిన సలహాలు సూచనలు చేశారు ఆయిల్ సాగు చేస్తున్న రైతులు కోకో పంటను అంతర పంటగా వేయాలని ఆయన కోరారు కోకో పంట సాగుతో 2 లక్షల నికర ఆదాయం ఎకరానికి పొందవచ్చు అని ఆయన సూచించారు. ఆ తర్వాత జగిత్యాల్ నియోజకవర్గ ఉద్యాన అధికారి కందుకూరి స్వాతి ,మాట్లాడుతూ ఆయిల్ పామ్ తోటల్లో మొదటి 3 సంవత్సరాలు వరి తప్ప మిగతా పత్తి, మొక్కజొన్న, పసుపు, అరటి, బొప్పాయి, కూరగాయలు అంతరపంట లుగా వేసుకోవచ్చని, తోట నిర్వహణ నిమిత్తం ఒక ఎకరానికి సంవత్సరనికి రూ. 4200/- చొప్పున 4 సంవత్సరాల వరకు రైతుకు ఇవ్వబడునని తెలిపారు.ప్రస్తుతం ఆయిల్ పామ్ టన్ను ధర రూ. 20,500/- ఉందని, ఎకరానికి ప్రతి సంవత్సరం కనీసం రూ. 1,00,000/- నికర ఆదాయం పొందవచ్చని తెలిపారు.
లోహియా కంపెనీ తరఫున జిల్లా మేనేజర్ విజయ్ భరత్ , మాట్లాడుతూ ఆయిల్ పామ్ కొత్తగా చేపట్టే రైతులకు పంట సాగు గురించి వివరించారు అదేవిధంగా ఇదివరకే పంట సాగు చేపట్టిన వారికి సలహాలు పలు సూచనలు
చేశారు
బుగ్గారం మండలంలోని యశ్వంతరావుపేట గ్రామంలో ఫ్యాక్టరీ నెలకొలపుతున్నామని, రైతు పండించిన గెలలని 1993 ఆయిల్ పామ్ చట్టం ప్రకారం కంపెనీ కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయబడునని తెలిపారు.అదేవిధంగా మండల వ్యవసాయ అధికారి కరుణశ్రీ, మాట్లాడుతూ వరికి ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని సూచించారు. రైతులు మట్టి నమూనా పరీక్ష నివేదికను అనుసరించి ఎరువులు వేయాలని తెలిపారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో సాగు చేస్తున్న ఆయిల్ పామ్ పంటను చూసానని, అది లాభసాటి పంట అని అందరు వేయాల్సిందిగా కోరారు.ఇట్టి సమావేశంలో జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమల అధికారి శ్రీ దేవప్రసాద్ ,మండల వ్యవసాయ అధికారి కరుణశ్రీ ,ఉద్యాన అధికారి కె. స్వాతి,ఏ ఈ ఓ వంశీకృష్ణ ,లోహియా కంపెనీ జిల్లా మేనేజర్ విజయభరత్, లోహియా సిబ్బంది సంజీవ్, అన్వేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, ఇతర రైతులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
మాల్యాలలో యువకుడి ఆత్మహత్యాయత్నం – తల్లి మృతి పై చర్యల కోసం డిమాండ్
జగిత్యాల (రూరల్), నవంబర్ 06 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా మల్యాల మండల పోలీస్ స్టేషన్ వద్ద దుర్ఘటన చోటుచేసుకుంది. నూకపల్లి గ్రామానికి చెందిన యువకుడు అఖిల్ పోలీస్ స్టేషన్ గేట్ గోడ ఎక్కి తనపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
సమాచారం మేరకు, అఖిల్ తల్లి... జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మాగంటి సునీతకు మద్దతుగా బీఆర్ఎస్ నేతల ప్రచారం
హైదరాబాద్, నవంబర్ 06 (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో షేక్‌పేట్ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారికి మద్దతుగా పలువురు నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు, మాజీ... ఎస్సారెస్పీ కెనాలో గుర్తు తెలియని మహిళా మృతదేహం
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 06 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం లోని బిబి, రాజుపల్లె గ్రామ శివారులో ఎస్సారెస్పీ కెనాల్ లో గుర్తు తెలియనిసం 30:40 మధ్యన మహిళ మృతదేహం ఒట్టి పైన ఆనవాళ్లు చామన చాయ ఎరుపు రంగు జాకెట్, పసుపు రంగు లంగా మృతురాల వివరాలు తెలిసినవారు ఈ క్రింది నెంబర్ల... గొల్లపల్లిలో సైబర్ నేరాల పైన అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్ఐ ,కృష్ణ సాగర్ రెడ్డి
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 06 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం లోని శ్రీ రాములపల్లి గ్రామంలో సైబర్ జాగ్రూకత దివస్ సందర్భంగా సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో ఎస్ఐ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ జరుగు పలు వీధి విధానాల గురించి తెలియజేస్తూ, సైబర్ క్రైమ్ అయిన తర్వాత తీసుకోవాల్సిన... టీ డబ్ల్యూ జె ఎఫ్ జగిత్యాల ఆధ్వర్యంలో ఘనంగా ఐఎఫ్ డబ్ల్యూజే వజ్రోత్సవ వేడుకలు
జగిత్యాల (రూరల్) lనవంబర్ 06:(ప్రజా మంటలు):
ఐఎఫ్ డబ్ల్యూజే ఆవిర్భవించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా టీ డబ్ల్యూ జె ఎఫ్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలోఐఎఫ్ డబ్ల్యూజే వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘం కమిటీ హాల్లో టి డబ్ల్యూ జె ఎఫ్ సంఘ సభ్యులు... ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును కలిసిన మహిళా క్రికెట్ ప్రపంచకప్ విజేతలు – హర్మన్‌ప్రీత్ జెర్సీ బహుమతి
న్యూఢిల్లీ, నవంబర్ 06:ICC మహిళా క్రికెట్ వరల్డ్‌కప్ 2025 విజేతలైన భారత మహిళా జట్టును రాష్ట్రమంత్రి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రాష్ట్రపతికి జట్టు సభ్యులందరి సంతకాలతో కూడిన జెర్సీని అందజేశారు.
రాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో, “భారత మహిళా... గాంధీ ఆస్పత్రిని సందర్శించిన మానవ హక్కుల కమిషన్
ఎమర్జెన్సీ వార్డు పీడియాట్రిక్ వార్డులను సందర్శించిన కమిషన్ చైర్మన్
పేషంట్లకు అందే వైద్యం భేష్ అని డాక్టర్లకు కితాబు
సికింద్రాబాద్, నవంబర్ 06 (ప్రజా మంటలు):
మానవ హక్కుల పరిరక్షణ చట్టం–1993 లోని సెక్షన్ 12(c) ప్రకారం తన విధుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గురువారం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించింది.... కొండగట్టు వచ్చే భక్తులపై పూజల పేరుతో భారం మోపవద్దు
బిజెపి మల్యాల మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 06 (ప్రజా మంటలు)
తెలంగాణలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో అర్జిత సేవలు ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎలాంటి ధరలను పెంచవద్దని ఈ దేవస్థానానికి సామాన్యుల భక్తులు వస్తారు వారి మీద అధిక... ఎం ఎన్ కే విట్టల్ సెంట్రల్ కోర్టులో ఘనంగా కార్తీక దీపోత్సవం
ఈ నెల 15న శివపార్వతి కళ్యాణం
సికింద్రాబాద్, నవంబర్ 06 ( ప్రజామంటలు) :
సికింద్రాబాద్ న్యూ బోయిగూడలోని ఎం.ఎన్.కె సెంట్రల్ కోర్టు అపార్ట్ మెంటులో కార్తీక పూర్ణిమ సందర్భంగా దీపోత్సవం, శివారాధన ఘనంగా జరిగింది. రెసిడెంట్స్, ప్రత్యేకంగా మహిళలు ఉత్సాహం, భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జి. వనిత, లలిత, వంశీ, ఆర్.... జగిత్యాల జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ పై అవగాహన
జగిత్యాల నవంబర్ 6 ( ప్రజా మంటలు)
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణంలోని జ్యోతి హై స్కూల్ – IIT అకాడమీలో “ *సైబర్ క్రైమ్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం*” నిర్వహించారు.
ఈ కార్యక్రమం DSP రఘు చందర్ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణ పోలీస్ అధికారులు CI కరుణాకర్ ,... జగిత్యాల జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ప్రైవేట్ కాలేజీల నిరవధిక బంద్
జగిత్యాల నవంబర్ 6 (ప్రజా మంటలు)
పెండింగ్ ఫీజు బకాయిల విడుదల చేయాలని కళ్లకు గంతలు కట్టుకొని జిల్లా కలెక్టర్ ఆవరణలో నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు., సిబ్బంది.,
గత 4 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలు కొనసాగిస్తున్న... సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన ఉదయం వాకింగ్ చేసే ప్రజలను కలుసుకుని సూచనలు చేసిన పోలీస్ అధికారులు
జగిత్యాల నవంబర్ 6(ప్రజా మంటలు)ప్రజల్లో సైబర్ భద్రతపై చైతన్యం కల్పించాలన్న జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలమేరకు జిల్లా పోలీస్ శాఖ ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించే దిశగా విస్తృత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇందులో బాగంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు ఉదయం వాకింగ్ చేసే ప్రజలను కలుసుకుని, సైబర్... 