#Draft: Add Your Title
ధర్మపురిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
(రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494)
ప్రాచీన పుణ్య క్షేత్రమైన ధర్మపురి లోని శ్రీక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో, శుక్ర వారం వైకుంఠ (ముక్కోటి ఏకాదశి) వేడుకలు కన్నుల పండువగా, పైభవోపేతంగా జరిగాయి. ఉదయాత్ పూర్వం వేద మంత్రోచ్ఛారణల మధ్య, అర్చకులు పవిత్ర జలాలను కొనితెచ్చి లక్ష్మీ సమేత శ్రీ యోగానంద,శ్రీ ఉగ్ర నారసింహ, శ్రీ వేంకటేశ్వర స్వాముల మూల విరాట్టులను సాంప్రదాయ విధి విధాన రీతిలో, మహాక్షీరా భిషేకాది ప్రత్యేక పర్వదిన పూజలు నిర్వహించారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకృతులైన స్థానిక ఇలవేల్పులను దేవస్థాన ప్రాంగణంలో విద్యుద్దీపికలలో, వివిధ పుష్ప మాలికలతో, శోభాయమానంగా తీర్చి దిద్దిన రంగవల్లులతో, ఆకర్షణీయంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై అసీసుల గావించారు.
ధనుర్మాస ప్రత్యేకతలో సప్త హారతులు, షోడశోపచార పూజలు, వేద, శాస్త్ర పురాణ, సంగీత, నృత్య, వాద్యాది అవధారయాలతో ఆర్చనలు, భక్తుల గోత్ర నామాదులతో పూజలు నిర్వహించగా, భక్తజనులు భక్తి శ్రద్ధలతో కన్నులారా గాంచి తరిం చారు. అనంతరం జయ జయ ధ్వనాల మధ్య ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ సమక్షంలో, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసా చార్య వైకుంఠ (ఉత్తర) ద్వారానికి పూజ చేసి, నారికేళములను సమర్పించి, వైకుంఠ ద్వారం తెరవగా, ద్వారం ద్వారా ప్రవేశించిన భక్తులు పరమానంద భరితులై తనివి తీరా దర్శనం చేసుకున్నారు.
దేవస్థానం ఈ ఓ శ్రీనివాస్ పర్య వేక్షణలో, దేవస్థాన అర్చకుల బృందం ఆధ్వర్యంలో, సిబ్బంది సహకారంతో, బొజ్జా సంపత్ కుమార్, రాజ గోపాల్, పాలేపు ప్రవీణ్ శర్మ , క్షేత్ర పండితుల మార్గదర్శకత్వంలో ఘనంగా కార్య క్రమాలను నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఆర్డీఓ మధుసూదన్, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సత్తమ్మ, వైస్ చైర్మన్ రామయ్య, మార్కెట్ చైర్ పర్సన్ లావణ్య, వైస్ చైర్మన్ నర్సింలు
తదితరులు ప్రత్యేక పూజాదులలో పాల్గొన్నారు. అలాగే బచ్చు రాము గుప్తా సహకారంతో
నూతర సంవత్సర క్యాలండర్ ను విప్ లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఇతర ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత తదితరులు దైవ దర్శనాలు చేసుకున్నారు.
భారీ ఏర్పాట్లు
వైకుంఠ ఏకాదశి మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక శ్రద్ధతో, శ్రమ కోర్చి ఈ ఏడు భారీ ఏర్పాట్లు గావించారు. ప్రధాన రహదారి నుండి దేవస్థానం లోపలి వరకూ క్యూలైన్లు ఏర్పరిచారు. దేవస్థాన ప్రాంగణంలో విద్యుద్దీమాలతో, రంగవల్లులతో, పెద్దఎత్తున పందిళ్ళను, ప్రత్యేక పుష్ప వేదికను ఏర్పాటు చేశారు. దేవస్థానం బయట రోడుపై వివిధ ఆకృతులలో రంగులద్దారు. స్వాములను ఆసీనుల గావించిన ప్రదేశాన శాశ్వత ఇనుప షెడ్లను అందంగా తీర్చి దిద్దారు. ధర్మపురి సిఐ రాం నర్సింహా రెడ్డి రూప కల్పన మేరకు డివిజన్ లోని పలువురు ఎస్ఐలు, ఎఎస్ఐలు/హెడ్ కానిస్టే బుల్స్, సివిల్ కానిస్టేబుల్స్, హోంగార్డులు, మహిళా హోంగార్డులు, డిస్ట్రిక్ట్ గార్డులు, ప్రైవేటు సెక్యూటిరీ గార్డులు దేవస్థానంలో కట్టుదిట్టమైన బందోబస్తుని ర్వహించారు. ఎస్.ఆర్.ఆర్. కేబుల్ నెట్ వర్క్ ద్వారా గావించిన ప్రత్యక్ష ప్రసారం స్థానికంగా వీక్షించారు. బాచంపెల్లి సంతోష్ కుమార్
వ్యాఖ్యానాలు ఆకట్టుకున్నాయి.
గుండి జగదీశ్వర్, బృందం భక్తి సంగీత విభావరి అలరించింది. కోలాట బృందం నృత్యాలు, విన్యాసాలు, ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వైకుంఠ ద్వార దర్శనంలో జాప్యం
వైకుంఠ ఏకాదశి సందర్భంగా, ఉత్సవాలలో ప్రధానమైన ఉత్తర ద్వార దర్శన కార్యక్రమ నిర్వహణ విషయంలో, పెరిగిన రద్దీ కారణంగా, దైవ సేవలు ద్వారం గుండా వేంచేపు చేయడంలో కాలా యాపన జరిగింది. వాస్తవానికి కారణాలేవైనా, ప్రత్యేక వేదిక వద్ద పూజలు 5గంటల తర్వాత ప్రారంభం చేశారు. 
ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశి ప్రభాత సమయంలో, వైకుంఠంలో శ్రీమహావిష్ణువును దర్శించి తరించిన నేపథ్యంలో, ఇంద్రాది దేవతలు జరుపు కుంటున్న ఈ ఉత్సవ వేడుకలలో ప్రాతః కాలంలో బ్రాహ్మీముహూర్తంలో పూ జలొనర్చి, సూర్యోదయానికి ముందే వైకుంఠ (ఉత్తర) ద్వారం తెరవబడి, ఆ ద్వారం గుండా వేంచేసే స్వాముల దర్శనాలు చేసుకోవడం ప్రధానం మరియు క్షేత్రంలో అనుసరణీయమైన సాంప్రదాయం కాగా, భక్తుల రద్దీ అధికమై, దర్శనాలకై బారులు తీరిన సందర్భంలో, ఉదయాత్పూ ర్వమే ఉత్తర ద్వారం తెరిచినా, స్వాముల సేవల వేంచేపు చాలా ఆలస్యమై ఉదయం
8.30గంటల వరకు దైవ సేవలు పట్టణంలోకి వెళ్ళడం నిర్వహించారు. స్వాముల ఉత్సవ మూర్తుల సేవలను పట్టణ వీధుల గుండా ఊరేగించి, ఇసుక స్థంభం వద్ద పూజలు నిర్వహించాక, దేవస్థానానికి తిరిగి వచ్చారు.
ముక్కోటి వేదిక వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, వైకుంఠ ద్వారం నుండి భక్తుల దర్శనాలను కొనసాగించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రెండో విడత 7 మండలాల్లోని గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతం
జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు)జిల్లాలో రెండో విడత నిర్వహించిన గ్రామపంచాయతీ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సందర్శించి పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ గౌడ్ డిపిఓ రఘువరన్ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు... రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం మద్దతు ఇచ్చిన అభ్యర్థులే గెలుస్తారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ డిసెంబర్ 14 (ప్రజా మంటలు) మండలం అంతర్గాం గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మద్దతు ఇచ్చిన అభ్యర్థులే ఎక్కువ శాతం గెలుస్తారని ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.జగిత్యాల నియోజకవర్గంలో... సత్యమే గెలుస్తుంది – ఓట్ల చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం : రాహుల్ గాంధీ
న్యూ డిల్లీ డిసెంబర్ 14:
“సత్యమనే నినాదంతో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించుతాం” అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడుతోందని, ఆ ప్రక్రియలో ఎన్నికల సంఘం (EC) కూడా కేంద్రంతో చేతులు కలిపి పనిచేస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
ఓట్ల... డెహ్రాడూన్‌లో సామల వేణుకు పీఆర్ ఎక్సలెన్స్–2025 అవార్డు
సికింద్రాబాద్, డిసెంబర్ 14 (ప్రజామంటలు) :
డెహ్రాడూన్‌లో జరిగిన 47వ జాతీయ ప్రజాసంబంధాల సదస్సులో హైదరాబాద్‌కు చెందిన అంతర్జాతీయ ఇంద్రజాలికుడు సామల వేణుకు ‘పబ్లిక్ రిలేషన్స్ ఎక్సలెన్స్–2025’ అవార్డు లభించింది. డెహ్రాడూన్ లో ఆదివారం హోటల్ ఎమరాల్డ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు నరేష్ భన్సాల్ ఈ అవార్డును అందజేశారు.మ్యాజిక్‌ను మాధ్యమంగా చేసుకుని ప్రజాసంబంధాలకు విశేష... నెహ్రూపై తప్పుడు కథనాలు, మణిభెన్ డైరీ పేరుతో చరిత్ర వక్రీకరణ
(ప్రత్యేక విశ్లేషణ)
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల చేసిన ఒక వ్యాఖ్య దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా చరిత్రపరమైన సున్నిత అంశాలపై మరోసారి చర్చకు దారితీసింది. ఆయన చేసిన వ్యాఖ్య ప్రకారం — పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ ఖర్చుతో బాబ్రీ మసీదును పునర్నిర్మించాలనుకున్నారు అని, ఇందుకు ఆధారంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కుమార్తె మణిభెన్... "కీ శే"నల్ల రాజిరెడ్డి ఆశయాలతో సర్పంచ్ గా గెలిపిస్తే ఎప్పటికీ మీ ఇంటి ఆడబిడ్డ గా ఉంటా."
" నా బలం మీ నమ్మకం నా లక్ష్యం మన గొల్లపల్లి ఊరి అభివృద్ధి." సర్పంచ్ అభ్యర్థి నల్ల నీరజ సతీష్ రెడ్డి గొల్లపల్లి డిసెంబర్ 14ప్రజా మంటలు ( ప్రతినిధి అంకం భూమయ్య):
గొల్లపల్లి గ్రామ ప్రజలు సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి... నేత్రదాత గుంటోజు వరలక్ష్మి సంస్మరణ సభ ::నేత్రదానంపై అవగాహన కార్యక్రమం
భూపాలపల్లి / గోరికొత్తపల్లి, డిసెంబర్ 14 (ప్రజామంటలు) :
భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం చిన్న కోడెపాక గ్రామంలో నేత్రదాత గుంటోజు వరలక్ష్మి సంస్మరణ సభను ఆదివారం వారి స్వగృహంలో కుటుంబ సభ్యులు మరియు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేత్రదానం, అవయవ దానం, శరీర దానం ప్రాధాన్యతపై వచ్చిన బంధు... 4 వ,వార్డు సభ్యునికి మద్దతు తెలిపిన ఆర్య వైశ్యులు
గొల్లపల్లి డిసెంబర్ 14 (ప్రజా మంటలు ప్రతినిధి అంకం భూమయ్య)
గొల్లపల్లి గ్రామాన్ని ఆదర్శ గా తీర్చిదిద్దడానికి, పారదర్శకమైన, నిజాయితీతో కూడిన పాలన అందించడానికి మీ ముందుకు వస్తున్న 4వ, వార్డు అభ్యర్థిగా క్యాస సతీష్ ప్రధాన ఐదు హామీలు:మన వీధిలో క్రమం తప్పకుండా చెత్త తొలగింపు మరియు డ్రైనేజీ వ్యవస్థను, పారిశుద్ధ్యానికి అత్యంత... జిల్లా పరిధిలో ప్రశాంతంగా జరిగిన రెండవ విడత సర్పంచ్ ఎన్నికలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు)రెండవ విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగి న్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న జాబితా పూర్, లక్ష్మీ పూర్, పొలస గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.
ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోనట్లు తెలిపారు .జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన... SIR పేరుతో మహిళల హక్కుల హరణం.. బీజేపీపై మమతా బెనర్జీ ఘాటు విమర్శలు
కృష్ణ నగర్ (పశ్చిమ బెంగాల్) డిసెంబర్ 14:
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమూల సవరణ (SIR) పేరుతో మహిళల హక్కులను హరించే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణ నగర్లో SIRకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీకి మమతా... ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్… కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ
హైదరాబాద్ డిసెంబర్ 15
నిన్న ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన మెస్సీ – రేవంత్ టీమ్‌ల ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు.
ఈ ప్రయాణ సమయంలో రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయ పరిణామాలపై... 