మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి - ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

On
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి - ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
- ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

 (రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి జనవరి 09:
 విద్యా సంస్థలలో మధ్యాహ్న భోజన నిర్వాహకుల సమస్యలు తీర్చేందుకు చిత్తశుద్ది తో కృషి చేయ గలమని రాష్ట్ర ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు. 
ధర్మపురి పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల లో గురువారం  ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన వంట పాత్రల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..ప్రభుత్వం ద్వారా వచ్చిన వంట పాత్రల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపు కుంటున్నామని, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండే కార్మికుల వేతనాల పెంపు, విద్యార్థులకు పెట్టే గుడ్డు ధరలు పెంచడం వంటి తదితర సమస్యలను తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని, కచ్చితంగా ఇట్టి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, అదే విధంగా వంటకు సిలిండర్లు లేక కొంత ఇబ్బంది కలుగుతుందని చెప్పడం జరిగిందని ఎక్కడైతే సిలిండర్ల అవసరం ఉందో మండల విద్యాధికారి కి  నివేదిక ఇవ్వాలని సూచించారు. జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి అట్టి సమస్యను పరిష్కరిస్తామని, విద్యార్థుల భోజనం విషయంలో నాణ్యత పాటించే విధంగా ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం విద్య వ్యవస్థకు పెద్ద పీట వేయడం జరిగిందని వివరించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ సత్తమ్మ, ఎం ఈ ఓ సీతాలక్ష్మి,  
స్కూల్ హెచ్ ఎం, ఉపాద్యాయులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

అంగరంగ వైభవంగా శ్రీ ధనలక్ష్మి సమేత ధన్వంతర స్వామి కళ్యాణ వేడుకలు

అంగరంగ వైభవంగా శ్రీ ధనలక్ష్మి సమేత ధన్వంతర స్వామి కళ్యాణ వేడుకలు జగిత్యాల నవంబర్ 18 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని   శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయము  లో ఘనంగా   శ్రీ ధనలక్ష్మి సమేత శ్రీ ధన్వంతరి స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.   మంగళ వారం  కార్తీక  మాసం  శుక్ల పక్షం త్రయోదశి  ఉ.  సుప్రభాత సేవ మరియు మూలవిరాట్టుకు అభిషేకములు నిర్వహించారు. భక్తులు...
Read More...

ప్రజల్లో చైతన్యం కోసం పోలీసుల కళా ప్రదర్శనలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  గ్రామీణ ప్రాంతాలలో విస్తృత కార్యక్రమాలతో సామాజిక అంశాల పై అవగాహన

ప్రజల్లో చైతన్యం కోసం పోలీసుల కళా ప్రదర్శనలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   గ్రామీణ ప్రాంతాలలో విస్తృత కార్యక్రమాలతో సామాజిక అంశాల పై అవగాహన   జగిత్యాల నవంబర్ 18 (ప్రజా మంటలు)సత్ఫలితాలిస్తున్న అవగాహన కార్యక్రమాలు- మూఢ విశ్వాసాల పై ప్రజలలో కనిపిస్తున్న మార్పు జగిత్యాల జిల్లా ప్రజల్లో సామాజిక అంశాల పై  చైతన్యం పెంపొందించేందుకు పోలీసులు నిరంతరం వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారని జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,  తెలిపారు. 2016 నుoడి  జగిత్యాల పోలీస్ కళా బృందం జిల్లా వ్యాప్తంగా...
Read More...

మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్టు హిడ్మా ఎన్‌కౌంటర్

మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్టు హిడ్మా ఎన్‌కౌంటర్ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లీ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు మృతి. హిడ్మా భార్య, కీలక నాయకులు, PLGA సభ్యుల మరణం. AP ఇంటెలిజెన్స్ ధృవీకరణతో పూర్తి వివరాలు.
Read More...

హరిహరాలయంలో కార్తీక సోమవారం ఘనంగా పరమ శివునికి అభిషేకాలు 

హరిహరాలయంలో కార్తీక సోమవారం ఘనంగా పరమ శివునికి అభిషేకాలు  జగిత్యాల నవంబర్ 17 (ప్రజా మంటలు)జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో కార్తీక సోమవారం చివరి సోమవారం కావడంతో భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి చేరుకొని పరమ శివునికి పంచామృతాలతో అభిషేకించి కార్తీకదీపంలు వెలిగించారు. ఈ సందర్భంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆలయ అధ్యక్షులు చాకుంట వేణుమాధవ రావు దంపతులు సాంబశివునికి వివిధ...
Read More...
Local News  State News 

ఖమ్మం జిల్లా లో–జాగృతి జనంబాట పర్యటనలో మాడల్ స్కూల్ ను సందర్శించిన కవిత

ఖమ్మం జిల్లా లో–జాగృతి జనంబాట పర్యటనలో మాడల్ స్కూల్ ను సందర్శించిన కవిత ఖమ్మం నవంబర్ 18 (ప్రజా మంటలు): ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లిలోని మోడల్ స్కూల్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  ఈరోజు సందర్శించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. స్కూల్ హాస్టల్ భవనంలో పెచ్చులూడిన గోడలు, పైకప్పు ఊడిపోవడం వల్ల ప్రమాదకర పరిస్థితి నెలకొన్నట్లు...
Read More...
Local News  State News 

హైదరాబాద్‌లో బంగారం–వెండి ధరల్లో స్వల్ప మార్పులు

హైదరాబాద్‌లో బంగారం–వెండి ధరల్లో స్వల్ప మార్పులు హైదరాబాద్, నవంబర్ 18 (ప్రజా మంటలు):హైదరాబాద్‌లో బంగారం మరియు వెండి ధరలు ఈరోజు స్వల్ప మార్పులతో స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఊగిసలాట, రూపాయి మార్పిడి విలువ, స్థానిక డిమాండ్ వంటి అంశాలు నగర రేట్లపై ప్రభావం చూపుతున్నాయి. ధరలను స్థానిక వ్యాపారులతో మాట్లాడి సరిపోల్చుకోండి. ఇవి సమాచారం కొరకు మాత్రమే. వాస్తవ...
Read More...
Local News  Crime 

ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌ను కలిసిన కొత్త రూరల్ ఎస్ఐ

ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌ను కలిసిన కొత్త రూరల్ ఎస్ఐ జగిత్యాల (రూరల్), నవంబర్ 18 (ప్రజా మంటలు):జగిత్యాల రూరల్ పోలీస్‌స్టేషన్ నూతన ఉపనిర్వాహక అధికారి (SI)గా ఉమా సాగర్ గారు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, సన్మాన సూచికగా మొక్కను అందజేశారు. ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఉమా సాగర్,...
Read More...

బేగంపేట్‌లో రోడ్డు ప్రమాదం: థార్‌ వాహనం నుజ్జునుజ్జు, ట్రక్ బోల్తా

బేగంపేట్‌లో రోడ్డు ప్రమాదం: థార్‌ వాహనం నుజ్జునుజ్జు, ట్రక్ బోల్తా బేగంపేట్ బస్ స్టాప్ వద్ద థార్ వాహనాన్ని వెనుకనుంచి ఢీకొట్టిన హెవీ లోడ్ ట్రక్ బోల్తా. గాయపడిన వారు ఆసుపత్రికి తరలింపు. పోలీసులు ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.
Read More...
Local News  Crime  State News 

వికటించిన ఐవీఎఫ్ చికిత్స… శంషాబాద్‌లో భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్య

వికటించిన ఐవీఎఫ్ చికిత్స… శంషాబాద్‌లో భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్య శంషాబాద్‌లో ఐవీఎఫ్ చికిత్స వికటించడంతో ఎనిమిదో నెల గర్భిణి శ్రావ్య, గర్భంలోని కవలలు మృతి. షాక్ తట్టుకోలేక భర్త విజయ్ ఆత్మహత్య. కుటుంబాన్ని దుఃఖంలో ముంచేసిన హృదయ విదారక ఘటన పూర్తి వివరాలు.
Read More...

ఐ–బొమ్మ పైరసీ వెబ్‌సైట్ లో సంచలన ప్రకటన

ఐ–బొమ్మ  పైరసీ వెబ్‌సైట్ లో సంచలన ప్రకటన హైదరాబాద్, నవంబర్ 17 (ప్రజా మంటలు): ఇన్నాళ్లు పోలీసులను చాలెంజ్ చేసిన ibomma సంచలన ప్రకటనను తన వెబ్సైట్ లో పోస్ట్ చేసింది. ఐ–బొమ్మ తన ప్రకటనలో, “ఈ మధ్యలో మీరు మా గురించి విన్నే ఉంటారు… మొదటి నుంచీ మా విశ్వసనీయ అభిమానులుగా ఉన్నారు… కానీ ఇప్పుడు మా సేవలను నిలిపివేస్తున్నాం. దేశవ్యాప్తంగా మా...
Read More...
Local News  State News 

ఖమ్మం జాగృతి జనంబాటలో సమస్యలపై కవిత విమర్శలు, పరిశీలనలు

ఖమ్మం జాగృతి జనంబాటలో సమస్యలపై కవిత విమర్శలు, పరిశీలనలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జాగృతి జనంబాటలో భాగంగా కవిత పర్యటన. మోడల్ స్కూల్ సమస్యలు, సీతారామ ఎత్తిపోతల పథకం ఆలస్యం, సింగరేణి కార్మికుల ఇబ్బందులు, వైరా మార్కెట్ సమస్యలు, ప్రజా సమస్యలపై కీలక వ్యాఖ్యలు. సమగ్ర కథనం
Read More...
Local News 

15 దుకాణాలకు ఓపెన్ వేలం వేసి కేటాయించండి. - ప్రజావాణికి వినతి పత్రం సమర్పణ

15 దుకాణాలకు ఓపెన్ వేలం వేసి కేటాయించండి. - ప్రజావాణికి వినతి పత్రం సమర్పణ సికింద్రాబాద్, నవంబర్ 17 (ప్రజామంటలు) : బన్సీలాల్ పేట డివిజన్ లోని న్యూ బోయిగూడ, ఐడీహెచ్ కాలనీల పరిధిలోని 15 జీహెచ్ఎమ్ సీ షాపింగ్ కాంప్లెక్స్ లల్లోని మొత్తం 15 దుకాణాలకు కొత్తం ఓపెన్ వేలం వేసి, అర్హులకు కేటాయించాలని సికింద్రాబాద్‌ జీహెచ్‌ఎంసీ నార్త్‌ జోన్‌ అధికారులకు కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు ఐత చిరంజీవి సోమవారం...
Read More...