ది హిందూ పత్రిక వ్యవస్థాపకులు సుబ్రహ్మణ్య అయ్యర్.
- జనవరి 19 - సుబ్రహ్మణ్య అయ్యర్ జయంతి.
రచయిత: రామ కిష్టయ్య సంగన భట్ల.
9440595494
భారతదేశములో ఒక విశిష్ట స్థానం కలిగి, దక్షిణ భారత దేశములో ఎక్కువ ప్రచురణ కలిగిన పత్రికగా, ప్రాచుర్యంలో ఉన్న ది హిందూ (The Hindu) ఆంగ్ల దినపత్రికను 140 సంవత్సరాలు కిందట ప్రధానంగా తిరువయ్యారుకు చెందిన 23 ఏళ్ళ జి. సుబ్రమణ్య అయ్యర్... ఆయన స్నేహితుడు, పచ్చయ్యప్ప కళాశాలలో ఆయన సహోద్యోగి, చెంగల్పట్టుకు చెందిన 21 ఏళ్ళ ఎం. వీరరాఘవా చారియర్ - నలుగురు న్యాయ శాస్త్ర విద్యార్థులు టి.టి.రంగాచారియర్, పి.వి. రంగాచారియర్, డి.కేశవ రావు పంత్, న్యాపతి సుబ్బారావు పంతులుతో కలిసి ట్రిప్లికేన్ సాహితీ సంఘం పేరుతో స్థాపించారు.
సుబ్రహ్మణ్య అయ్యర్ సుప్రసిద్ధ పాత్రికేయుడు, సంఘ సంస్కర్త, స్వతంత్ర సమర యోధుడు. ఆయన సుప్రసిద్ధ భారతీయ ఆంగ్ల దినపత్రిక ది హిందూ పత్రికను 20 సెప్టెంబరు 1878న స్థాపించారు. అది మొదలు 1878 లో వారపత్రికగా, 1889 లో దిన పత్రికగా మారింది. అయన ది హిందూ పత్రికకు 20 సెప్టెంబరు 1878 నుంచి అక్టోబర్ 1898 వరకూ అధినేతగానూ, సంపాదకునిగానూ, మేనేజింగ్ డైరెక్టర్ గానూ వ్యవహరించారు.
ఆనాటి మద్రాసు ప్రెసిడెన్సీ, తంజావూరు జిల్లాలో తిరువదిలో సుబ్రహ్మణ్య అయ్యర్ జనవరి 19, 1855న జన్మించారు.
మద్రాసు ఉన్నత న్యాయస్థానపు బెంచ్ కు సర్. టి.ముత్తుస్వామి అయ్యర్ ను నియమించాలన్న విషయంపై తమ మద్దతును వినిపించేందుకు సుబ్రహ్మణ్య అయ్యర్ ఎం. వీరరాఘవాచార్యర్, టి.టి.రాఘవాచార్యర్, పి.వి.రంగాచార్యర్, డి. కేశవరావు పంత్, ఎన్. సుబ్బారావు పంతులు వంటివారితో కలిసి 20 సెప్టెంబర్ 1878లో ది హిందూ స్థాపించారు. మొదట్లో వారపత్రికగా ది హిందూ ప్రారంభమైంది, తర్వాత మూడు వారాలకు ఓసారి వెలువడే పత్రికగా మారి చివరకు దినపత్రికగా స్థిరపడింది.
సుబ్రహ్మణ్య అయ్యర్ అనేక స్టింగ్ ఆపరేషన్లతో తీక్షణమైన, సునిశితమైన వ్యాసాలు రాశారు. భారత స్వాతంత్ర్య ఆశయాన్ని క్రియాశీలంగా సమర్థించి, బ్రిటీష్ సామ్రాజ్యవాదంపై నిరసన వ్యక్తం చేసేందుకు పత్రికను ఉపయోగించారు. 1897లో బాలగంగాధర తిలక్ ను బ్రిటీష్ అధికారులు నిర్బంధించి, జైలు పాలు చేసినప్పుడు ది హిందూ, అరెస్టును తీవ్రంగా ఖండించింది. 1883 డిసెంబర్ 3న పత్రిక 100 మౌంట్ రోడ్డుకు మారి, తన స్వంత ప్రెస్ అయిన ది నేషనల్ ప్రెస్ ను స్థాపించింది.
ది హిందూ 12 డిసెంబర్ 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటైనప్పుడు ఆ పరిణామాన్ని ఆహ్వానిస్తూ సంపాదకీయంలో రాశారు.
అయన సంప్రదాయ వాదానికి, మూఢ విశ్వాసాలకు పూర్తి వ్యతిరేకి, సంస్కరణల ప్రోత్సాహానికి ఆయన తన పత్రికను వినియోగించు కున్నారు.
సుబ్రహ్మణ్య అయ్యర్ వ్యాసాలు పత్రికను ఎన్నో పరువునష్టం దావాల్లోకి నెట్టాయి, కేసులపై పోరాటం సుబ్రహ్మణ్య అయ్యర్ ఆర్థిక స్థితిని దారుణంగా దిగజార్చింది. 1898లో సుబ్రహ్మణ్య అయ్యర్ ప్రధాన సంపాదకుడి పదవిని వీరరాఘవాచార్యర్ కు అప్పగించారు. 1905లో వార్తాపత్రికను సుసంపన్నుడైన బారిస్టరు కస్తూరి రంగ అయ్యంగార్ కొనేశారు.
సుబ్రహ్మణ్య అయ్యర్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాలుపంచు కున్నారు. 12 డిసెంబర్ 1885లో తేజ్ పాల్ సంస్కృత కళాశాల వద్ద నిర్వహించిన, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు కారణమైన బొంబాయి కాన్ఫరెన్సులో పాల్గొన్న 72 మంది ప్రతినిధుల్లో ఆయన కూడా ఒకరు. భారత జాతీయ కాంగ్రెస్ రెండవ సమావేశాల్లో ప్రభుత్వ సర్వీసుల్లో భారతీయుల ప్రాతినిధ్యం గురించి నివేదించే కమిటీలో సుబ్రహ్మణ్య అయ్యర్ సభ్యునిగా ఎంపికయ్యారు. 1887 మద్రాసు సమావేశాల్లో అయన భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగాన్ని తయారుచేసే కమిటీలో సభ్యునిగా నియమితులయ్యారు. 1894 మద్రాసు సమావేశాల్లో లండన్ లో భారత రాజ్య కార్యదర్శి ఎదుట భారత జాతీయవాదుల వాదన వినిపించే ప్రతినిధి బృందంలో ఒకరిగా ఎంపికయ్యారు. ఫిరోజ్ షా మెహతా సూచనల ప్రకారం దక్షిణాఫ్రికాలో భారతీయుల స్థితిగతులను భారత దేశంలో వివరించేందుకు చేసిన పర్యటనలో భాగంగా పచ్చయ్యప్ప హాలులో ప్రసంగించినప్పుడు గాంధీని ఆయన కలిశారు. ఈ విషయాన్ని గాంధీ తన ఆత్మకథలో ప్రస్తావించారు. 1906లో ఆయన భారత జాతీయ కాంగ్రెస్ లక్ష్యాలను ప్రచారం చేసే స్టాండింగ్ కమిటీలో సభ్యునిగా ఎంపికయ్యారు.
1898లో సుబ్రహ్మణ్య అయ్యర్ ది హిందూతో తనకున్న సంబంధాలను విరమించుకుని, 1882లో తాను ప్రారంభించిన తమిళ వార్తాపత్రిక "స్వదేశ మిత్రన్" పై దృష్టిపెట్టారు. 1898లో ది హిందూను విడిచిపెట్టినప్పుడు స్వదేశమిత్రన్ ను మూడువారాలకు ఓసారి వెలువరించగా, 1899లో తొలి తమిళ దినపత్రికగా అభివృద్ధి చేశారు.
సుబ్రహ్మణ్య భారతి... సంపాదకుడి శైలిని వర్ణిస్తూ - "సుబ్రహ్మణ్య అయ్యర్ కలం బాగా ఘాటైన సన్న పచ్చి మిరప కాయల ముద్దలో ముంచినట్టు ఉంటుందని" అన్నారు. ఆ శైలి ఆయనను సమస్యల్లోకి నెట్టి 1908లో బ్రిటీషర్లు అరెస్టు చేసేదాకా తెచ్చింది. జైలులోని స్థితిగతులు, వేధింపులతో క్రమంగా ఆయన ఆరోగ్యం పాడైంది.
తర్వాతి కాలంలో సుబ్రహ్మణ్య అయ్యర్ కు కుష్టు వ్యాధి సోకగా, 18 ఏప్రిల్ 1916న మరణించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇదొక మనసును కలచివేసే, ఆలోచింపజేసే విషాదం.
అజిత్ పవర్ విమాన ప్రమాద దృశ్యాలు విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం
ముంబయి, జనవరి 28 (ప్రజా మంటలు):
మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) ప్రయాణిస్తున్న విమానం బుధవారం ఉదయం పుణే జిల్లా బారామతి సమీపంలో కుప్పకూలి, ఆయనతో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబయి నుంచి బారామతికి వెళ్తుండగా ఈ... దక్షిణభారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో రెండవ స్థానం సాధించిన ఉపాధ్యాయుని అభినందించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల జనవరి 27 ( ప్రజా మంటలు)సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 23 వరకు నిర్వహించిన దక్షిణ భారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో జగిత్యాల జిల్లా రాయికల్ మండల కుమ్మరి పెల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న కడకుంట్ల అభయ్ రాజ్ తయారుచేసిన సూపర్ సైన్స్ కిట్ ఉపాధ్యాయ బోధనోపకరణాల విభాగంలో ప్రదర్శనకు ద్వితీయ బహుమతి... భారత్ – యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందంపై సంతకం
న్యూఢిల్లీ, జనవరి 27 (ప్రజా మంటలు):
భారతదేశం – యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలు విజయవంతంగా ముగిసి, ఒప్పందంపై అధికారికంగా సంతకం చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
ఈ ఒప్పందాన్ని ప్రపంచ వ్యాప్తంగా **“అన్ని ఒప్పందాలకు తల్లి”**గా పిలుస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. ఇది భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య ఆర్థిక... సంచర జాతుల వారికి ఆహారం పంపిణీ
సికింద్రాబాద్, జనవరి 27 ( ప్రజా మంటలు):
77వ గణతంత్ర దినోత్సవాన్ని స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబెడ్కర్కు నివాళులు అర్పించారు. నగరంలో రోడ్ల పక్కన జీవనం సాగిస్తున్న సంచార జాతుల కుటుంబాలను గుర్తించి వారికి ఆహారం అందించారు.
దేశాభివృద్ధికి విద్యే ప్రధాన పునాది... జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం : ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల, జనవరి 27 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణ అభివృద్ధి ధ్యేయంగా బీఆర్ఎస్లో గెలిచి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాలకు రూ.62.5 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. గత అధికారుల నిర్లక్ష్యంతో మాస్టర్ ప్లాన్ లేక ఇష్టారీతిన నిర్మాణాలు జరిగాయని విమర్శించారు.
అభివృద్ధికి అడ్డంకులు... తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, జనవరి 27 (ప్రజా మంటలు):
తెలంగాణలోని 7 నగరపాలక సంస్థలు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదీ ప్రకటించారు. నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
ముఖ్య తేదీలు
నామినేషన్లు: జనవరి 28 నుంచి 30 వరకు
పరిశీలన: జనవరి 31
ఉపసంహరణ గడువు: ఫిబ్రవరి 3... బీసీ కులగణన అవసరం - జనగణనపై జాగృతి రౌండ్ టేబుల్
హైదరాబాద్, జనవరి 27 (ప్రజా మంటలు)::
ఈ నెల 29న కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణన నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు నవీన్ ఆచారి తెలిపారు.
బీసీలకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని, దేశవ్యాప్తంగా పకడ్బందీ కులగణన జరగాలని డిమాండ్ చేశారు.
ఒకే కులానికి భిన్న పేర్లు, వలస కులాల సమస్యలపై... గుంపుమేస్త్రికి ప్రధాన గూఢచారి సంతోష్ రావు : జాగృతి నేత కవిత తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్, జనవరి 27 (ప్రజా మంటలు):
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల నుంచి దూరం చేయడానికి ప్రధాన కారణం సంతోష్ రావేనని జాగృతి నేత తీవ్ర ఆరోపణలు చేశారు. గుంపుమేస్త్రికి ప్రధాన గూఢచారిగా వ్యవహరిస్తూ కేసీఆర్ వ్యక్తిగత విషయాల వరకూ సమాచారాన్ని చేరవేసిన వ్యక్తి సంతోష్ రావేనని విమర్శించారు.
కేసీఆర్ ఫార్మ్... చెన్నైలో గ్లోబల్ ఉమెన్స్ సమ్మిట్ :సీఎం ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా ప్రారంభం
చెన్నై, జనవరి 27:
తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఉమెన్స్ సమ్మిట్ మంగళవారం, బుధవారం (జనవరి 27, 28) తేదీల్లో చెన్నైలోని నందంబాక్కం ట్రేడ్ సెంటర్ లో జరుగుతోంది. ఈ సదస్సును ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించింది.... ఆస్కార్ అవార్డు లకు 10 సినిమాలు పోటీ
–వర్తమానం సంగమంగా మారిన సినిమా వేడుక
ప్రపంచ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 98వ అకాడమీ అవార్డ్స్ (Oscars 2026) ఈసారి కేవలం అవార్డుల వేడుకగా మాత్రమే కాకుండా —👉 సమాజం, రాజకీయాలు, చరిత్ర, మానవ విలువలపై చర్చకు వేదికగా మారింది.
🏆 బెస్ట్ పిక్చర్ విభాగం ఎందుకు ప్రత్యేకం?
ఈ... 