తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 6 అబద్ధాలు.. 66 మోసాలు
అన్నదాత అరిగోశలు.. మోసపోయిన మహిళలు. ఉద్యోగుల గోసలు
తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
6 అబద్ధాలు.. 66 మోసాలు
అన్నదాత అరిగోశలు.. మోసపోయిన మహిళలు. ఉద్యోగుల గోసలు.
గొల్లపల్లి డిసెంబర్ 04 ప్రజా మంటలు
కాంగ్రెస్ సంవత్సర పాలనలో జగిత్యాల అభివృద్ధి ఏది అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా"బోగ శ్రావణి ప్రశ్నించంది.
కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ అప్రజాస్వామిక మోసపూరిత పాలనలో గోస పడుతున్న బాధితులకు భరోసానిచ్చేందుకు భారతీయ జనతా పార్టీ భరోసా కల్పించేందుకు బిజెపి రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు జగిత్యాల్ నియోజకవర్గంలో ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆరు గ్యారంటీల అమలుపై చార్జిషీట్ ను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా "బోగ శ్రావణి విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజలను నమ్మించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఏడాది పాలనను పూర్తి చేసుకుంది కానీ నమ్మి ఓటు వేసిన ప్రజల జీవితాల్లో మార్పు మాత్రం రాలేదు,
కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు గ్యారెంటీల గారడితో తెలంగాణ ప్రజలను అనేక రకాలుగా దగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు విజయోత్సవాల పేరిట మరిన్ని అబద్ధాల ప్రచారానికి తెరలేపుతోంది. డిసెంబర్ 7న కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలపై భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల తరఫున విడుదల చేస్తున్న చార్షీట్.ఇది.
జగిత్యాల్ నియోజకవర్గం లో ప్రధాన సమస్య అయిన యావర్ రోడ్ మరియు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యలు ఇప్పటివరకు ముందుకు సాగని పరిస్థితి
జగిత్యాల్ నియోజకవర్గంలో ఒకరు 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరొకరు జగిత్యాల అభివృద్ధి కోసమని కాంగ్రెస్ పార్టీలో దొంగ చాటున చేరారు కానీ అభివృద్ధి మాత్రం కాలేదు.
రైతులందరికీ రూ.2 లక్షల పంట రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్నారు కానీ అది కొంతమంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు
ప్రతి ఏటా రైతు భరోసా కింద రైతులు కౌలురైతులకు ఎకరానికి ఇస్తామన్న రూ.15,000 ఇప్పటివరకు ఇవ్వకుండా మోసం చేసింది.
యువ వికాసం కింద విద్యార్థులకు ఇస్తామన్న రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు అనే అమలుకు నోచుకోలేదు.మరియు అదేవిధంగా నిరుద్యోగులకు నెలకు రూ. 4 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదు,
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల రూ. 2500 చొప్పున ఆర్థిక సాయం అందని ద్రాక్ష గానే మిగిలింది. మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అమలు చేశామని ప్రగల్బాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం బస్సులను తప్పించడంతో రద్దీ పెరిగి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు,
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తున్న ఇంతవరకు ఏ ఒక్కరికి కొత్త పెన్షన్ మంజూరు కాలేదు,
ప్రతి ఆటో డ్రైవర్ కు సంవత్సరానికి 12000 ఆర్థిక సాయం అందిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు ఇప్పటివరకు,
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడిచినా కూడా బీసీ డిక్లరేషన్ కానీ సబ్ ప్లాన్ కానీ అమలు చేయలేదు,
అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన ఏ ఒక్క అర్హుడికి కూడా రేషన్ కార్డు అందరి పరిస్థితి
కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళల భద్రత ప్రమాదంలో పడింది మహిళలపై వేధింపుల కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి,
కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత పాలనతో తెలంగాణ రాష్ట్రం మరింత అప్పుల ఊగులోకి కూరుకుపోతుంది,
ఈ కార్యక్రమంలో జగిత్యాల్ పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్, మండల అధ్యక్షులు నలువాల తిరుపతి,అడెపు నర్సయ్య, రామ్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శిలు ఆముదరాజు, సిరికొండ రాజన్న, జిల్లా కోశాధికారి సుంకేట దశరథ్ రెడ్డి, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి, జిల్లా అధికార ప్రతినిధి భూమి రమణ, మాజీ ఎంపీటీసీ ఆకుల మహేష్, పూజారి శ్రీనివాస్, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, టౌన్ ఇంచార్జ్ మ్యాదరి అశోక్, పవన్ సింగ్, గాదస్ రాజేందర్,సింగం పద్మ, దీటి వెంకటేష్, చెరుకు గంగారెడ్డి, మహేష్ యాదవ్, కందుకూరి లక్ష్మణ్, చిట్యాల రాము మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
యూజీసీ కొత్త నిబంధనలపై బీజేపీలోనూ విభేదాలు
విద్యామంత్రి వివరణ తర్వాత కూడా ఎందుకు ఆగని నిరసనలు?
న్యూఢిల్లీ, జనవరి 28 –(ప్రజా మంటలు);
ఉన్నత విద్యా సంస్థల్లో కుల ఆధారిత వివక్షను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఇటీవల తీసుకువచ్చిన కొత్త నిబంధనలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఈ నిబంధనలకు మద్దతు లభిస్తున్నప్పటికీ, మరోవైపు తీవ్ర... దుమారం లేపుతున్న మమత బెనర్జీ వ్యాఖ్యలు – రాజకీయ సందేశం ఏంటి?
కలకత్తా జనవరి 28 (ప్రజా మంటలు):
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాద మృతి దేశవ్యాప్తంగా కలకలం రేపిన వేళ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఘటనను కేవలం ప్రమాదంగా చూడలేమన్న ఆమె అభిప్రాయం, పూర్తి స్థాయి విచారణ అవసరమని చెప్పడం కొత్త... ఇదొక మనసును కలచివేసే, ఆలోచింపజేసే విషాదం.
అజిత్ పవర్ విమాన ప్రమాద దృశ్యాలు విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం
ముంబయి, జనవరి 28 (ప్రజా మంటలు):
మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) ప్రయాణిస్తున్న విమానం బుధవారం ఉదయం పుణే జిల్లా బారామతి సమీపంలో కుప్పకూలి, ఆయనతో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబయి నుంచి బారామతికి వెళ్తుండగా ఈ... దక్షిణభారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో రెండవ స్థానం సాధించిన ఉపాధ్యాయుని అభినందించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల జనవరి 27 ( ప్రజా మంటలు)సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 23 వరకు నిర్వహించిన దక్షిణ భారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో జగిత్యాల జిల్లా రాయికల్ మండల కుమ్మరి పెల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న కడకుంట్ల అభయ్ రాజ్ తయారుచేసిన సూపర్ సైన్స్ కిట్ ఉపాధ్యాయ బోధనోపకరణాల విభాగంలో ప్రదర్శనకు ద్వితీయ బహుమతి... భారత్ – యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందంపై సంతకం
న్యూఢిల్లీ, జనవరి 27 (ప్రజా మంటలు):
భారతదేశం – యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలు విజయవంతంగా ముగిసి, ఒప్పందంపై అధికారికంగా సంతకం చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
ఈ ఒప్పందాన్ని ప్రపంచ వ్యాప్తంగా **“అన్ని ఒప్పందాలకు తల్లి”**గా పిలుస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. ఇది భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య ఆర్థిక... సంచర జాతుల వారికి ఆహారం పంపిణీ
సికింద్రాబాద్, జనవరి 27 ( ప్రజా మంటలు):
77వ గణతంత్ర దినోత్సవాన్ని స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబెడ్కర్కు నివాళులు అర్పించారు. నగరంలో రోడ్ల పక్కన జీవనం సాగిస్తున్న సంచార జాతుల కుటుంబాలను గుర్తించి వారికి ఆహారం అందించారు.
దేశాభివృద్ధికి విద్యే ప్రధాన పునాది... జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం : ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల, జనవరి 27 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణ అభివృద్ధి ధ్యేయంగా బీఆర్ఎస్లో గెలిచి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాలకు రూ.62.5 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. గత అధికారుల నిర్లక్ష్యంతో మాస్టర్ ప్లాన్ లేక ఇష్టారీతిన నిర్మాణాలు జరిగాయని విమర్శించారు.
అభివృద్ధికి అడ్డంకులు... తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, జనవరి 27 (ప్రజా మంటలు):
తెలంగాణలోని 7 నగరపాలక సంస్థలు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదీ ప్రకటించారు. నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
ముఖ్య తేదీలు
నామినేషన్లు: జనవరి 28 నుంచి 30 వరకు
పరిశీలన: జనవరి 31
ఉపసంహరణ గడువు: ఫిబ్రవరి 3... బీసీ కులగణన అవసరం - జనగణనపై జాగృతి రౌండ్ టేబుల్
హైదరాబాద్, జనవరి 27 (ప్రజా మంటలు)::
ఈ నెల 29న కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణన నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు నవీన్ ఆచారి తెలిపారు.
బీసీలకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని, దేశవ్యాప్తంగా పకడ్బందీ కులగణన జరగాలని డిమాండ్ చేశారు.
ఒకే కులానికి భిన్న పేర్లు, వలస కులాల సమస్యలపై... గుంపుమేస్త్రికి ప్రధాన గూఢచారి సంతోష్ రావు : జాగృతి నేత కవిత తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్, జనవరి 27 (ప్రజా మంటలు):
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల నుంచి దూరం చేయడానికి ప్రధాన కారణం సంతోష్ రావేనని జాగృతి నేత తీవ్ర ఆరోపణలు చేశారు. గుంపుమేస్త్రికి ప్రధాన గూఢచారిగా వ్యవహరిస్తూ కేసీఆర్ వ్యక్తిగత విషయాల వరకూ సమాచారాన్ని చేరవేసిన వ్యక్తి సంతోష్ రావేనని విమర్శించారు.
కేసీఆర్ ఫార్మ్... చెన్నైలో గ్లోబల్ ఉమెన్స్ సమ్మిట్ :సీఎం ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా ప్రారంభం
చెన్నై, జనవరి 27:
తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఉమెన్స్ సమ్మిట్ మంగళవారం, బుధవారం (జనవరి 27, 28) తేదీల్లో చెన్నైలోని నందంబాక్కం ట్రేడ్ సెంటర్ లో జరుగుతోంది. ఈ సదస్సును ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించింది.... 