బి.సి వసతి గృహాలకు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి. - జిల్లా బీసీ సంక్షేమ సంఘం డిమాండ్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 3 (ప్రజా మంటలు) :
జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..... రాష్ట్రంలోని 296 బీసీ కళాశాల వసతి గృహాలు 321 గురుకులాలకు వెంటనే సొంత భవనాలు నిర్మించాలని బి సి సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
హాస్టల్లల్లో, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల మెస్ చార్జీల పెంపుపై కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్ల తమ నిరంతర పోరాటం తర్వాత మెస్ చార్జీలను పెంచడం ద్వారా సుమారు 8.60 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు నిర్ణయించేందుకు ఏర్పాటు చేసిన బి సి కమిషన్ అందించే నివేదికకు ఆధారంగా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో "ప్రత్యేక డెడికేషన్ కమిషన్" ఏర్పాటు చేసి రిజర్వేషన్లు వెంటనే ఖరారు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
మరియు రాష్ట్రంలో హాస్టల్లో గురుకుల పాఠశాల విద్యార్థుల మెస్ చార్జీలు పెంచడం హర్షణీయమని ముఖ్యమంత్రి కి, ఉపముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలుపుతున్నామని, అయితే మెస్ చార్జీలు పెంచడం వల్ల రాష్ట్రంలోని 8 లక్షల 60 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
కాలేజీ హాస్టళ్ళకు 1500 నుంచి 2100, గురుకుల హాస్టళ్లలో 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 950 నుంచి 1330, 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1100 నుంచి 1540కి పెంచడంతోపాటు కాస్మోటిక్ ఛార్జీలు పెంచారన్నారు.
అయితే పెంచిన ధరల ప్రకారం విద్యార్థులకు మంచి పౌష్టిక ఆహారం అందించాలన్నారు.
అలాగే రాష్ట్రంలోని 295 బీసీ కాలేజీ హాస్టళ్ళు, 321 బి సి గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలని, కాలేజీ విద్యార్థులకు నెలకు 500 చొప్పున పాకెట్ మనీ ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, బిసి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కు గంగాధర్, బి.సి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం రాంచందర్, బిసి మహిళా సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ రోజా (న్యాయవాది), బి.సి సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షురాలు బండపెల్లి మల్లీశ్వరి, యూత్ కో-ఆర్డినేటర్ హృషికేష్, ముద్దం గంగారెడ్డి, బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.