ట్రాన్స్ జెండర్ల వైద్యంపై గాంధీలో సైంటిఫిక్ సెషన్
టాఫిక్పై అవెర్నెస్ * ఆన్లైన్ లో పాల్గొన్న 300 , ఆఫ్ లైన్ లో 200 మంది వైద్యులు
ట్రాన్స్ జెండర్ల వైద్యంపై గాంధీలో సైంటిఫిక్ సెషన్
* దేశంలోనే మొదటిసారిగా ఈ టాఫిక్పై అవెర్నెస్
* ఆన్లైన్ లో పాల్గొన్న 300 , ఆఫ్ లైన్ లో 200 మంది వైద్యులు
సికింద్రాబాద్ నవంబర్ 02 (ప్రజామంటలు) :
ట్రాన్స్ జెండర్ల వైద్యం, వారిలో వచ్చే మానసిక, శారీరక నిర్మాణాల్లో వ్యత్యాసాలు, హార్మోన్ల ప్రభావం తదితర అంశాల్లో డాక్టర్లకు అవగాహన కల్పించేందుకు గాను గాంధీ మెడికల్ కాలేజీ ఫిజియోలజీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో ఒక రోజు కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ (సీపీడీ) సెమినార్ నిర్వహించారు. దేశంలోనే మొదటిసారిగా జరిగిన ఈ రాష్ర్ట స్థాయి అవెర్నెస్ సెమినార్ లో రాష్ర్టంలోని పలు ప్రభుత్వ వైద్యశాలల్లోని ప్లాస్టిక్ సర్జరీ, సైకాలజీ, ఫీజియోలజీ, ఎండొక్రనాలజీ, సైకియాట్రిక్,ఫోరెన్సిక్, తదితర డిపార్ట్ మెంట్ వైద్య నిపుణులు పాల్గొని ఆఫ్ లైన్ లో 200 మంది, ఆన్ లైన్ లో 300 మంది మొత్తం 500 మంది డాక్టర్లకు ట్రాన్స్ జెండర్ల వైద్యంపై వివరించారు. ఈసందర్బంగా ప్రొగ్రామ్ చైర్‌పర్సన్, గాంధీ మెడికల్ కాలేజీ ఫిజియోలజీ ప్రొఫెసర్ రమాదేవి మాట్లాడుతూ..దేశంలో ప్రస్తుతం ట్రాన్స్ జెండర్ల హక్కుల కోసం వాయిస్ పెరుగుతుందని, ఈ నేపద్యంలో ట్రాన్స్ జెండర్లకు కూడ మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రాష్ర్టంలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో 32 ట్రాన్స్ జెండర్ల కు ప్రత్యేక వైద్య విభాగాలను ఏర్పాటు చేసిందన్నారు. త్వరలో గాంధీ ఆసుపత్రిలో ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేసిన డాక్టర్ ప్రాచీ రాథోడ్ ప్రస్తుతం నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆర్థోపెడిక్ లో పీజీ చేస్తుందన్నారు. దేశంలో ప్రథమ ట్రాన్స్ జెండర్ పీజీ డాక్టర్ గా ఆమె ఖ్యాతి పాధించిందన్నారు. ఈసందర్బంగా డా.ప్రాచీ రాథోడ్ సెషన్ కు హాజరై ట్రాన్స్ జెండర్ గా తనకు ఎదురైన అరోగ్య, మానసిక సమస్యలు, తదితర అంశాలపై సమావేశంలో తన ప్రసంగంలో వివరించారు. అలాగే ట్రాన్స్ జెండర్ గా మార్పు చెందిన తర్వాత వచ్చే లీగల్ సమస్యలపై యాదాద్రి భువనగిరి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ డా.లావణ్య కౌసిల్ ప్రసంగించారు. హార్మోన్ల ప్రభావంపై ఉస్మానియా మెడికల్ కాలేజీ ఎండోక్రానలజీ ప్రొఫెసర్ డా.రాకేశ్ కుమార్ సహాయ్, బీబీనగర్ ఏయిమ్స్ సైకియాట్రిక్ అసోసియేట్ ప్రొఫెసర్ డా.మాలతేశ్, ప్లాస్టిక్ సర్జరీ ప్రొఫెసర్ డా.పాలుకూరి లక్ష్మీ, సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ గైనకాలజీ హెచ్ఓడీ ప్రొ.మహాలక్ష్మీ, చేవేళ్ళ పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.డి.జోయరాణి లు సమావేశంలో ట్రాన్స్ జెండర్లకు సంబందించిన అంశాలపై ప్రసంగించారు. కార్యక్రమంలో గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.కే.ఇందిర, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రొ.రాజకుమారి, సెమినార్ చైర్ పర్సన్ప్రొఫెసర్ రమాదేవి, వైస్ ప్రిన్సిపాల్ డా.రవిశేఖర్ రావు, డిప్యూటీ సూపరింటెండెంట్ డా.సుభోద్ కుమార్, ఫిజియోలజీ మోహన్ రెడ్డి, ఆయా ఆసుపత్రుల నుంచి వచ్చిన వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు
–––––––––––––
–ఫొటో
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ

ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన — 47 సార్లు దాడులు, 38 మంది పాలస్తీనియన్లు మృతి

రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి

టపాకులు రాత్రి 8 నుంచి 10 మధ్యనే కాల్చాలి - తిరుమలగిరి ఇన్స్పెక్టర్. జి నాగరాజు

దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి

పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించచ్చు - సుప్రీంకోర్టు

అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
.jpeg)
బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్
